Wednesday 28 December 2011

బాబు కోసం మన బాబులు ...


ఈ మధ్య తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర బల ప్రదర్శనలు చేయడం రాజకీయ పార్టీల నేతలకు ఫ్యాషన్ అయిపోయింది. ఒక బలమైన ఆకాంక్ష కోసం బలిదానాలకు పాల్పడిన అమరులను వీరి రాజకీయాలు వాడుకోవడం సిగ్గుచేటు. ముఖ్యంగా తెలంగాణ టిడిపి నేతలు ఈ విషయంలో విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. ఇదంతా త్వరలో జరగబోయే ఉప ఎన్నికలకోసమే అన్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఇక్కడే ఉన్నది పెద్ద విషాదం. రేపు జరగబోయే ఉప ఎన్నికల్లో పోటీకి నిలబడేది తెలంగాణ నేతలే. కానీ టిడిపి నేతల ఆరాటం మాత్రం సీమాంద్ర బాబును హీరో చెయ్యాలని, మంచిదే తమ నాయకుని కోసం కష్టపడడంలో తప్పులేదు. మోత్కుపల్లి చేస్తున్న ఆరోపణల్లో నిజానిజాలు సంగతి అటుంచితే, ఆయన తెలంగాణ గురించి, ఉద్యమం గురించి పూర్తిగా మరిచిపోయారు. కెసిఆర్ ఫాం హౌసులో రెస్ట్ తీసుకుంటున్నారని, తెలంగాణ ఉద్యమాన్ని ఢిల్లీ లో తాకట్టు పెట్టారని రోజు చెప్పిందే చెబుతున్నారు. అయితే యిప్పుడు తెలంగాణ టిడిపి తెలంగాణ కోసం ఏమిచేస్తున్నారు అన్నది ప్రశ్న! తెలంగాణ అంశం కేంద్రం పరిధిలో ఉంది, వాళ్ళే తేల్చాలి అని ముఖ్యమంత్రి మొదలు చంద్రబాబు, జగన్ ఇలా గోడమీది పిల్లులందరూ అదే వాదిస్తున్నారు. మరి ఈ సమస్య ఎందుకు తేలడం లేదు. తెలంగాణ టిడిపి ఫోరం తరుఫున కేంద్ర హోం మంత్రిని కలిసినప్పుడు అయన ఏమి చెప్పాడు. మీ పార్టీ వైఖరిని అడిగాడు కదా, మీరిచ్చిన వినతి పత్రాన్ని ఎవరు పంపపారు అని అడిగాడు కదా. ఇదీ బాబు అభిప్రాయమా,లేక మీ అభిప్రాయమా అని అడిగిన విషయం మరిచిపోయారా ఎర్రబెల్లి, మోత్కుపల్లి. అక్కడ జరిగిన అవమానం తోనే కదా నాగం తెలంగాణ పై  చంద్రబాబు లేఖ ఇవ్వాల్సిందే అని గట్టిగా పట్టుబట్టింది. దానికే కదా ఆయన్ని పార్టీ నుంచి బయిటికి పంపింది. ఎదుటి వారి తప్పులను ఎంచే ముందు మన వైఖరి స్పష్టంగా ఉండాలి కదా. ఆ పని తెలంగాణ టిడిపి నేతలు చేయగలరా? బాబును నిలదీయగలరా? యిప్పుడు తెలంగాణలో జరిగే ఉప ఎన్నికల్లో తెలంగాణ వాదం, సమైక్య వాదాలు లేవు. ఇన్నది ఒకే వాదం తెలంగాణ. 2004 ఎన్నికల్లో టిడిపి సమైక్య వాదం తో పోటీ చేస్తే ఈ ఫలితాలు వచ్చాయో అందరికీ తెలిసిందే. అలాగే అభివృద్ధి నినాదం తో కరీంనగర్ ఉపఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కు ఇచ్చిన షాక్ ఏమిటో విదితమే. తెలంగాణ, సమైక్య వాదాలు ఉన్నది డిసెంబర్ తొమ్మిది చిదంబరం ప్రకటనకు ముందే. ఇక ఆ తర్వాత సమైక్యవాదానికి అప్పుడే నూకలు చెల్లాయి. ఇకపై తెలంగాణాలో జరిగే ఉప ఎన్నికల్లో వచ్చే ఫలితాలు పార్టీ చిత్తశుద్ధిని చూపించేవే. ఇదీ తెలంగాణ తెలుగు తమ్ముళ్ళు గుర్తించుకుంటే మంచిది. బాన్సువాడ ఉప ఎన్నికల్లో డిపాసిట్ దక్కిందని సంబరపడిన కాంగ్రెస్ లాగా మీరు కూడా అలాగే సంతృప్తి చెందుతామంటే అది మీ ఇష్టం. అందుకే చంద్రబాబు రైతుల కోసం పెట్టినా అవిశ్వాసం, అలాగే తెలంగాణ కోసం రెండు సార్లు మీరు చేసిన 'రాజీ'నామాలు ఏమయ్యాయి? బాబు పెట్టిన అవిశ్వాసం జగన్ కు అసెంబ్లీ లో ఉన్న బలాన్ని, మీ రాజీనామాలు బస్సు యాత్రలకు  ఉపయోగపడ్డాయి. ఇదీ చంద్రబాబు తెలుగుదేశం, తెలంగాణ టిడిపి చేసిన ఉద్యమాల ఫలితాలు.

Labels:

Friday 23 December 2011

telangana




telangana





telangana








Thursday 22 December 2011

వ్యతిరేకం కాదంటే అనుకూలం కాదు....

నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు. ఇదీ చంద్రబాబు తెలంగాణ జిల్లాల్లో పర్యటించేటప్పుడు మాత్రమే ఉపయోగించే పదం. మరి అయన చెప్పిన వ్యతిరేకం కాదు అనే మాటను మనం అనుకూలంగా అనుకుందామనుకుంటే పొరపాటే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెప్పే ఏకాభిప్రాయం పాటకు ఈయన చెప్పే మాట కోరస్ లాంటిది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏకాభిప్రాయం కోసం ఎన్నడూ ప్రయత్నించలేదు. ప్రయత్నించరు కూడా. అలాగే చంద్రబాబు కూడా వ్యతిరేకం కాదు అంటే మాట మార్చి అనుకూలం అని మాట్లాడడు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పై అప్పుడప్పుడు పలికే చిలుక పలుకులు ఇక్కడి కాంగ్రెస్ నేతలకు సంతోషాన్ని కలిగిస్తాయి. ఇదీ వారికి వాళ్ళ  అధిస్టానం తెలంగాణపై సీరియస్ గా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక చంద్రబాబు చెప్పే మాయ పలుకులు ఈ ప్రాంత టిడిపి నేతలను పులకింపచేస్తాయి. వాళ్లకు ఎక్కడలేని ఉత్సహాన్ని తెచ్చిపెడుతాయి. అదే ఊపులో ఒక రణభేరి, ఒక బస్సుయాత్ర పేరుతో తెలంగాణ కోసం పోరాడుతున్నామని చెప్పేందుకు పర్యటనలు చేస్తారు. మీ అధినేత వైఖరి ఏంటి అని నిలదేస్తే బౌతిక దాడులు చేయిస్తారు. తమ అధినేత మెప్పు కోసం ఉద్యమకారులను నోటికొచ్చినట్టు తిడుతారు. ఇలా తెలంగాణ  కాంగ్రెస్, టిడిపి నేతలు రెండు సంవత్సరాలుగా తెలంగాణ కోసం తెగ కష్టపడుతున్నారు. వాళ్ళ శ్రమను వాళ్ళ అధినేతలు గుర్తిస్తున్నారు. అయినా తెలంగాణ ప్రజలు తమను పట్టించుకోవడం లేదనే కోపం వారిని వెంటాడుతున్నది. ఆ కోపం ఎలా వ్యక్తమవుతున్నదంటే చంద్రబాబు తెలంగాణ పర్యటనలో అయన కాన్వాయి పై కోడిగుడ్లు. ఒక చోట చెప్పు రూపం లో కనిపిస్తున్నాయి. దీంతో ఖంగు తిన్న తెలంగాణ తెలుగు తమ్ముళ్ళు అక్కడ ఉద్యమకారులపై తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఎక్కడైనా నాయకుని వెనుక కార్యకర్తలు నడుస్తారు. పాపం చంద్రబాబు ఇక్కడ కార్యకర్తలు, తన సొంతః సైన్యం సహాయంతో తెలంగాణలో పర్యటనలు చేస్తున్నారు. దీనికి అనూహ్య స్పందన వస్తున్నదని చంద్రబాబు కో మీడియా కోడై కూస్తున్నది. అది పతాక శీర్షికలో. నిరసన మాత్రం ఎక్కడో లోపలి పేజిలో ఉంటుంది. బాబు గారి పర్యటన బాగా జరగడానికి కిరణ్ బాబు సహకారం ఉండనే ఉన్నది. ఎందుకంటే యిప్పుడు వారిది తెలంగాణాను అడ్డుకోవడానికి ఏర్పడ్డ మాయా కూటమి .

Saturday 10 December 2011

మా పేరు ఏకాభిప్రాయం....



తెలంగాణ పై తేల్చే టైం వచ్చింది ఆజాద్ అనడం కొత్తకాదు. మళ్లీ మళ్లీ మళ్లీ అయన అదే పాట పాడుతున్నారు. దీనికి కారణం బహుశా అవిశ్వాస తీర్మానం సందర్భంగా  తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధిష్టానం పై చూపిన విధేయత కావొచ్చు. అందుకే వారు అదే మాట మాట్లాడుతున్నారు, మనవాళ్ళు వారి బాటనే పయనిస్తున్నారు. నల్లారి అడుగుల్లో నడుస్తున్న ఈ బానిస నేతలకు అధిస్టానం ఇచ్చిన నజరానా తెలంగాణ సమస్య సంక్లిష్టమైనది, సున్నితమైంది అనే పదాలు. ఈ పదాలకు కాంగ్రెస్ పెద్దల దగ్గర చాలా పర్యాయ పదాలున్నాయి. కాంగ్రెస్ దృష్టిలో తెలంగాణ అంటే ఏకాభిప్రాయం. అది సాధ్యం కానీ సమస్య. సాచివేత సమస్య, అంటే ఆజాద్ చెప్పిన మాటలకు స్పందించే ఓపిక తెలంగాణ ప్రజానీకానికి లేదు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఇస్తుందో లేదో తెలియకున్నా ఈ ప్రాంత నేతలు ఉద్యమం లో భాగస్వాములు కావాలని, పదవులను వదులుకొని పజల పక్షాన ఉండాలని ఉంటారని రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇక్కడ ప్రజల ఆకాంక్ష వేరు కాంగ్రెస్ నేతల ఆలోచన వేరు. అది ఏమిటో మొన్న అవిశ్వాస తీర్మానం సందర్బంగా చూపారు. నరనరాన కాంగ్రెస్ నైజాన్ని చూపారు. ముఖ్యమంత్రిని తిట్టిన వాళ్ళు, అది సీమాంద్ర సభ అన్నవాళ్లు అందరూ ఒక్కటై పోయారు. ఆ మధ్య జైపాల్ రెడ్డి అన్నట్టు కాంగ్రెస్ వాదులు ప్రాంతీయ వాదులుగా ఉండరాదు, జాతీయవాదులుగా ఉండాలన్న మాటను అక్షరాల పాటించారు. ఇంత విధేయత వారికి ఎక్కడి నుంచి వచ్చింది. కావూరి అన్నట్టు పదవులు లేకుండా  తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒక గంట కాదు కదా ఒక్క నిమిషం కూడా ఉండలేరు అనడానికి నిదర్శనం. ఇక తెలంగాణ కు ప్రాంతీయ మండలి, ప్యాకేజీ అంటూ సీమాంద్ర మీడియాలో చర్చలు మామూలే. అందుకే యిప్పుడు తెలంగాణ ప్రజలు రాజీనామాల కోసం పట్టుబడడం లేదు. నేలుగున్నర కోతల ప్రజానీకాన్ని వంచించిన వారికి రాజకీయ మరణ శాశనం రాయబోతున్నారు.  మన్మోహన్, చిదంబరం, ప్రణబ్, ఆజాదు. అభిషేక్ సింగ్వి, రషీద్ ఆల్వి, మనీష్ తెవారి లు చెప్పే రోజుకో స్క్రీన్ ప్లే కు ఇక ముగింపు తప్పదు.

Thursday 8 December 2011




Labels:

