Monday 10 October 2011

అణచివేతే అసలు వ్యూహం



సకల జనుల సమ్మె ప్రభావం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రంగా పడింది. దీంతో కాంగ్రెస్  అధిష్టానం దీనిపై సీరియస్ గా ఆలోచిస్తున్నట్టు చర్చల పేరుతో ఒక నాటకాన్ని మొదలు పెట్టింది. తెలంగాణ సమస్య సున్నితమైనదని, జటిలమైనదని పాట పాటనే పడుతూ .. ఈ అంశాన్ని మరికొంత కాలం సాగదీయడమే కాంగ్రెస్ పెద్దల అసలు వ్యూహం. ఎందుకంటే రెండు నెలలుగా ఆజాద్ నాయకత్వంలో జరిగిన సంప్రదింపుల రిపోర్ట్ కాంగ్రెస్ అగ్రనాయకత్వం చేతుల్లోనే ఉన్నది. ఆజాద్ చేసిన పనినే మళ్లీ కొత్తగా రెండు మూడు రోజులుగా ఢిల్లీ పెద్దలు చేస్తున్నారు. దీనికి రాష్ట్ర నేతలతో చర్చలు మిగిశాయి. ఇక కాంగ్రెస్ జాతీయ నేతలతో చర్చలు జరగాల్సి ఉన్నదంటున్నది. ఇదీ ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి. వీరందరితో సంప్రదింపులు పూర్తి అయినా వెల్లడయ్యేది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం మాత్రమే. దీని బట్టి అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ కి తెలంగాణపై ఉన్న చిత్తశుద్ధి. అయితే ఈలోగా ముఖ్యమంత్రి తో సమ్మెను విచ్చిన్నం చేసే ప్రక్రియనూ ప్రారంభించింది. ఆ ప్రయత్నం సఫలం అయితే సరే. లేకపోతే దాని ప్రస్తుత ముఖ్యమంత్రి వైఫల్యంగా చిత్రించి మరొకరిని గద్దె మీద కూర్చోబెట్టం. ఇదీ కాంగ్రెస్ పార్టీ అజెండా.  లేకపోతే తెలంగాణ లోని కొందరు ఎమ్మెల్యేలు, ఎంపిలు రాజీనామా చేసి ఉన్నారు. వాటిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోరు. ప్రతి పక్ష నేత కూడా ప్రభుత్వాన్ని మెజారిటీ నిరూపించుకోవాలని అడగరు. జాతీయ పార్టీలు బిజెపి, సీపిఎం, సిపిఐ ల తో సహా చాలా పార్టీలు తెలంగాణ అంశాన్ని త్వరగా తేల్చాలని ప్రధానికి లేఖలు రాసిన లాభం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టికి సమస్యను పరిష్కరించడం కన్నా దానితో లబ్ధి పొందాలనే కుంచిత బుద్ధితోనే ఆలోచిస్తున్నది. అందుకే సకలజనుల సమస్య ఇప్పుడు జాతీయ సమస్య అయ్యింది.

Saturday 8 October 2011

రెండు కళ్ళు యిప్పుడు తటస్థంగా....



టిడిపి సీమాంద్ర నేతలు దేవినేని ఉమా, యనమల వంటి వారితో తటస్త బాబు మరో డ్రామా మొదలు పెట్టించాడు. సంప్రదింపులు ఒకే ప్రాంతవారితో చర్చించి తెలంగాణ పై నిర్ణయం తీసుకుంటే ఊరుకొమంటున్నారు. అయితే ఈ సంప్రదింపులు కాదు ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాలని తెలంగాణ లోని సకల జనులు ఇరవై ఐదు రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఇదీ మీ తటస్త బాబుకు గానీ మీకు గానీ కనిపించడం లేదా? తెలంగాణ బిల్లు పెడితే మొదటి ఓటు మాదే అంటున్న మీ నామాను అడగండి తెలంగాణ ఎందుకు కోరుకుంటున్నారో? మీ ఎర్రబెల్లిని అడగండి ఎందుకు రాజీనామా చేశారో? తనకు రెండుప్రాంతాలు సమానమే అని చెబుతూ ... ఒక ప్రాంతం లోని మొత్తం ప్రజానీకం ఒక లక్ష్యం కోసం ఉద్యమిస్తున్నా పట్టించుకోని మీ అధినేతను అడగండి తెలంగాణ పై ఆయన అభిప్రాయం. ఎందుకంటే ఏ ప్రాంతాల నేతలైన వారి అభిప్రాయాలూ వారికి ఉన్న నేను చెప్పేదే ఫైనల్ అంటున్నాడు కదా చంద్రబాబు  గదే చెప్పమనండి తెలంగాణకు అనుకూలమో కాదో. టిడిపి లో ఏమి జరుగుతుందో మీకే తెలియడం లేదు అవి పక్కనపెట్టి సమక్యాంధ్ర అని తెలంగాణ అని రెండు వాదనల నాటక ఇంకా ఎంతకాలం? ముందు మీ పార్టీ వైఖరిని మీ అధినేతతో కేంద్ర ప్రభుత్వానికి చెప్పించండి అప్పుడు వాళ్ళ నాటకాలు మీ డ్రామాలు తెలుగు  ప్రజలకు తెలుస్తాయి

Monday 3 October 2011

వీరి బలహీనతే వారి బలం..


