Saturday 29 December 2012

నార్త్‌బ్లాక్‌లోఆ మూడుపార్టీల నాటకం



అఖిలపక్షం ముందు తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతున్నది. ఎందుకంటే ఈ అఖిలపక్ష భేటీ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అనూహ్య మార్పులు వస్తాయని ఎవరూ భావించలేదు. భ్రమ పడలేదు. కానీ తెలంగాణపై అస్పష్ట వైఖరి ఉన్న పార్టీల నుంచి స్పష్టత వస్తుందని అంతా ఆశించారు. కానీ మూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతుండడానికి కారణం కాంగ్రెస్, టీడీపీలు. తర్వాత వైఎస్‌ఆర్‌సీపీ కూడా. ఈ మూడు పార్టీల పీటముడి కారణంగానే రాష్ట్ర విభజనపై చిక్కుముడి వీడడం లేదన్నది అందరికీ తెలిసిందే. కానీ ఇవే మూడు పార్టీలు ఏమీ తెలియనట్టు నటిస్తున్నాయి. అదే విధానాన్ని నార్త్‌బ్లాక్‌లో కూడా కొనసాగించాయి. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పుకోవాలి. రాష్ట్ర విభజనపై అప్పటి కేంద్ర హోంమంత్రి డిసెంబర్ 9న ఒక ప్రకటన చేశారు. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష కాంగ్రెస్, టీడీపీల వల్ల ఆవిరైపోయింది. పట్టుమని పదిహేను రోజుల్లోనే సీమాంధ్ర నేతల రాజ’కీ’యాలతో వెనక్కిపోయింది. అందుకే చిదంబరం రాష్ట్రంలో కొన్ని పార్టీలు తెలంగాణపై ‘యూటర్న్’ తీసుకున్నందున మరిన్ని సంప్రదింపులు జరగాలన్నారు. ఆ తర్వాత శ్రీకృష్ణకమిటీ, కాంగ్రెస్ అంతర్గత కమిటీల పేరుతో చేసిన హడావుడి విదితమే. ఈ మూడేళ్ల కాలంలో తెలంగాణపై ప్రజలు స్వరాష్ట్ర సాధన కోసం చేయని ప్రయత్నమంటూ ఏదీ లేదు. సహాయ నిరాకరణ, సకలజనుల సమ్మె, తెలంగాణ మార్చ్ ఒక్కటేమిటి ప్రపంచంలో ఏ ఉద్యమంలో కనిపించని అన్ని రూపాలను ప్రదర్శించారు. వందల మంది బలిదానాలకు పాల్పడ్డారు. ఇప్పటికీ అవి కొనసాగుతున్నాయి. అయినా సీమాంధ్ర నేతలకు మనసు కరగలేదు. చనిపోయిన అమరుల కుటుంబాలపై సానుభూతి కలగలేదు. నిజానికి వారి నుంచి సానుకూల స్పందన ఆశించడం తెలంగాణ ప్రజల అత్యాశే అవుతుంది తప్ప ఫలితం ఉండదు. మూడేళ్ల కాలం ఇట్టే కరిగిపోయింది. కానీ తెలంగాణ ప్రజల కన్నీళ్లకు మాత్రం కేంద్ర ప్రభుత్వం కనికరించలేదు. అందుకే తెలంగాణపై ఎప్పటికప్పుడు నిర్ణయాన్ని వాయిదా వేస్తూ కాలయాపన చేసింది. ఎట్టకేలకు ఎఫ్‌డీఐలపై ఓటింగ్ సమయంలో ఈ ప్రాంత ఎంపీల ఒత్తిడి మేరకు అఖిలపక్ష సమావేశానికి ఒప్పుకున్నది. దాన్ని కూడా అపహాస్యం చేసే విధంగా ముఖ్యమంత్రి మొదలు, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్, సీమాంధ్ర ప్రాంత నేతలు వ్యవహరించారు. ఆజాద్ అయితే ఏకంగా కేంద్ర హోంమంత్రిగా షిండే కొత్తగా బాధ్యతలు చేపట్టారు కనుక ఆయన అవగాహన కోసం ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌ది ఎప్పుడూ తెలంగాణపై కిరికిరే. అందుకే గతంలో ఈ అఖిలపక్ష సమావేశం భిన్నంగా ఉండదని ఎద్దేవ చేసినట్టు మాట్లాడాడు. ప్రపంచ తెలుగు మహాసభల పేరుతో ఈ సమావేశాన్ని వాయిదా వేయించడానికి విఫలయత్నం చేశాడు. అందరూ ఎదురుచూసిన అఖిలపక్ష భేటీ సమయం వచ్చింది. సమావేశమూ పూర్తయ్యింది.