Saturday 3 December 2011

చలి కాలంలో 'అవిశ్వాస' వేడి


అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం వేడి మొదలైంది. ఒకవైపు పార్టీలు విప్ జారీ చేశాయి. మరో వైపు తమ బలబలాలపై ఎమ్మెల్యేలతో సంప్రదింపులు మొదలయ్యాయి. అయితే ఈ అవిశ్వాస తీర్మానం ప్రభావం కేవలం కాంగ్రెస్ పార్టీ, జగన్ కు మధ్యే ఉన్నట్టు తాజా పరిణామాలను చూస్తే స్పష్టంగా కనిపిస్తున్నది. జగన్ వర్గం నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి వెళ్లి పోవడంతో కిరణ్ సర్కారు అవిశ్వాస తీర్మానాన్ని ధీటుగా ఎదురుకుంటామని సవాళ్ళు కూడా విసిరింది. మొన్నటి దాక తన వైపు ఉన్న ఎమ్మెల్యేల్లో కొంత మంది బహిరంగంగానే ముఖ్యమంత్రిని కలిసి మద్దతు తెలిపారు. ఇదీ జగన్ వర్గాన్ని కలవరపెట్టింది. టిడిపి అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడం తో ఇక జగన్ కూడా గుంటూరు ఓదార్పు యాత్రకు విరామం ఇచ్చి నేరుగా రంగం లోకి దిగారు. జగన్ నివాసం లో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు జగన్ తో సమావేశం కావడం, కాంగ్రెస్ పార్టీలో పిఅర్పీ విలీనం తరువాత చిరంజీవి కూడా మొదటి సరి తమ ఎమ్మెల్యేలు అసంతృప్తి తో ఉన్నారనడంతో క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. జగన్ పడగొడితే నిలబెడతాను అన్న చిరునే తన అసంతృప్తిని వెల్లడించాడు. దీంతో రాష్ట్ర రాజకీయ సమీకరణాలు గంట గంటకు మారిపోతున్నాయి. పిఅర్పీ రాకతో ఊపిరి పీల్చుకున్న అధికార పార్టీకి ప్రస్తుత పరిణామాలు మాత్రం కొత్త చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. ఎందుకంటే తమ వల్లే ప్రభుత్వం నిలబడింది అన్న చిరు మా ఎమ్మెల్యేలను గడ్డి పోచల వలె చూస్తున్నారని ఒక రకంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీ విశ్వాసాన్ని పొందుతుందో లేదో ఆ పార్టీ నేతలకే తెలియడం లేదు. ఇదే అదనుగా పిఅర్పీ తమ పదవుల కోసం పట్టుబడవచ్చు. ఇదే కనుక కొనసాగితే అధికార పార్టీకి మరిన్ని సమస్యలు తప్పక పోవచ్చు. ఎందుకంటే ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో ని కొందరు  ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పిఅర్పీ ల విలీనం తరువాత కొన్ని చోట్ల ఈ రెండు పార్టీల శ్రేణుల్లో గొడవలు జరిగాయి. అవి ఇప్పడు సద్దుమనిగినా మునుముందు తీవ్ర స్థాయికి చేరుతాయి. అందుకే తాజా పరిణామాలతో ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు నేరుగా రంగం లోకి దిగారు. జగన్ వర్గ ఎమ్మెల్యేల లో కొంత మందిని తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే కిరణ్ కు బొత్స కు మధ్య సంబంధాలు సరిగా లేవని వార్తలు వస్తున్నాయి. పిఅర్పీ తో ప్రస్తుత అవిశ్వాస తీర్మానంలో గట్టెక్కినా, అది కొంత కాలమే. ఎందుకంటే అసంతృప్త ఎమ్మెల్యేలకు ఏవో కొన్ని హామీలు ఇచ్చి తమ దారికి తెచ్చుకున్నా, అవి నెరవేరని నాడు మళ్లీ వారు తిరుగుబావుటా ఎగరేయవచ్చు. అందుకే కిరణ్ సర్కారు తెలుసు కావలసింది ఏమిటంటే సమర్థవంతమైన నాయకత్వం తోనే ప్రభుత్వ మనుగడ ఉంటుంది కానీ సంఖ్యా బలం తో కాదు.

Monday 28 November 2011

ఇదే వారి చిత్తశుద్ది...

అందరూ అనుకున్నదే జరిగింది. తెలంగాణ కోసం టిడిపి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన రాజీ'నామాల'ను స్పీకర్ తిరస్కరించారు. తెలంగాణ పై తమకున్న చిత్తశుద్ధి ఎవరికీ లేదన్న ఈ నేతలు ఈ ఉత్తుత్తి రాజీనామాలు ఇంకా ఎన్నిసార్లు చేస్తారో? తెలంగాణ టిడిపి నాయకులైతే మొదటిసారి రాజీనామాలు చేసిన తరువాత, ఏదో సాధించామని బస్సు యాత్రలు చేశారు, తెలంగాణ ప్రజలపై 'రణ'భేరీలు మోగించారు. రెండో సారి కూడా జిల్లా పర్యటనలు చేశారు. చంద్ర బాబు రెండుకళ్ళ సిద్ధాంతంతో నియోజకవర్గాల్లో తిరగలేని వీళ్ళు  ఈ రాజీనామాలను అడ్డుపెట్టుకొని ఒక సారి చుట్టివచ్చారు. అయినా అక్కడక్కడ వారికి ప్రతిఘటన ఎదురైంది. రెండో సారి పర్యటనలో తెలంగాణ అంశం కంటే టి ఆర్ఎస్ ను, ఆ పార్టీ అధినేత కెసిఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు గోడుగుకింద పనిచేసే వీరు ఇంతకంటే ఏమి చేస్తారు. యిప్పుడు మళ్లీ ఏదైనా చేయాలంటే చంద్రబాబు పర్మిషన్ కావాలి. ఆయన మార్గదర్శకత్వంలో తెలంగాణ కోసం కాకుండా, అయన కోసం, తెలుగుదేశం పార్టీ కోసం మాత్రమే మరో కొత్త ఎత్తుగడ వేయాలి. దీనికి తెలంగాణ ముసుగును తగిలించాలి. ఇదీ తెలంగాణ టిడిపి నేతల వ్యవహారశైలి. ఇక తెలంగాణ కాంగ్రెస్ నేతలది మరో దారి. యిప్పుడు వారుచేస్తున్న కృషి తమ రాజకీయ భవిషత్తు 'కిరణాల' కోసమే. కొందరు మంత్రి పదవులకోసమైతే, మరికొందరు తమ సొంత పనులకోసం తహతహలాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పాటు చేసుకున్న తెలంగాణ స్టీరింగ్ కమిటీ కిరణ్ ప్రభుత్వాన్ని కాపాడడానికి, తమ అధినేత్రి సోనియా దగ్గర మెప్పు పొందడానికి ప్రయత్నిస్తున్నది. కొందరు నేత లైతే ఆవేశంలో పార్టీ వదిలి పోయిన వారు తిరిగి కాంగ్రెస్ లోకి వస్తే ఆహ్వానిస్తామని చిలక పలుకులు పలుకుతున్నారు. వీరి పదవి లాలస వల్లే కేంద్రం తెలంగాణ అంశాన్ని నాన్చుతున్నది. తెలంగాణ కోసం పార్లమెంటులో గొడవ చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపి లను బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నది. రాజీనామాలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తమ పదవులు కాపాడుకోవడానికే ప్రయత్నించారు. ప్రధాని తెలంగాణ పై తొందరపడం అని వ్యతిరేక వ్యాఖ్యలు చేసినా వీరిలో స్పందన లేదు. శ్రీ కృష్ణ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సూచించిన  పొలిటికల్ మేనేజ్ మెంట్ లో వీరు భాగస్వాములయ్యారు. ఇలా ఒకరు చంద్రబాబు కనుసన్నల్లో, మరొకరు అధిష్టానం పై నమ్మకం తో పనిస్తున్నారు. ఇదే వారి దృష్టి లో తెలంగాణ పై చిత్తశుద్ది.