నలుగురు పెట్టుబడిదారులు తెలంగాణకు అడ్డుపడుతుంటే అందుకు నలబై మంది తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వారికి సహకరిస్తున్నారు. సకల జనుల సమ్మె ఇంత ఉధృతంగా సాగుతున్నప్పటికీ కేంద్రం స్పందించకపోవడానికి కారణం ఈ నేతలే. పైకి వీళ్ళు తెలంగాణ కోసం దేనికైనా సిద్ధమంటున్నారు రాజీనామాలు చేసే సాహసం చేయలేకపోతున్నారు. ఆ బలహీనతే కేంద్రానికి బలమైన ఆయుధం అవుతున్నది. తెలంగాణ ప్రజలు రాష్ట్ర సాధన కోసం అన్ని ప్రయత్నాలు చేశారు చేస్తున్నారు. ఇక మిగిలింది రాజకీయ సంక్షోభమే. అప్పుడే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వస్తాయి. యిప్పుడు తెలంగాణాలో జరుగుతున్న పరిణామాల పై కేంద్రం సీరియస్ గా దృష్టి సారించక పోవడానికి కారణం ఈ ప్రాంత నేతల బానిస మనస్తత్వాలే. వాటిని వదిలించుకోవాలనే ప్రజలు కోరుతున్నారు. అంతేగానీ ప్రజల వద్ద ఒక మాట పార్టీ అధిష్టానం వద్ద మరో మాట తో కాలం వెళ్ళదీయాలని చూస్తే కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం.

అజ్ఞానకిరణ్ అవాస్తవాలు


సకల జనుల సమ్మెపై ముఖ్యమంత్రి మాట మర్చిండు. సమ్మె ప్రారంభమైన తరువాత దీనివల్ల మీ ప్రాంతానికే నష్టమని విభజించి మాట్లాడిన ఆయన యిప్పుడు దాని సెగ ఉత్తరాంద్ర కు తగలడం తో మన అనే మాట మాట్లాడుతున్నాడు. రైతులకు ఏడు గంటల విద్యుతు అందిస్తామని చెప్పి మిగతా ప్రాంతాల సంగతి ఏమో తెలియదు కానీ తెలంగాణ లో ఐదు గంటలు కూడా ఇవ్వడం లేదు. జల విద్యుతు ద్వారా కరెంటు కోతలు లేకుండా రైతులకు సరఫరా చేయవచ్చని తెలంగాణ వాదులు చెబుతున్న పట్టించుకోవడం లేదు. పైగా యిప్పుడు విద్యుతు కోతలతో ఉత్తరాంద్రలో ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతున్నది కనుక దీని కారణం కెసిఆర్, కోదండరామ్ లే బాధ్యత వహించాలని, వారిపై తిరగబడాలని సమస్య నుంచి తప్పించు కోవలనుకుంటున్నాడు. కిరణ్ ఒంటెద్దు పోకడల వల్లే రాష్ట్రము లో ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. ఉద్యమ ప్రభావాన్ని కేంద్రానికి తెలియజేసి, పరిష్కార దిశగా కృషి చేయాల్సిన అయ్యాన అనిచివేతే లక్ష్యంగా పని చేస్తున్నారు. సహచర మంత్రుల మాటలను కూడా బేకతారు చేస్తున్నాడు. పంట చేతికి వచ్చే సమయం కాబట్టి సమ్మెను రెండు నెలల తరువాత చేయలని సూచనలు చేస్తున్నాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కిరణ్  కు పాలనా మీద ఎంత పట్టు ఉన్నదో. సమ్మె వాళ్ళ సామాన్యులకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన ముఖ్యమంత్రి అది మరిచి పోయి ఉద్యమాలు ఎప్పుడు చేయాలో నిర్దేశిస్తున్నాడు. మొన్నటి దాక సమ్మెతో ఇబ్బంది ఏమిలేదని ఢిల్లీ పెద్దలకు రిపోర్టులు పంపి వారితో కూడా చెప్పించి యిప్పుడు పంటలు ఎండిపోతే ఉద్యమకారులదే బాధత అంటే ముఖ్యమంత్రిగా కిరణ్ అనర్హుడు.