ఇంతకీ అఖిలపక్షంలో తేలింది ఏమిటి? మళ్లీ ఆ మూడు పార్టీల తంతూ అదే. కాంగ్రెస్ రెండు వాదనలు వినిపించింది. తెలుగుదేశం పార్టీ ప్రణబ్ కమిటీకి ఇచ్చిన లేఖ గురించి పాతపాడే పాడింది. తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నామని వైఎస్‌ఆర్‌సీపీ ఇడుపులపాయ ప్లీనరీ ముచ్చటే చెప్పింది. ఒక రకంగా ఈ మూడు పార్టీలు తెలంగాణపై తమ సస్పెన్స్ యథావిధిగా కొనసాగించాయి. కానీ బయటికి వచ్చిన తర్వాత మాత్రం తెలంగాణపై తాము స్పష్టంగా చెప్పామని టీడీపీ బీరాలు పలికింది. సమావేశంలో టీడీపీ ‘సీల్డ్‌కవర్’ ద్వారా ఏం చెప్పింది? షిండేకు రెండు లేఖలు ఇచ్చినట్టు సమాచారం అందులో మొదటి ప్రణబ్ కమిటీకి ఇచ్చిన లేఖ. రెండోది రాష్ట్రంలో అనిశ్చితికి కారణం కేంద్రమే. కనుక ఈ సమస్య పరిష్కరించాల్సిన బాధ్యత కూడా కేంద్రంపైనే ఉన్నదని చెప్పింది. అందుకే తెలంగాణవాదులు టీడీపీ లేఖలో స్పష్టత లేదు అంటే మొదటి లేఖలో తెలంగాణకు టీడీపీ సానుకూలంగా ఉన్నదనే వాక్యం ఉన్నదట. అందుకే షిండేకు ఇచ్చిన రెండు లేఖలు కలిపి చదువుకుంటే తెలంగాణపై టీడీపీ చిత్తశుద్ధి కనిపిస్తుందట. ఏమైనా అర్థం ఉన్నదా? టీడీపీ చెబుతున్న ప్రణబ్ కమిటీ యూపీఏ-1 ప్రభుత్వ కాలపరిమితి ముగిసిన తర్వాత అది కాలగర్బంలో కలిసిపోయింది. ఆ తర్వాత తెలంగాణపై చాలా కమిటీలు వచ్చాయి. రాజశేఖర్‌రెడ్డి వేసిన రోశయ్య కమిటీ, కేంద్ర ప్రభుత్వం వేసిన శ్రీకృష్ణ కమిటీ, ఈ అఖిలపక్ష సమావేశాని కంటే ముందు రెండు అఖిలపక్ష సమావేశాలు జరిగాయి. వీటిలో ఏ ఒక్కదానిలో టీడీపీ తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పలేదు.  అందుకే టీఆర్‌ఎస్ నేతలు టీడీపీ వైఖరిని పెండ్లి ఎత్తగొట్టి, నిశ్చితార్థానికి కట్టుబడి ఉంటామంటే ఎలా అని నిలదీస్తున్నారు. అఖిలపక్ష భేటీకి టీడీపీ తరఫున ఈ ప్రాంత నుంచి వెళ్లిన కడియం శ్రీహరిగారు షిండే రికార్డు చేసిన మినట్స్ చూస్తే టీడీపీ తెలంగాణకు అనుకూలమో, వ్యతిరేకమో తేలుతుంది అంటున్నారు. దాన్ని బయటపెట్టించే దమ్ము కేసీఆర్‌కు ఉన్నదా అని ఛాలెంజ్ చేస్తున్నారు. ఒకవేళ శ్రీహరి వాదిస్తున్నట్టు టీడీపీ తెలంగాణకు అనుకూలమైతే సీల్డు కవర్ సందేశమెందుకు? చంద్రబాబు తెలంగాణ ప్రాంతంలోనే పాదయాత్ర చేస్తున్నారు కదా! ఆయన నోటి నుంచే 200లో తమ  పార్టీ మహానాడులో తెలంగాణపై చేసిన తీర్మానానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని ఒక మాట చెబితే సరిపోతుంది. కానీ వాళ్లు ఆ పని చేయడం లేదు. అయిపోయిన లేఖ గురించి పదే పదే ప్రస్తావిస్తూ అదే మా విధానమని అరిచి గీ పెడుతున్నారు. అలాగే టీడీపీ వైఖరి స్పష్టంగా లేదని ఒక్క టీఆర్‌ఎస్ మాత్రమే చెప్పడం లేదు. ఆ సమావేశానికి హాజరైన వాళ్లలో కొంతమంది అదే చెబుతున్నారు. లోపల ఒకటి బయట ఒకటి చెబుతున్నారని మండిపడ్డారు. ‘హిందూ’ లాంటి ఆంగ్ల పత్రిక కూడా తన సంపాదకీయంలో తెలంగాణపై టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీల వైఖరి అస్పష్టంగా ఉన్నదని పేర్కొన్నది. అందుకే టీడీపీ నేతలు తమ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదు అనడం కంటే ఆ పార్టీ అధినేతతో అనుకూలం అని చెప్పిస్తే బాగుంటుంది. ఎందుకంటే టీడీపీ తెలంగాణపై తీసుకున్న నిర్ణయాన్ని నర్సారావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. తాను సమైక్యవాదినని, దీనిపై తమ పార్టీ అధినేతతో చర్చిస్తాను అన్నారు. తమ ప్రాంత ప్రజల అభిప్రాయం మేరకు తాను నడుచుకుంటానని, అవసరమైతే పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేస్తాను అన్నారు. దీన్ని నన్నపనేని రాజకుమారి కూడా సమర్థించారు. అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రాయలసీమ హక్కుల గురించి మాట్లాడారు. ఇలా సీమాంధ్ర నేతలు టీడీపీ తెలంగాణ సానుకూల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంటే.. తెలంగాణవాదులు స్పష్టత గురించి డిమాండ్ చేస్తున్నారు. బాబు రెండు కండ్ల సిద్ధాంతం మొదటికే మోసం తెచ్చేలా ఉన్నది.