Saturday 26 November 2011

ఆమ్ ఆద్మీ అంటే ఇదేనా ?



 రిటైల్ మార్కెట్లోకే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్ డిఐ) ఆహ్వానిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఆమ్ ఆద్మీ అభివృద్దే తమ కర్తవ్యం అని అధికారంలోకి కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యిప్పుడు చిరు వ్యాపారుల పోట్టగొట్టే నిర్ణయాలను తెసుకుంటున్నది. సామాన్యుల బతుకులను గాలికి వదిలేసి కార్పోరేట్ కంపెనీలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నది. ఒకవైపు ఆహార భద్రత చట్టాన్ని ముందుకు తెస్తూనే మరోవైపు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బతుకులు వెళ్ళదీస్తున్న వారికి ఎఫ్ డిఐ  లతో భద్రత లేకుండా చేసే చర్యలకు తెర తీస్తున్నది. ఇప్పటికే  కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల సామాన్యుడు ఏమీ కొనలేని పరిస్థితి నెలకొన్నది. పెరిగిన నిత్యావసరాల ధరలను తగ్గించే చర్యలు చేపట్టకపోగా, ప్రతి రెండు నెలల కొకసారి పెట్రోల్, డిజిల్, గ్యాస్ ధరలు పెంచుతున్నారు. దేశంలో లక్షలాది మంది యువత నిరుద్యోగంతో అల్లాడుతున్నది. ప్రభుత్వం వారికి ఉపాధి చూపించక పోగా ఉన్న ఉపాధిని పోగొట్టే విధానాలకు పచ్చ జెండా ఊపడం సిగ్గుచేటు. కాంగ్రెస్ పార్టీ భావి ప్రధాని రాహుల్ ఉత్తరపదేశ్ ఎన్నికల్లో ఓట్ల కోసం రోడ్డుపక్కన ఉన్న టి కోట్లల్లో చాయి తాగుతూ గొప్పగా నటిస్తున్నారు. ఇక ప్రజా సమస్యల కంటే ప్రపంచ బ్యాంకు విధానాలే ముద్దు అన్నట్టు మన్మోహన్ సర్కారు వ్యవహరిస్తున్నది. యుపి ఏ రెండో సారి అధికారంలోకి వచ్చాక అనేక అవినీతి కుంభ కోణాలు బయటపడ్డాయి, పడుతున్నాయి. ప్రజా వ్యతిరేక విధానాలతో ఇప్పటికే విశ్వసనీయత కోల్పోయి, రిటైల్ మార్కెట్ లోకి ఎఫ్ డిఐ లను ఆహ్వానిస్తూ నిర్ణయం తీసుకోవడం  ద్వారా పేదల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకత ఉన్నదో అర్థం అవుతున్నది. ఆమ్ ఆద్మీ అంటే ఇదేనా అని ప్రజలు నిలదీస్తున్నారు. సామాన్యుల ఉసురు పోసుకుంటున్న ఈ ప్రభుత్వానికి తగిన శాస్తి తప్పదు.

Friday 25 November 2011

అ'విశ్వాసం' ఎవరికి ఉంది?



శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రతిపక్షం పూటకో మాట మాట్లాడుతున్నది. అయితే బల నిరూపణకు దిగుతున్నది మాత్రం కాంగ్రెస్, వైఎస్ఆర్ పార్టీలు. ఈ రెండు పార్టీల సంఖ్యా బలాన్నేయిప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. కిరణ్ సర్కార్ తమ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉన్నదని పైకి చెబుతున్నప్పటికీ  లోపల మాత్రం జగన్ వర్గ ఎమ్మెల్యేల ఫోబియ పట్టుకున్నది. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో  జగన్ క్యాంపులోకి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో చాలా మంది సొంత గూటికి తిరిగి వస్తారని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. మొన్న లోటస్ పాండ్ లో జరిగిన జగన్ వర్గ ఎమ్మెల్యేల భేటికి ఎనిమిది మంది డుమ్మా కొట్టారు. దీనికి కారణాలు ఎలా ఉన్నా జగన్ వర్గం లో తగ్గిన ఎమ్మెల్యేల సంఖ్యా బలంతో కాంగ్రెస్ నేతలు సంతృప్తి చెందితే అంతకంటే పొరపాటు మరొకటి ఉండదు. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఇవ్వాళ జగన్ వర్గంలో తగ్గిన సంఖ్యా బలం రేపు మరింత తగ్గవచ్చు లేదా పెరగవచ్చు. అది ఆయా పరిస్థితులను బట్టి ఉంటుంది. ఇప్పటి వరకు జగన్ తో కలిసి నడిచే ప్రజాప్రతినిధుల సంఖ్యా ఎంతో స్పష్టంగా ఎవరికీ తెలియదు. సమావేశాలకు వచ్చే వారినే ప్రామాణికంగా తీసుకుంటే, జగన్ ఇంతకు ముందు చేపట్టిన పలు దీక్షల సమయంలో ఒక్కో సమయంలో ఒక్కో సంఖ్యా కనిపించింది. యిప్పుడు ఆయన వర్గంలోని కొందరు ఎమ్మెల్యేల స్వరం మారడానికి కారణాలు కూడా అనేకం ఉన్నాయి. అందులో యిప్పుడు రాష్ట్రం లో ఎన్నికలు వచ్చే అవకాశాలు లేకపోవడం, తమ నియోజక వర్గాల్లో అభివృద్ధి పనులు ఆగిపోవడం, ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతుండడం వంటి కారణాలతో మూడు అభివృద్ధి కార్యక్రమాల పై దృష్టి సారించాలని ఆయా నేతలు భావించడం సహజమే. ఎందుకంటే అధికార పార్టీ సభ్యులుగా ఉండి, ప్రతిపక్ష పాత్ర పోషిస్తే వారికి వచ్చే లాభం ఏమి ఉండదు. పైగా అభివృద్ధి పనులు జరిగితేనే వారికి కొన్ని డబ్బులు, కొంత పేరు, గౌరవం లభిస్తాయి. అలాగే ప్రతిపక్షం కూడా యిప్పుడు ఎన్నికలకు పోయే పరిస్థితిలో లేదు. ఇటు జగన్, అటు చంద్రబాబు ఆస్తుల పై సిబిఐ ఎంక్వైరీలు సాగుతున్నాయి. మరో వైపు తెలంగాణ అంశం ఇంకా తేలలేదు. ముఖ్యంగా తెలంగాణ సమస్య పరిష్కారం కానంత వరకు రాష్ట్రం లోని అధికార,ప్రతిపక్ష, వైఎస్ఆర్ పార్టీలు ఎన్నికలకు పోవడానికి సిద్ధంగా లేవు. ఎందుకంటే ఒకవేళ ఎన్నికలకు వెళ్లినా ఈ మూడు పార్టీలు తమ బల బలాలను తేల్చుకోవలసింది సీమాంద్రలోనే. తెలంగాణ పై ఈ మూడు ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నాయి. కాబట్టి తెలంగాణ ప్రాంతాన్ని వదిలి ఒక్క సీమాంద్ర తోనే అధికారంలోకి రావడం కష్టమే కదా! అందుకే అవిశ్వాసం పై ఎవరి అంచనాలు ఎలా ఉన్నా, దానిపై భయపడుతున్నది మాత్రం అధికార పార్టీయే !

Saturday 19 November 2011

నిలబెడితే.... పడిపోతారు జాగ్రత్త



జగన్ వర్గ ఎమ్మెల్యేలు కొంత మంది మళ్లీ కాంగ్రెస్ గూటిలోకి రావడానికి ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అది అబద్ధమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొట్టిపారేసినా, ప్రస్తుత పరిణామాలను చూస్తే ఆ సంకేతాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం పెడతామని ప్రతిపక్ష నేతల నుంచి మాటలు వినిపిస్తున్న ఈ తరుణంలో జగన్ వర్గ ఎమ్మెల్యేల రాక కిరణ్ సర్కారుకు సంతోషం కలిగించవచ్చు. కానీ జగన్ వర్గ ఎమ్మెల్యేలు మాత్రం చెబుతున్న కారణాలు తెలంగాణ ప్రజాప్రతినిధుల బానిసత్వాన్ని సూచిస్తున్నాయి. ప్రభుత్వం పడిపోతే తెలంగాణావాదం బలపడుతుంది. కాబట్టి తెలంగాణ వాదాన్ని బలపడనీయం అంటున్నారు. సీమాంద్ర ప్రజప్రతినిదులు అలా మాట్లాడితే, వారి ప్రయోజనాల కోసం వారు ఈ పని చేస్తుండవచ్చు. కానీ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఏమి అవసరం వచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మోయడానికి. ఒక పక్క కిరణ్ సర్కార్ ఉద్యమాన్ని అణచడానికి చాప కింద నీరులా ఉద్యమకారులపై నల్ల చట్టాలు ప్రయోగిస్తుంటే, ఈ ప్రాంత నేతలు మిన్నకుండడం దేనికి సంకేతం. ప్రజలు ఏమైనా మాకు పరవాలేదు మాకు మాత్రం మా పదవులే ముఖ్యం అనుకుంటున్నారు. అధికారం ఉంది కదా ఇక మాకు ఎలాంటి డోకా లేదనుకుంటే పొరపాటే. యిప్పుడు తెలంగాణ వ్యతిరేకులతో కలిసి ఈ ప్రభుత్వాన్ని కాపాడినా రేపు ఎన్నికల్లో ఓట్లు వేసేది మాత్రం ఈ ప్రాంత ప్రజలే. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఈ ప్రాంత ప్రజలు ఉద్యమిస్తున్నారు. ఐదు దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ . దీనికి వంత పాడుతున్నది ఈ ప్రాంత కాంగ్రెస్ బానిస నేతలు. అయితే మేము తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పే మాటలకు కాలం చెల్లింది. వచ్చిన తెలంగాణ ను అడ్డుకున్న సీమాంద్ర నాయకత్వంతో నడుస్తున్న నేతలకు ఇక శంకరగిరి మాన్యాలే దిక్కు.  సీమాంద్ర అవకాశవాద రాజకీయాలకు, తెలంగాణ ప్రజల ఆకాంక్షను బలయ్యేది రేపు  మాత్రం తెలంగాణ కాంగ్రెస్ నేతలే, దీనికి టిడిపి నేతలు మినహాయింపు కాదు.


Friday 18 November 2011

ఎన్ని వేదికలు, ఎన్ని మాటలు



కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు పూటకో మాట మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను గందరగోళంలోకి నెడుతున్నారు. ఒక్కో వేదిక పై ఒక్కో మాట మాట్లాడుతున్నారు.  మొన్న చిన్న రాష్ట్రాల విషయంలో రెండో ఎస్సార్సీ యే కాంగ్రెస్ విధానమన్నారు. ఇప్పుడేమో ఉత్తరపదేశ్ రాష్ట్ర విభజన విషయంలో మాత్రమే రెండో ఎస్సార్సీ మా విధానమని, తెలంగాణ ప్రత్యేక అంశం అని తాజా వ్యాఖ్యలు. మరి రాష్ట్రం లోని ఈ అనిత్చితిని తొలగించాలని ఇరు ప్రాంతాల ప్రజలు ముక్తకంటంతో కోరుతున్నారు. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నాయి. ఒకవైపు తెలంగాణ పై చర్చలు కొనసాగుతున్నాయి అంటూనే ఉద్యమకారులపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది రాస్ర ప్రభుత్వం. దీనికి తెలంగాణ కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్దమన్న తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కూడా పరోక్షంగా ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. వీళ్ళ మన నేతలు అని తెలంగాణ ప్రజానీకం అసహించుకుంటున్నది. చంద్రబాబు గొడుగు కింద తెలంగాణ టిడిపి నేతలు ఎన్ని ఉద్యమాలు చేసినా, కాంగ్రెస్ అధిష్టానం పై నమ్మకముందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎన్ని మాయమాటలు చెప్పినా ప్రయోజనం ఉండదు. రాజ్యాంగ సంక్షోభం సృస్తిస్తామన్న ఈ ఇరు పార్టీల ప్రజాప్రతినిధులు ఇప్పడు వారి వారి అధినాయకత్వాలతో రాజీ ప్రయత్నిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. ఇరు ప్రాంతాలలో పార్టీని కాపాడుకోవడానికి చంద్రబాబు, రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ ఆడుతున్న ఈ నాటకానికి ముగింపు పలకక పోతే ప్రజలు వీరికి తగిన బుద్ధి చెప్పడం ఖాయం. అలాగే తెలంగాణ పొలిటికల్ జెఎసిలో కీలక పాత్ర పోషిస్తున్న రాజకీయ పార్టీలు కూడా తమ ఉద్యమ పంథాను మార్చాల్సిన అవసరముంది. ఉద్యమకారులు ఎదురుకొంటున్న నిర్బంధకాండ పై ప్రత్యక్ష కార్యాచరణను రూపొందించాల్సిన అవసరమున్నది.