టీడీపీ వైఖరి అలా ఉంటే.. ఈసారి అఖిలపక్షంలో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు రెండు కండ్ల సిద్ధాంతాన్ని పాటించినట్టు కనిపించింది. అందుకే మాజీ శాసనసభాపతి కేఆర్ సురేష్‌రెడ్డి తెలంగాణవాదం వినిపిస్తే, మాజీమంత్రి గాదె వెంకటరెడ్డి సమైక్యవాదాన్ని వినిపించారు. అయితే కాంగ్రెస్ పార్టీ అభిప్రాయంపై మొదట భిన్నవాదనలు వినిపించాయి. సమావేశంలో గాదె వెంకటరెడ్డిని హోం మంత్రి షిండే మాట్లాడనివ్వలేదని, సురేష్‌రెడ్డి చెప్పిన అభిప్రాయాన్నే పరిగణనలోకి తీసుకుంటామని చెప్పినట్టు వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ రెండువాదనలపై మిగలిన పక్షాలు నిలదీస్తే.. సురేష్‌రెడ్డి అభిప్రాయం మేరకు కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాలు కోరుకుంటున్నదని చెప్పినట్టు ప్రసార మాధ్యమాలు ప్రసారం చేశాయి. ఎందుకంటే అఖిలపక్ష సమావేశం తర్వాత గాదె వెంకటరెడ్డి పెద్దగా మాట్లాడకపోవడంతో ఈ వాదనకు బలం చేకూరింది. అయితే తర్వాత గాంధీభవన్‌లో గాదె ప్రెస్‌మీట్ పెట్టి మరి షిండే రెండు రాష్ట్రాల వాదనను తోసిపుచ్చారు. తన వాదనపై వస్తున్న వివాదాలకు వివరణ ఇచ్చారు. మా పార్టీ ఎవరిని అడ్డుకోలేదని, ఇద్దరి అభిప్రాయాలను చెప్పుకొమ్మన్నదని, అయితే ఎవరు ఏం చెప్పినా చివరికి అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామనే మాట చెప్పమన్నదని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. అఖిలపక్షం తర్వాత లగడపాటి ఏకాభిప్రాయం రాలేదు అంటున్నారు. గాదె వెంకటరెడ్డి కూడా తెలంగాణపై కాంగ్రెస్ పార్టీలో ఏకాభిప్రాయం లేదన్నారు. కనుక వీళ్లు రాష్ట్రం ఎన్నటికీ విడిపోదని ఘంటాపథంగా చెబుతున్నారు. అయితే దీన్ని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు విభేదిస్తున్నారు. అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి అంతా కట్టుబడి ఉండాలంటున్నారు. అంతేకాదు ఈ అంశం రాష్ట్ర పరిధిలో నుంచి కేంద్ర పరిధిలోకి వెళ్లిందని, కనుక తెలంగాణపై ఇక రాష్ట్రంలో ఏకాభిప్రాయం అనే మాటకు అర్థం లేదంటున్నారు. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందనే నమ్మకం తమకు ఉందంటున్నారు. గాదె వెంకటరెడ్డి, లగడపాటి, కావూరి, రాయపాటి, టీజీ వెంకటేశ్ వీళ్లు రాష్ట్ర విభజనపై చెబుతున్న శాస్త్రీయ విధానం సంకీర్ణ ప్రభుత్వంలో సాధ్యంకాదు. అది వారికీ తెలుసు.  ఈ రాష్ట్రం రావణకాష్టంలా మూడేళ్లుగా మండుతున్నది. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ విషయంలో మొదటి దోషి కూడా కాంగ్రెస్ పార్టీనే. అందుకే అఖిలపక్ష భేటీలో పార్టీల అభిప్రాయాలు చెప్పాలని కోరినప్పుడు కాంగ్రెస్ పార్టీయే ముందుగా తన అభిప్రాయం చెప్పాలని మిగిలిన పక్షాలు డిమాండ్ చేశాయి. కానీ దీనిపై కాంగ్రెస్ నేతలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రతినిధులు చెప్పిన అభిప్రాయాల్లో దేన్ని కాంగ్రెస్ పార్టీ ఆమోదించిందో కూడా చెప్పాల్సిన బాధ్యత ఆ పార్టీపై ఉన్నది. తెలంగాణ ప్రాంతం వారు షిండే రెండు రాష్ట్రాలు అన్నాడని, లేదు ఆయన అలా అనలేదని, అది నిరూపిస్తే తాను రాజకీయాల్లో నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని గాదె స్పష్టం చేశారు. కనుక రాష్ట్రంలో నెలకొన్న అస్థిర పరిస్థితిని చక్కదిద్దాలి. ఇంకా రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తే కాలగర్భంలో కలిసిపోక తప్పదు.

ఈ రెండు పార్టీల వైఖరి ఇలా ఉంటే వైఎస్‌ఆర్‌సీపీది సెంటిమెంట్ పేరుతో ఓట్లను సొమ్ము చేసుకునే కప్పదాటు వైఖరే. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారం కేంద్రానికికే ఉన్నదని, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా కేంద్రమే తండ్రివలె ఈ సమస్యను పరిష్కరించాలన్నది ఆ పార్టీ. అందుకే షిండే సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నాం అంటే తెలంగాణ సానుకూలమేనా అంటే మౌనమే మైసూరరెడ్డి వంతు అయ్యింది. ఇంతకు మించి ఏమీ చెప్పలేమని వారు అన్నట్టు సమాచారం. దీంతో వైఎస్‌ఆర్‌సీపీ తెలంగాణకు వ్యతిరేకమని స్పష్టమైంది. అందరికి ఆమోదయోగ్యంగా ఉండాలనే వైఎస్‌ఆర్‌సీపీ వైఖరి ఆచరణలో సాధ్యం కాదు. ఎందుకంటే ఒకరికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే మరొకరి ఎంతో కొంత నిరాశ ఉండడం సహజమే. అందరిని సంతృప్తి పరచాలనే ఆ పార్టీ విధానమే తప్పు. పీడితులన పక్షాన నిలబడాల్సిన ఆ పార్టీ గోడ మీద పిల్లిలా నిలిచింది. తెలంగాణకు అనుకూలమా అని షిండే అడిగిన ప్రశ్నకు స్పష్టంగా సమాధానం చెప్పలేదంటే ఆ పార్టీ తెలంగాణను వ్యతిరేకించినట్టుగానే మనం భావించాలి. ఎందుకంటే రాజన్న రాజ్యం తెస్తామంటున్న ఆ పార్టీ  రాష్ట్ర విభజనపై రాజశేఖర్‌రెడ్డినే అనుసరిస్తుంది. ఆయన తెలంగాణను బహిరంగంగానే వ్యతిరేకించారు. ఇచ్చే శక్తి, తెచ్చే శక్తి లేదన్న ఆ పార్టీ కనీసం ఇవ్వండి అని చెప్పే సాహసం కూడా చెయ్యలేదు. పరకాల ఎన్నికల సమయంలో, షర్మిల పాదయాత్ర సందర్భంలో, జగన్ ఆర్మూర్ రైతుదీక్ష సందర్భంలో, విజయమ్మ సిరిసిల్ల పర్యటన సందర్భంలో ఈ ప్రాంత ప్రజల మనోభావాలను గుర్తిస్తున్నామని చెప్పిన మాటను నిలబెట్టుకోలేకపోయింది. కాంగ్రెస్, టీడీపీల కంటే స్పష్టంగానే తెలంగాణ వ్యతిరేకతను చాటింది.
అఖిలపక్షంలో మిగిలిన పార్టీలో బీజేపీ, టీఆర్‌ఎస్, సీపీఐ జై తెలంగాణ అన్నాయి. సీపీఎం, ఎంఐఎం సమైక్యవాదాన్ని వినిపించాయి. ఈ సమావేశం ద్వారా రాష్ట్ర విభజన సమస్య పరిష్కారం అవుతుందని ఆశించిన వారి ఆశలు అడియాసలే అయ్యాయి. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత రాజీనామాల డ్రామాలు ఆడిన కాంగ్రెస్, టీడీపీ లుఇప్పుడు అదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. అప్పుడు పీఆర్‌పీ స్థానంలో అఖిలపక్ష సమావేశానికి హాజరైన వైఎస్‌ఆర్‌సీపీ ఏం చేస్తుందో చూడాలి. ఎందుకంటే సామాజిక తెలంగాణ అన్న చిరంజీవి మాట మార్చి సమైక్యవాదమన్నారు. ఇప్పుడు వైఎస్‌ఆర్‌సీపీ స్టాండ్ ఏమిటో తెలిసిపోయింది కనుక కాంగ్రెస్, టీడీపీల సీమాంధ్ర నేతల అసమ్మతి సెగలో తాను భాగస్వామ్యం అవుతుందా లేదా అన్నది చూడాలి. అయితే ఒక్కటి మాత్రం నిజం. కేంద్ర హోంమంత్రిఇదే చివరి అఖిలపక్షం అన్నారు. కనుక తెలంగాణ ప్రజల సహనం నశించకముందే వారి ఆకాంక్షను నెరవేరిస్తే బాగుంటుంది.