Monday 14 November 2011

ఏకాభిప్రాయం ఎన్నటికీ సాధ్యం తెలంగాణ పై ప్రధాని మన్మోహన్ చేసిన వ్యాఖ్యలు గర్హనీయం. ప్రజల ఆకాంక్ష కంటే తమకు పెట్టుబడిదారులే ముఖ్యమని ఆయన చెప్పకనే చెప్పారు. ఒక ప్రాంతీయ సమస్యను పరిష్కరించడానికి జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం కావాలట. ఇంతకంటే దుర్మార్గం ఉండదు. దీనికి ప్రాథమిక చర్చలు అని, మాధ్యమిక చర్చలు, ఫైనల్ చర్చలు పూటకో మాటలు కాంగ్రెస్ పార్టీ లోనే వారే మాట్లాడుతున్నారు. చేతగాని ప్రబుత్వంలో చేతగాని నేతలున్నారు యిప్పుడు. నిజానికి ఈ ఏకాభిప్రాయం అనే మాట కాంగ్రెస్ పార్టీ ఏడేళ్ళుగా చెబుతున్నదే. కాని ఇంత వరకు జాతీయ స్థాయిలో ఏమో గానీ రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్యే ఏకాభిప్రాయాన్ని సాధించలేదు. సమస్యను పరిష్కరించాలనే చితశుద్ది ఉంటేనే అది సాధ్యమవుతుంది. కాని ప్రజల ఆకాంక్షను రాజకీయంగా వాడుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. దీనికి ఇక్కడి వెన్నుముక లేని కాంగ్రెస్ నేతలు కూడా తోడయ్యారు. వీరి వల్లే తెలంగాణ పై కాంగ్రెస్ అధిష్టానం ఈ దాగుడుమూతలు ఆడుతున్నది. పైగా ఇతర ప్రాంతాలలో అశాంతి రగులుతుండగా తెలంగాణ ఇవ్వడం సరికాదని ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడడం ఈ దేశ దౌర్భాగ్యం. అంటే నలుగురు పెట్టుబడి దారులు కోసం నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు అశాంతికి గురైన పరవాలేదు అన్నట్టు ఉంది. యిప్పుడు కాంగ్రెస్ అసలు రంగు బయటపడింది. చంద్రబాబు కూడా తెలంగాణపై తాము చెప్పాల్సింది చెప్పాము. ఇక కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నాడు. మొన్న రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడే బాబు ఊసరవెల్లి రంగు బయటపడింది. ఇక మిగిలింది తెలంగాణ ప్రజలకు ఈ రెండు పార్టీలను బొంద పెట్టడమే.

Friday 11 November 2011

వార్తల్లో వాస్తవమెంత తెలంగాణకు ప్యాకేజిలని, రెండో ఎస్సార్సీ అని వార్త వస్తున్నాయి. ఇందులో వాస్తవమెంతో ఎవరికీ తెలియదు. కాని సీమాంద్ర మీడియా మాత్రం దీనిపై విస్తృత ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న రాష్ట్రాలపై రెండో ఎస్సార్సీ వేయడం సాధ్యం కాకపోవచ్చు. ప్రాంతీయ పార్టీల పై మనుగడ సాగిస్తున్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు అవి ఒప్పుకోవు కూడా. కేవలం ఉత్తరప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే కాంగ్రెస్స్ ఈ ఎత్తుగడ వేసింది. ఆ ఎన్నికల్లో లబ్ధి కోసమే మేము చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకం కాదని చెప్పి ఓట్లు దండుకోవాలని చూస్తోంది. పైగా రషీద్ ఆల్వి వంటి వారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. కాని తెలంగాణ ప్రత్యేకమైన అంశమని ఇప్పటికే ప్రణబ్ వంటి నేతలు స్పష్టం చేశారు. డిసెంబర్ తొమ్మిది ప్రకటన తరువాత రాష్ట్రంలో జరిగిన పరిణామాల పై ఇప్పటికే ఒక కమిటీ వేసింది కేంద్రం. ఆ కమిటీ తన నివేదిక ఇచ్చి కూడా చాల కాలం అయ్యింది. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఆ కమిటీ ఒక చెత్త రిపోర్ట్ ఇచ్చింది. దాని ప్రజాస్వామిక వాదులు ఎవరు కూడా ఒప్పుకోలేదు. తాజాగా తెలంగాణ లో జరిగిన, జరుగుతున్న పరిణామాలతో ఇక ఈ అంశాన్ని తేల్చాల్సిందే అని ఒక నిర్ణయనికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ . అందులో భాగంగానే ఆజాద్ తో రెండు ప్రాంతాల నేతలతో సంప్రదింపులు చేసింది. ఆయన కూడా తన రిపోర్ట్ ఇచ్చి ఉన్నాడు. శ్రీ కృష్ణ కమిటీ రిపోర్ట్, ఆజాద్ రిపోర్ట్ రెండు దగ్గర పెట్టుకొని తెలంగాణ పై ఏ నిర్ణయం చెప్పకుండా సాగదీస్తున్నది కాంగ్రెస్ పార్టీ . యిప్పుడు రాష్ట్రం లోని రెండు ప్రాంతాల ప్రజలు ఈ అనిచ్చితికి తెర దించాలని కోరుకుంటున్నారు. కాని కొందరు పెట్టుబడి దారులు, వారికి వంత పాడుతున్నమీడియా మాత్రం రెండో ఎస్సార్సీ అని ఇరు ప్రాంతాల ప్రజలను గందరగోళం లోకి నెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. పైగా తెలంగాణపై కాంగ్రెస్ ఇంతవరకు ఎలాంటి హామీ ఇవ్వలేదని అడ్డదిడ్డంగా వాదిస్తున్న సీమాంద్ర కాంగ్రెస్ నేతలు మాత్రం ఎస్సార్సీకి అందరూ సహకరించాలి అంటున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సీమాంద్ర పెట్టుబడిదారుల అవకాశవాద రాజకీయాలు.

Thursday 10 November 2011

ప్రకటన ప్రకంపనలు చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై రెండో ఎస్సార్సియే కాంగ్రెస్ పార్టీ విధానమని దిగ్విజై, రసిద్ఆల్వి లాంటి వాళ్ళు మాట్లాడడం లో వింత ఏమి లేదు. ఎందుకంటే వీరు యిప్పుడు రాహుల్ టీంలో చేరిపోయారు. అందుకే ఆ యువరాజు పార్టీ పగ్గాలు చేపట్టడానికి, ప్రధాని పదవికి అర్హుడే అని గొప్పలు చెబుతున్నాడు దిగ్విజై సింగ్. రాహుల్ త్వరలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపడతారని వార్తలు వస్తూనే ఉన్నాయి. అలాగే ఈ యువరాజు గత ఎన్నికల నుంచి ఉత్తరప్రదేశ్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడాని ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ సంకీర్ణ యుగం లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపి లు సొంతంగా కేంద్రం లో ప్రభుత్వాలను ఏర్పాటు చేయలేని స్టితిలో ఉన్నాయి. ఏదో ఒక కూటమికి నేతృత్వం వహిస్తూ, ప్రాంతీయ పార్టీల మద్దతుతో గత పదిహేనేళ్ళుగా కేంద్రం లో అధికారాన్ని చేలయిస్తున్నాయి. అందుకే మాయావతి ఉత్తరప్రదేశ్ ను మూడు లేదా నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారు. ఇందుకోసం అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. అదే జరిగితే గత ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఇరవై స్థానాలను గెలుచుకున్నది. రాష్ట్ర విభజన జరిగితే దాని వల్ల మాయావతి లబ్ధి పొందుతారని యిప్పుడు ఈ రెండో ఎస్సార్సీని కాంగ్రెస్ పార్టీ ముందుకు తెస్తున్నది. అయితే ఈ రెండో ఎస్సార్సీని బిజెపి, వామపక్షాలు ఇప్పటేకే వ్యతిరేకించాయి. కొత్త రాష్ట్రాల డిమాండ్ పై కమిషన్లు వేస్తారో, ఎస్సార్సీ వేస్తారో కాంగ్రెస్ పార్టీ సొంత నిర్ణయం. దాన్ని తెలంగాణ కు ముడిపెడుతున్న సీమాంధ్ర నేతల తీరే గర్హనీయం. ఎందుకంటే తెలంగాణ పై ఇప్పటికే కేంద్రం ఒక ప్రకటన చేసింది. ఆ ప్రకటనకు కట్టుబడి ఉండాలని రెండున్నర ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు ఉద్యమిస్తున్నారు. అంతే కాదు మొదటి ఎస్సార్సీకి సూచనకు వ్యతిరేకంగా తెలంగాణాను ఆంధ్రతో కలిపారు. నాటి నుంచే దీన్ని వ్యతిరేకిస్తూ, ఐదున్నర దశాబ్దాలు తెలంగాణ ప్రజలు పోరాడుతున్నారు. తెలంగాణ పై ఇప్పటికే ఎన్నో కమిటీలు, కమిషను వేశారు. అది ముగిసిన అధ్యాయం. గోడ మీద పిల్లి లాగ ఇప్పడు తమకు అనుకూలంగా ఏది ఉంటే దాన్ని పట్టుకో వేలాడడం టిజి, రాయపాటి, లగడపాటి వంటి సీమాంద్ర నేతలకు అలవాటే. తెలంగాణ పై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కాలయాపన వల్ల ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యే లు ఆ పార్టీని వీడారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంశాన్ని తేల్చకుండా ఎస్సార్సీ ద్వారా పరిష్కరిస్తామని అంటే ఇక ఆ పార్టీ తెలంగాణ లో మర్చిపోవలసిందే. ఈ విషయాన్నీ ఈ ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఇప్పటికే ప్రకటించారు కూడా. దీంతో అంపశయ్య మీద ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోవడం ఖాయం.

Sunday 6 November 2011

ఒకటే దారి.. ఒకటే నినాదం

ఇవ్వాళ తెలంగాణ మొత్తం ప్రజానీకం కోరుతున్నది ఒక్కటే. ఆంధ్రప్రదేశ్ విలీనానికి ముందున్న తెలంగాణ రాష్ట్రాన్ని పునరుద్దరించాలని. అంతే కాని వచ్చే తెలంగాణ ఇలా ఉండాలి, అలా ఉండాలని ఇప్పుడే ఎవరూ కోరుకోవడం లేదు. తెలంగాణలోని అన్ని వర్గాల వారి వివిధ పద్ధతుల్లో ఉద్యమిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదు. ఈ మొండి ప్రభుత్వాల వైఖరి వల్లనే ఇప్పటికే ఏడు వందందలకు పై చిలుకు తెలంగాణ బిడ్డలు బలిదానాలు పాల్పడ్డారు. ఈ సమయం అందరూ ఒకే నినాదం తో కలిసి నడవాలి. మనలో మనమే కలహించుకుంటే అది శత్రువుకే లాభం చేకూరుస్తుంది. తెలంగాణ రాష్ట్ర్రం సాకారం కావాలంటే అన్ని పార్టీల మద్దతు తో పాటు రాష్ట్రం లోని అన్ని వర్గాలు సంఘటితం కావాలి.

Monday 10 October 2011

అణచివేతే అసలు వ్యూహం



సకల జనుల సమ్మె ప్రభావం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రంగా పడింది. దీంతో కాంగ్రెస్  అధిష్టానం దీనిపై సీరియస్ గా ఆలోచిస్తున్నట్టు చర్చల పేరుతో ఒక నాటకాన్ని మొదలు పెట్టింది. తెలంగాణ సమస్య సున్నితమైనదని, జటిలమైనదని పాట పాటనే పడుతూ .. ఈ అంశాన్ని మరికొంత కాలం సాగదీయడమే కాంగ్రెస్ పెద్దల అసలు వ్యూహం. ఎందుకంటే రెండు నెలలుగా ఆజాద్ నాయకత్వంలో జరిగిన సంప్రదింపుల రిపోర్ట్ కాంగ్రెస్ అగ్రనాయకత్వం చేతుల్లోనే ఉన్నది. ఆజాద్ చేసిన పనినే మళ్లీ కొత్తగా రెండు మూడు రోజులుగా ఢిల్లీ పెద్దలు చేస్తున్నారు. దీనికి రాష్ట్ర నేతలతో చర్చలు మిగిశాయి. ఇక కాంగ్రెస్ జాతీయ నేతలతో చర్చలు జరగాల్సి ఉన్నదంటున్నది. ఇదీ ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి. వీరందరితో సంప్రదింపులు పూర్తి అయినా వెల్లడయ్యేది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం మాత్రమే. దీని బట్టి అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ కి తెలంగాణపై ఉన్న చిత్తశుద్ధి. అయితే ఈలోగా ముఖ్యమంత్రి తో సమ్మెను విచ్చిన్నం చేసే ప్రక్రియనూ ప్రారంభించింది. ఆ ప్రయత్నం సఫలం అయితే సరే. లేకపోతే దాని ప్రస్తుత ముఖ్యమంత్రి వైఫల్యంగా చిత్రించి మరొకరిని గద్దె మీద కూర్చోబెట్టం. ఇదీ కాంగ్రెస్ పార్టీ అజెండా.  లేకపోతే తెలంగాణ లోని కొందరు ఎమ్మెల్యేలు, ఎంపిలు రాజీనామా చేసి ఉన్నారు. వాటిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోరు. ప్రతి పక్ష నేత కూడా ప్రభుత్వాన్ని మెజారిటీ నిరూపించుకోవాలని అడగరు. జాతీయ పార్టీలు బిజెపి, సీపిఎం, సిపిఐ ల తో సహా చాలా పార్టీలు తెలంగాణ అంశాన్ని త్వరగా తేల్చాలని ప్రధానికి లేఖలు రాసిన లాభం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టికి సమస్యను పరిష్కరించడం కన్నా దానితో లబ్ధి పొందాలనే కుంచిత బుద్ధితోనే ఆలోచిస్తున్నది. అందుకే సకలజనుల సమస్య ఇప్పుడు జాతీయ సమస్య అయ్యింది.