Labels: , , , ,

Sunday 23 December 2012

మంచి నిర్ణయం


ఎట్టకేలకు సచిన్ వన్డే క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించి ఒక  మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ లోకి సచిన్ అడుగుపెట్టినప్పటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు చాలా తేడా ఉన్నది. ఎంతో మంది యువ ఆటగాళ్ళు దేశవాళి క్రికెట్ లో రాణిస్తూ...భారత జట్టు తరఫున ఆడడానికి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ లో సచిన్ అత్యున్నత రికార్డ్స్ నెలకొల్పాడు. ఇందులో ఎవరికీ సందేహం అక్కరలేదు. కాని జూనియర్స్ అవకాశాలు రావాలంటే సీనియర్స్ సగౌరవంగా తప్పుకోవలసిందే. ఎందుకంటే గతంలో ఒక సెంచరీ కొడితే ఓ ఆర్నెల్ల వరకు మన ఆటగాళ్ళకు జట్టులో డోకా ఉండేది కాదు. ఇప్పుడు అలంటి స్థితి లేకున్నా..కొంత మంది సీనియర్లను పక్కన పెట్టలేని అగత్యం మాత్రం ఉన్నది. వారిని తప్పిస్తే ఒకవాదన లేకపోతే మరో వాదన. దీనితోనే సమయము గడుస్తున్నది, సీరీస్ లు అయిపోతున్నాయి. ఫలితంగా వరల్డ్ కప్ చాంపియన్స్ కాస్త ఈ మ్యాచ్ అయినా  గెలిస్తే చాలు అన్న గడ్డు కలం మాత్రం మన కళ్ళముందు కనపడుతున్నది. చివరికి ఇది ఎలా తయారయ్యింది అంటే  కొత్త నీరు లేని సముద్రంలా మారింది. నీళ్ళు ఉన్నా నిరుపయోగమే. అందుకే అంతర్జాతీయంగా మన క్రికెట్ మళ్ళీ పుంజుకోవాలంటే పోటీ తప్పనిసరి. ఇది సఫలం కావాలంటే గత కీర్తిని పట్టుకుని వేలాడితే..వర్తమానం స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ విషాదాలు  మనల్ని వెంటాడుతాయి. అందుకే గతం మంచి జ్ఞాపకంగా ఉండాలంటే వర్తమాన భారత క్రికెట్లో యువతకు జట్టులో చోటు మాత్రమే దక్కితే సరిపోదు. వాళ్ళకు ఆడే అవకాశము కల్పించాలి.   

Labels: ,

Wednesday 19 December 2012

సవాళ్లు కాదు, స్పష్టత కావాలె



తాను సమైక్యవాదినని ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన కొండా సురేఖ ఇప్పుడు తెలంగాణకోసం టెన్‌జన్‌పథ్ వద్ద చావడానికి నేను సిద్ధం. కేసీఆర్ అందుకు సిద్ధమా అని సవాల్ విసరడం హాస్యాస్పదంగా ఉన్నది. కొండా దంపతుల ఆరాటం అంతా జగన్‌కు అధికార పీఠంపై కూర్చోబెడదామనే తప్ప తెలంగాణ కోసం కాదు. పరకాల ఉప ఎన్నిక కూడా ఆమె వైఎస్ జగన్ కోసం రాజీనామా చేస్తేనే వచ్చింది. అందుకే తాను తెలంగాణ కోసమే రాజీనామా చేశానని చెప్పినా ప్రజలు  విశ్వసించలేదు. దీంతో పరకాల ఫలితం ప్రతికూలంగా వచ్చింది. దీన్ని ఇప్పటికీ కొండా దంపతులు జీర్ణించుకోలేకపోతున్నారు. షర్మిల పాదయాత్ర ప్రజల కష్టాలు తెలుసుకోవడానికని, టీఆర్‌ఎస్ పల్లెబాట ఓట్ల కోసమట. రాష్ట్రంలో ఓట్ల రాజకీయం ఎవరు చేస్తున్నారో ప్రజలకు తెలుసు. అఖిలపక్షభేటీలో తెలంగాణపై  వైఎస్‌ఆర్‌సీపీ స్పష్టమైన వైఖరి వెల్లడించాలని అడిగితే అది నేరమట. మమ్మల్ని ఎందుకు అడుగుతారు అంటారు.  తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుడూ, తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న పార్టీని, ఉద్యమనాయకత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుని తాను తెలంగాణ బిడ్డనే అని చెప్పుకుంటున్నారు కొండాసురేఖ. వైఎస్‌ఆర్‌సీపీ ని తెలంగాణపై ఎందుకు స్పష్టత అడగవలసి వస్తున్నది. పార్లమెంటులో వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తెలంగాణకు వ్యతిరేకంగా ప్లకార్డు పట్టుకున్నది నిజం కాదా? ద దీనిపై ఆయన గానీ ఆయన పార్టీ వాళ్లు ఇంతవరకు వివరణ ఇచ్చాడా. కేవలం తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తామంటే సరిపోతుందా? వైఎస్‌ఆర్‌సీపీ తెలంగాణకు వ్యతిరేకం కాదంటే సమైక్యఉద్యమంలో జగన్‌పై నమోదైన కేసును ఉపసంహరించకున్నట్టు ప్రభుత్వం విడుదల చేసిన జీవో అబద్ధమా? అఖిలపక్షభేటీ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్, టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీల్లో గుబులు మొదలవుతున్నది. ఎందుకంటే తెలంగాణపై ద్వంద్వ విధానాలను అవలంబిస్తున్నది ఈ మూడు పార్టీలే. జేఏసీ ఇప్పటికే ఈ మూడు పార్టీలకు డెడ్‌లైన్ విధించింది. ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతుండడంతో అసహనంతో తెలంగాణ ప్రాంతంలోని కొండాసురేఖ, జగ్గారెడ్డి, ఎర్రబెల్లి, మోత్కుపల్లి వంటి నేతలను ఆయా పార్టీలు తెలంగాణ ఉద్యమనాయకత్వాన్ని విమర్శించడానికి ఉసిగొల్పుతున్నాయి. అయినా తెలంగాణ కోసం ఆత్మహత్యలు వద్దు. పోరాడి సాధించుకోవాలని పార్టీలకు అతీతంగా అంతా కోరుతున్నారు. ఈ సమయంలో మంత్రిగా పనిచేసిన కొండా సురేఖ వంటి వాళ్లు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుంటేనే తెలంగాణ వస్తుంది. తెలంగాణను తాను చావడానికి సిద్ధం. కేసీఆర్ సిద్ధమా అని రెచ్చగొట్టడం ఎందుకు? కొండా సురేఖ ముందు అఖిలపక్ష భేటీలో వైఎస్‌ఆర్‌సీపీ చేత తెలంగాణకు అనుకూలంగా ప్రకటన ఇప్పిస్తే చాలు, ప్రత్యేక రాష్ట్రం కోసం ఎవరూ ఆత్మహత్య చేసుకోవలసిన అవసరం లేదు. ఇప్పుడు కొండాసరేఖ భావోద్వేగాలు అన్నీ జగన్ కోసమే తప్ప, తెలంగాణ కోసం కాదనేది వాస్తవం. అఖిలపక్ష భేటీలో ఏమీ తేలదని పైకి అంతా గుంభనంగా ఉన్నా లోలోప మాత్రం తెలంగాణపై స్పష్టత లేని పార్టీలో ఆందోళన మొదలైంది. అందుకే సీమాంధ్రలో కావూరి, లగడపాటి లాంటి వాళ్లు, ఇక్కడ కొండాసురేఖ, జగ్గారెడ్డి, ఎర్రబెల్లి లాంటి వాళ్లు తెలంగాణ ఉద్యమ నాయకత్వంపై ఎదురుదాడి ప్రారంభించారు. ఎందుకంటే చంద్రబాబును విమర్శించే స్థాయి కేసీఆర్‌కు లేదని ఎర్రబెల్లి అంటున్నాడు. తెలంగాణపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని ప్రధానికి లేఖ రాసింది చంద్రబాబే కదా. వాళ్ల పార్టీ పరంగా తెలంగాణపై స్పష్టత ఉంటే బాబే అఖిలపక్షానికి వెళ్లి కేంద్రాన్ని నిలదీయాలి. అలాగే కేంద్రం తెలంగాణ ఇస్తే తాము అడ్డుకోబోమని వైఎస్‌ఆర్‌సీపీ ప్రకటించింది. అదే విషయాన్ని అఖిలపక్షభేటీలో వైఎస్‌ఆర్‌సీపీ తరఫున విజయమ్మ చెప్పాలి. తెలంగాణ ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నది ఇదే. దీనికే సవాళ్లుపతిసవాళ్లు ఎందుకు? అందుకే ఈ మూడు పార్టీలు ముందున్న ముప్పును అధిగమించాలంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తమ అభిప్రాయాన్ని వెల్లడించాలి. అంతేకానీ రెచ్చగొట్టే చర్యలతో అసలు ఇష్యూను పక్కదారి పట్టించాలని చూస్తే పాట్లు పడేది ఈ మూడు పార్టీలే అని విషయాన్ని గమనించాలి.

Labels: , , ,

Wednesday 12 December 2012

ఇచ్చేది, తెచ్చేది, చచ్చేది

నిన్న పార్లమెంటులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మాతృరాష్ట్రంలో ఏకాభిప్రాయం వస్తేనే రాష్ట్రాల ఏర్పాటు సాధ్యమవుతుందని ప్రకటించారు. దానికి కొనసాగింపుగానే తెలంగాణపై అఖిలపక్షభేటీ పార్టీకి ఇద్దరు చొప్పున రావాలని కేంద్ర హోం శాఖ నుంచి రాష్ట్రంలోని తొమ్మిది పార్టీలకు వర్తమానం అందింది. 2001 నుంచి తెలంగాణ సమస్య కాంగ్రెస్ పార్టీ కోర్టులో ఉన్నది. 2004 నుంచి నేటి వరకు దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశమూ ఆ పార్టీకే ఉన్నది. కానీ తెలంగాణపై తేల్చకుండా ఏకాభిప్రాయం అనే పాటను మార్చిమార్చి పాడుతున్నది. అఖిలపక్షభేటీ తేదీ ఖరారైనప్పటి నుంచి అధికార పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీకి ఒక్కరినే పంపాలని తెలంగాణ ప్రాంత నేతలంటే, ఇద్దరని పంపాలని సీమాంధ్ర నేతలు అన్నారు. తెలుగు మహాసభల పేరుతో అఖిలపక్షభేటీని వాయిదా వేయాలని ముఖ్యమంత్రి విన్నపాన్ని షిండే తిరస్కరించినా, ఈ అంశాన్ని అంత త్వరగా తేల్చబోమనే ‘‘తీపికబురు’’ మాత్రం ఆయనకు అందించారు. అందుకే కాబోలు ఆయన ఈ అభిలపక్షభేటీ గతంలో కంటే భిన్నంగా ఉండదని ముందే చెప్పారు. తెలంగాణపై తేలాలంటే ఏకాభిప్రాయమైనా మరే అభిప్రాయమైనా రావాలంటే కాంగ్రెస్, టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీల్లోనే రావాలి. ఎందుకంటే తెలంగాణపై రెండు వాదనలు వినిపిస్తున్నది ఇవే పార్టీలు. ఈ మూడు పార్టీలు తమ ముసుగును తీసేసి ఒకే అభిప్రాయం చెబితేనే ఆంధ్రప్రదేశ్ ప్రజల అవస్థలు తీరుతాయి. అలాగే అఖిలపక్షభేటీ ఘనత ఎవరిదనే విషయంపై కూడా ఇంతవరకు చర్చలు జరిగాయి.  ఇది తమ అధినేత రాసిన లేఖ ఫలితమే అని తెలుగు తమ్ముళ్లు తెగ సంబరపడిపోయారు. చంద్రబాబు పాదయాత్ర తెలంగాణ ప్రాంతంలోకి వచ్చినాటి నుంచి ఆయన కూడా కాంగ్రెస్‌లా ఏకాభిప్రాయం అనే మాట కాకుండా వ్యతిరేకం కాదనే పదాన్నే తన ఆయుధంగా ఎంచుకున్నారు. హస్తినలో జరిగే అఖిలపక్షభేటీలోనే తమ పార్టీ అభిప్రాయం స్పష్టంగా చెబుతామంటున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ నేతలు బాజిరెడ్డి గోవర్ధన్, కొణాతాల రామకృష్ణ ఈ మధ్యే మీడియా ముందు అఖిలపక్షభేటీకి తమకు ఆహ్వానం అందింతే కాంగ్రెస్, టీడీపీల వలె కాకుండా ఒకే అభిప్రాయం చెబుతామన్నారు. టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలు చెప్పినట్టు ఒకే అభిప్రాయం చెబితే తెలంగాణపై కాంగ్రెస్ కాలయాపనకు కాలం తీరుతుంది. లేకపోతే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర హోంమంత్రి షిండేలు చెప్పినట్టు తెలంగాణ చర్చలు కొనసా...........గుతూనే ఉంటాయి. అందుకే ఆరుదశాబ్దాలుగా తెలంగాణ ప్రజల ఆకాంక్షను అపహాస్యం చేస్తున్న అధికార పార్టీ ఆటలో భాగస్వాములు కాకుండా ఉంటే మంచిది. అప్పుడు  తెలంగాణ తెచ్చేది, ఇచ్చేది, లేకపోతే చచ్చేది మేమే అని చెబుతున్నవాళ్లుకు తెచ్చే అవకాశం, ఇచ్చే ఉద్దేశం లేదని అర్థమవుతున్నది. కనీసం వాళ్లకు చచ్చే అవకాశం అన్నా టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలు ఇస్తే మంచిది.