Saturday 8 October 2011

రెండు కళ్ళు యిప్పుడు తటస్థంగా....



టిడిపి సీమాంద్ర నేతలు దేవినేని ఉమా, యనమల వంటి వారితో తటస్త బాబు మరో డ్రామా మొదలు పెట్టించాడు. సంప్రదింపులు ఒకే ప్రాంతవారితో చర్చించి తెలంగాణ పై నిర్ణయం తీసుకుంటే ఊరుకొమంటున్నారు. అయితే ఈ సంప్రదింపులు కాదు ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాలని తెలంగాణ లోని సకల జనులు ఇరవై ఐదు రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఇదీ మీ తటస్త బాబుకు గానీ మీకు గానీ కనిపించడం లేదా? తెలంగాణ బిల్లు పెడితే మొదటి ఓటు మాదే అంటున్న మీ నామాను అడగండి తెలంగాణ ఎందుకు కోరుకుంటున్నారో? మీ ఎర్రబెల్లిని అడగండి ఎందుకు రాజీనామా చేశారో? తనకు రెండుప్రాంతాలు సమానమే అని చెబుతూ ... ఒక ప్రాంతం లోని మొత్తం ప్రజానీకం ఒక లక్ష్యం కోసం ఉద్యమిస్తున్నా పట్టించుకోని మీ అధినేతను అడగండి తెలంగాణ పై ఆయన అభిప్రాయం. ఎందుకంటే ఏ ప్రాంతాల నేతలైన వారి అభిప్రాయాలూ వారికి ఉన్న నేను చెప్పేదే ఫైనల్ అంటున్నాడు కదా చంద్రబాబు  గదే చెప్పమనండి తెలంగాణకు అనుకూలమో కాదో. టిడిపి లో ఏమి జరుగుతుందో మీకే తెలియడం లేదు అవి పక్కనపెట్టి సమక్యాంధ్ర అని తెలంగాణ అని రెండు వాదనల నాటక ఇంకా ఎంతకాలం? ముందు మీ పార్టీ వైఖరిని మీ అధినేతతో కేంద్ర ప్రభుత్వానికి చెప్పించండి అప్పుడు వాళ్ళ నాటకాలు మీ డ్రామాలు తెలుగు  ప్రజలకు తెలుస్తాయి

Monday 3 October 2011

వీరి బలహీనతే వారి బలం..


నలుగురు పెట్టుబడిదారులు తెలంగాణకు అడ్డుపడుతుంటే అందుకు నలబై మంది తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వారికి సహకరిస్తున్నారు. సకల జనుల సమ్మె ఇంత ఉధృతంగా సాగుతున్నప్పటికీ కేంద్రం స్పందించకపోవడానికి కారణం ఈ నేతలే. పైకి వీళ్ళు తెలంగాణ కోసం దేనికైనా సిద్ధమంటున్నారు రాజీనామాలు చేసే సాహసం చేయలేకపోతున్నారు. ఆ బలహీనతే కేంద్రానికి బలమైన ఆయుధం అవుతున్నది. తెలంగాణ ప్రజలు రాష్ట్ర సాధన కోసం అన్ని ప్రయత్నాలు చేశారు చేస్తున్నారు. ఇక మిగిలింది రాజకీయ సంక్షోభమే. అప్పుడే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వస్తాయి. యిప్పుడు తెలంగాణాలో జరుగుతున్న పరిణామాల పై కేంద్రం సీరియస్ గా దృష్టి సారించక పోవడానికి కారణం ఈ ప్రాంత నేతల బానిస మనస్తత్వాలే. వాటిని వదిలించుకోవాలనే ప్రజలు కోరుతున్నారు. అంతేగానీ ప్రజల వద్ద ఒక మాట పార్టీ అధిష్టానం వద్ద మరో మాట తో కాలం వెళ్ళదీయాలని చూస్తే కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం.

అజ్ఞానకిరణ్ అవాస్తవాలు


సకల జనుల సమ్మెపై ముఖ్యమంత్రి మాట మర్చిండు. సమ్మె ప్రారంభమైన తరువాత దీనివల్ల మీ ప్రాంతానికే నష్టమని విభజించి మాట్లాడిన ఆయన యిప్పుడు దాని సెగ ఉత్తరాంద్ర కు తగలడం తో మన అనే మాట మాట్లాడుతున్నాడు. రైతులకు ఏడు గంటల విద్యుతు అందిస్తామని చెప్పి మిగతా ప్రాంతాల సంగతి ఏమో తెలియదు కానీ తెలంగాణ లో ఐదు గంటలు కూడా ఇవ్వడం లేదు. జల విద్యుతు ద్వారా కరెంటు కోతలు లేకుండా రైతులకు సరఫరా చేయవచ్చని తెలంగాణ వాదులు చెబుతున్న పట్టించుకోవడం లేదు. పైగా యిప్పుడు విద్యుతు కోతలతో ఉత్తరాంద్రలో ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతున్నది కనుక దీని కారణం కెసిఆర్, కోదండరామ్ లే బాధ్యత వహించాలని, వారిపై తిరగబడాలని సమస్య నుంచి తప్పించు కోవలనుకుంటున్నాడు. కిరణ్ ఒంటెద్దు పోకడల వల్లే రాష్ట్రము లో ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. ఉద్యమ ప్రభావాన్ని కేంద్రానికి తెలియజేసి, పరిష్కార దిశగా కృషి చేయాల్సిన అయ్యాన అనిచివేతే లక్ష్యంగా పని చేస్తున్నారు. సహచర మంత్రుల మాటలను కూడా బేకతారు చేస్తున్నాడు. పంట చేతికి వచ్చే సమయం కాబట్టి సమ్మెను రెండు నెలల తరువాత చేయలని సూచనలు చేస్తున్నాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కిరణ్  కు పాలనా మీద ఎంత పట్టు ఉన్నదో. సమ్మె వాళ్ళ సామాన్యులకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన ముఖ్యమంత్రి అది మరిచి పోయి ఉద్యమాలు ఎప్పుడు చేయాలో నిర్దేశిస్తున్నాడు. మొన్నటి దాక సమ్మెతో ఇబ్బంది ఏమిలేదని ఢిల్లీ పెద్దలకు రిపోర్టులు పంపి వారితో కూడా చెప్పించి యిప్పుడు పంటలు ఎండిపోతే ఉద్యమకారులదే బాధత అంటే ముఖ్యమంత్రిగా కిరణ్ అనర్హుడు.

Monday 1 August 2011





Labels:

Sunday 24 July 2011

hyderabad state photos









Saturday 23 July 2011


Labels:

Tuesday 5 July 2011

hai