Labels: , , , ,

Tuesday 11 December 2012

కావూరి కట్టుకథలు

అభివృద్ధి పేరుతో రాష్ట్రాన్ని విభజించాల్సి వస్తే అదే ప్రాతిపదికన దేశంలోని చాలా రాష్ట్రాలను ముక్కలు చేయాల్సి వస్తుంది. అసలు కేంద్రం ఏ ప్రాతిపదికన తెలంగాణ ఇవ్వాలని చూస్తోందో అర్థం కావట్లేదని, అసలీ విషయాన్ని మూడేళ్లుగా ఎందుకు నానబెడుతున్నది? కేంద్రంలోని అధికారపక్ష నాయకులకు, ప్రతిపక్ష నాయకులకు ఏ మాత్రం జ్ఞానం ఉన్నా ఈ వివాదానికి ఎప్పుడో ఫుల్‌స్టాప్ పెట్టేవాళ్లు. తెలంగాణ నాయకులకు రాష్ట్రాభివృద్ధి ము ఖ్యం కాదు. సామాజిక న్యాయం అంతకంటే కాదు. విద్యార్థుల భవిష్యత్తు కూడా వారికి అవసరం లేదు. ప్రత్యేక రాష్ట్రం వస్తే హైదరాబాద్‌ను దోచుకుని పందుల్లా మెక్కవచ్చనే ఆశతో ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారు. స్వార్థం, అవినీతి పెరిగిపోయిన రాజకీయ నేతలు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. కేసీఆర్‌కు రాష్ట్రాన్ని ముక్కలు చేయగలిగే దమ్ముందా అని ప్రశ్నించారు. ఇవన్నీ శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి ఏలూరు ఎంపీ సాంబశివరావు ఆవేదనతో... సారీ ఆవేశంగా మాట్లాడారు.

నిజంగా కావూరికి రాష్ట్రాభివృద్ధిపై ఎంత ప్రేమ ఉందో! దాని కోసం ఆయన ఎంతగా తపిస్తున్నారో? హైదరాబాద్‌లో టోల్‌గేట్ల దగ్గర పైసలు వసూలు చేస్తూ దాన్ని కూడా అభివృద్ధిలోనే భాగంగా చూస్తున్నారు ఈ ఉదారవాది. ఇక కావూరి వారు సామాజిక న్యాయం గురించి కూడా తెగ లెక్చర్లు దంచేశారు. దేశంలో ఎఫ్‌డీఐ వల్ల చిల్లర వర్తలకులు రోడ్డున పడే పరిస్థితి దాపురించిందని దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కానీ కావూరి మంత్రి పదవి రాలేదని ఎంపీ పదవికి రాజీనామా చేసి,  దాన్ని జనవరి వరకు ఆమోదించవద్దని స్పీకర్‌ను వేడుకొని ఎఫ్‌డీఐలకు అనుకూలంగా ఓటు వేశారు. అదీ సామాజిక న్యాయం అంటే? అలాగే తెలంగాణ సమస్యను కేంద్ర ప్రభుత్వం మూడేళ్లుగా ఎందుకు నానబెడుతున్నదని కావూరి డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలు కోరుతున్నది కూడా అదేగదా. కేంద్రం ఈ సమస్యను నానబెట్టడానికి కారకుల్లో మీరు కూడా ఒకరు కాదా? ఏ ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇవ్వాలని చూస్తున్నదని కావూరికి అనడం గురువింద సామెతను గుర్తుచేస్తున్నది. ఈ ప్రశ్న 2001లో తమ నాయకుడు వైఎస్ 41 మంది ఎమ్మెల్యేలతో తెలంగాణ కావాలని సోనియాగాంధీకి లేఖ రాయించినప్పుడు అడగాల్సింది. 2004లో టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకున్నప్పుడు అడగాల్సింది. మీ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు లేవనెత్తాల్సింది. యూపీఏ కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో పెట్టినప్పుడు ప్రశ్నించాల్సింది. రాష్ట్రపతి ప్రసంగంలో పెట్టినప్పుడు నిలదీయాల్సింది. అంతేందుకు తెలంగాణ గురించి 2009 డిసెంబర్ 10న ఉభయ సభల్లో ప్రణబ్, చిదంబరం హామీ ఇచ్చినప్పుడు ప్రస్తావించాల్సింది. మరీముఖ్యంగా రాష్ట్రపరిస్థితులపై శ్రీకృష్ణ కమిటీ వేసినప్పుడు అడ్డుకోవాల్సింది. ఇన్ని జరగుతున్నా ఇంత కాలం కళ్లున్న కబోదిలా నటించిన, నటిస్తున్న కావూరి వారు ఇప్పుడు స్వార్థం, అవినీతి గురించి మాట్లాడుతున్నారు. అంతేకాదు ప్రత్యేక రాష్ట్రం గురించి మాట్లాడిన వారు పదవులు రాగానే మిన్నకుండి పోయారన్నారు. అయితే ప్రత్యేక రాష్ట్రం కేంద్ర మంత్రి పదవిని, ఎంపీ పదవిని వదులుకున్న కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత కావూరికి లేదు. ఎందుకంటే ఇదే కావూరి గారు కేంద్రంలో మంత్రిపదవి రాలేదని అలక వహించి ఎంపీ పదవి రాజీనామా చేసి, దాని ఇంకా కట్టుబడి ఉన్నానంటూనే... దాన్ని ఆమోదించుకోకుండా, అధికార పార్టీకి అండగా ఎఫ్‌డీఐలకు అనుకూలంగా ఓటు వేసి వచ్చారు. ఇలాంటి వాళ్లు విద్యార్థులకు నీతులు చెప్పి తమకు మాత్రం అవి వర్తించవు అన్నట్టు వ్యవహరించడమే నేటి విషాదం.

Labels: , ,

Monday 10 December 2012

నల్లారి వారి నిజస్వరూపం


ప్రపంచ తెలుగు మహాసభలను సాకుగా అఖిలపక్ష భేటీని వాయిదా వేయించడానికి ముఖ్యమంత్రి శతవిధాలా ప్రయత్నించారు. దీనికి పీసీసీ అధ్యక్షుడు, రాయపాటి వంటి నేతలు వంతపాడారు. ఒక ప్రాంత ప్రజల తమ ఆకాంక్ష కోసం ఆరు దశాబ్దాలుగా ఉద్యమిస్తన్నారు. ముఖ్యంగా మూడేళ్లుగా ఆ దశాబ్దా కల సాకారం కోసం నినదిస్తున్నారు. అయితే ఇంత కాలం తెలంగాణ అంశం కేంద్రం పరిధిలో ఉందని, త్వరగా నిర్ణయం తీసుకోవాలని తాము కూడా కోరుతున్నట్టు కిరణ్‌కుమార్‌రెడ్డి చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం తెలుగు మహాసభలు జరుగుతున్నందున రాష్ట్ర విభజనపై చర్చలు బాగుండవంటున్నారు. అలాగే ఈ అఖిలపక్ష భేటీ గతంలో కంటే భిన్నంగా ఏమీ ఉండదన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి, లగడపాటి రాజగోపాల్, మరికొందరు సీమాంధ్ర నేతలు హస్తిన ఆంతర్యాన్ని ముందే చెబుతున్నారు. అలాగే ఏకాభిప్రాయం రానిదే తెలంగాణ సాధ్యం కాదన్న లగడపాటి విజయవాడలో తెలంగాణ ఏర్పడితే మనల్ని బతకనీయరు అని రెచ్చగొడతారు. ముఖ్యమంత్రి తాను మూడో తరగతి నుంచి తెలంగాణ ఉద్యమాన్ని చూస్తున్నాను అంటారు. ప్రజలు ఏమైపోయినా పరవాలేదు కానీ తమ ప్రయోజనాలే ముఖ్యమన్నట్టు వీళ్లు వ్యవహరిస్తున్నారు. నేను హైదరాబాదీనే అని చెప్పుకునే కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాకుండా సీమాంధ్ర ప్రతినిధిగా మాట్లాడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై ఎటూ తేల్చకుండా మూడేళ్లుగా కమిటీలని, ఎన్నికలని, పండుగలని, సోనియా అనారోగ్యం అని, ఆజాద్, వాయలార్ రవిలు విదేశీ పర్యటనలో ఉన్నారని, రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొనాలని చాలా కథలపేరుతో చేసిన కాలయాపన ముగిసింది. ఈ మూడేళ్లలో రాష్ట్రం అనిశ్చిత పరిస్థితిని తొలగించకుండా కాంగ్రెస్ పెద్దలు ఆడిన నాటకానికి ఈ రాష్ట్ర ప్రజలు బలికావాల్సి వస్తున్నది. ఇది చాలదన్నట్టు కిరణ్‌కుమార్ రెడ్డి తెలంగాణపై చర్చలు కొనసాగుతూ.....................
....నే ఉంటాయని వెటకారంగా మాట్లాడుతున్నారు. అయినా సీమాంధ్ర ముఖ్యమంత్రులు తెలంగాణపై ఇంతకంటే భిన్నంగా వ్యవహరిస్తారనుకోవడం పొరపాటే. అందుకే ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, కిరణ్ పాలన అద్భుతం అని, మాకు అభివృద్ధే కావాలి తెలంగాణ అవసరం లేదనే వాళ్లు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజలవైపా? పార్టీ వైపా? అని.

Labels: , ,

Saturday 8 December 2012

ఆందోళనలో ఆంధ్రా ఆక్టోపస్


తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవడానికి లగడపాటి రాజగోపాల్ అన్ని పాత్రలు వేశాడు. ఇప్పుడు అసిపోయి అఖిలపక్ష భేటీలో నేతలు సమైక్యవాదాన్ని వినిపించేలా ఒత్తిడి తేవాలని విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. జిల్లాలకు వచ్చే నేతలను నిలదీయాలని వారికి సూచించాడు. ఇదే లగడపాటి రాజగోపాల్ అఖిలపక్షభేటీలో ఏమీ తేలదని ఇంతకు ముందే ప్రకటించాడు. మరి రెండురోజుల్లోనే ఆయనలో ఈ మార్పు ఎందుకు వచ్చిందో? అఖిలపక్ష భేటీ గురించి తెగ ఆందోళనపడుతున్నాడు. అంతేకాదు అఖిలపక్ష భేటీలో కాంగ్రెస్ పార్టీ రెండో ఎస్సార్సీ తమ పార్టీ విధానం అని చెబుతుందని కూడా చెప్పాడు. అఖిలపక్ష భేటీకి ముందే భవిష్యవాణిని వినిపిస్తున్న ఈ ఆంధ్ర ఆక్టోపస్ విజయవాడ వేదికగా విద్యార్థులను ఈ విన్నపాలు ఎందుకు కోరుతున్నాడు?అలాగే తెలంగాణలో అరవైశాతం మంది సమైక్యవాదాన్ని కోరుతున్నారని అబద్ధాలు చెబుతున్నాడు. తెలంగాణవాదుల్లో మూడేళ్ల కిందట ఉన్న భావోద్వేగాలు ఇప్పుడు లేవంటున్నాడు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అన్ని విషయాలు అనర్గళంగా మీడియా ముందు చెబుతున్న లగడపాటికి అఖిలపక్షం గురించి అంతగా ఎందుకు కలవరపడుతున్నాడో ఇప్పటికైనా ప్రజలు గ్రహించాలి.ముఖ్యంగా సీమాంధ్ర ప్రజలు. ఎందుకంటే మూడేళ్ల కిందటే ప్రజలు మానసికంగా విడిపోయారు. ఇక మిగిలింది భౌగోళిక విభజనే.

Labels: , ,

Friday 7 December 2012

వ్యక్తి అవగాహన కోసం అఖిలపక్షం వేదికా?



తెలంగాణపై ఎప్పటికప్పుడు అభిప్రాయాలు మార్చుకుంటున్న పార్టీలు... ఇప్పుడు ఏ అభిప్రాయంతో ఉన్నదీ తెలుసుకుంటామన్నారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. సమెక్యాంధ్రకు అనుకూలంగా కొన్ని పార్టీలు, వ్యతిరేకంగా మరికొన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి. కొన్ని పార్టీలు రెండు వాదనలను వినిపిస్తున్నాయి. పైగా... కేంద్ర హోమంత్రిగా సుశీల్ కుమార్ షిండే కొత్తగా బాధ్యతలు చేపట్టారు. అందువల్ల, అన్ని పార్టీల తాజా అభిప్రాయాలను మరోసారి తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ భేటీ ఏర్పాటు చేస్తున్నాం’’
అఖిలపక్షంపై ఆజాద్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇవి.

ప్రాంతాలకు అతీతంగా ప్రజలు రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితి తొలిగిపోవాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అఖిలపక్ష భేటీతోనైనా కేంద్ర ప్రభుత్వం దీనిపై పరిష్కారం చూపకపోతుందా అనే ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ సీమాంధ్ర ప్రజాప్రతినిధులు, ప్రసార మాధ్యమాలు అప్పుడే ఏదో జరిగిపోయినట్టు కంగారు పడి ప్రజలను కన్‌ఫ్యూజన్ చేసే పనిలో మునిగిపోయాయి. అందుకే ఒక చానల్ తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ హైజాక్ చేసిందా అని చర్చ పెట్టింది. మరో చానల్ తేలుస్తారా? నానుస్తారా అని ఓ స్టోరీ చేసింది. వీరి ఆంతర్యం సమస్య పరిష్కారం కంటే అపరిష్కృతంగానే ఉంటేనే బాగుండు అన్నట్టు ఉంటుంది.అందుకే తెలంగాణను వ్యతిరేకిస్తున్న శైలజానాథ్, లగడపాటి రాజగోపాల్, టీజీ వెంకటేశ్ వంటి వాళ్లను తెరమీదికి తెస్తారు. మరో నేత గాదె వెంకటరెడ్డి అఖిలపక్ష భేటీకి పార్టీకి ఇద్దరు చొప్పున పిలవాలి అంటారు. లగడపాటి చెప్పింది కూడా అదే. అందుకే అఖిలపక్ష భేటీకి ముందే వీళ్లు భిన్నవాదనలు చేస్తున్నారు. ఆజాద్ చెప్పినట్టు పార్టీలు ఎప్పటికప్పుడు అభిప్రాయాలు మార్చుకుంటున్నాయి అంటున్నారు. నిజమే కానీ ఏ పార్టీలు? కాంగ్రెస్, టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలే తెలంగాణపై గోడమీది పిల్లి వాటంలా వ్యవహరిస్తున్నాయి. మిగిలి పార్టీలన్నీ స్పష్టమైన విధానంతోనే ఉన్నాయి. కనుక అభిప్రాయాలు మార్చుకుంటున్న పార్టీలో కాంగ్రెస్ కూడా ఉందనే విషయాన్ని ఆజాద్ గుర్తించుకోవాలి. ఎఫ్‌డీఐ, అణుఒప్పందంల విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందుగానే తన అభిప్రాయాన్ని వెల్లడించింది. తర్వాత ప్రతిపక్ష పార్టీల అభిప్రాయాన్ని తెలుసుకున్నది. మరి తెలంగాణ విషయంలో ఆ పని ఎందుకు చేయడం లేదు? చిన్న రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని ఆ పార్టీ అధికార ప్రతినిధులు అప్పుడప్పుడు ప్రెస్‌మీట్‌లలో చిలుక పలుకులు పలుకుతారు. అందుకే తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం ఏమిటో స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడే చెప్పకున్నా అఖిలపక్షభేటీలో కాంగ్రెస్ అభిప్రాయం కూడా చెబుతామంటే, రాష్ట్ర విభజనపై భిన్నాభిప్రాయాలు ఉన్న పార్టీలు ఏదో ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అలా కాకుండా షిండే గారి అవగాహన కోసం అఖిలపక్షం అంటే దానికి అందరిని పిలవడం ఎందుకు? ఇదే ఆజాద్ కూడా ఇరు ప్రాంతాల కాంగ్రెస్ నేతలతో ఇప్పటికే అనేకసార్లు సమావేశమయ్యారు. అందరి అభిప్రాయాలు తీసుకుని ఒక నివేదికను వారి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి సమర్పించారు. కనుక ఇప్పుడు పార్టీ పరంగా ఇద్దరు నేతలను పిలవడం కంటే మీ చర్చల సారాంశం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నదో ప్రజలకు తెలియజేస్తే బాగుటుంది. ఇప్పటికే యాభై కోట్లు ఖర్చుపెట్టి శ్రీకృష్ణ కమిటీని నియమించారు. ఆ కమిటీ రిపోర్టు కూడా తమ దగ్గర ఉన్నది. 2009 డిసెంబర్ 7న రోశయ్య గారి నేతృత్వంలో అఖిలపక్ష భేటీకి సంబంధించిన రిపోర్టు తమ వద్దే ఉన్నది. (దీని ఆధారంగానే కేంద్రం  2009 డిసెంబర్ 9 ప్రకటన చేసింది) ఆ తర్వాత కూడా రెండుసార్లు అఖిలపక్ష భేటీ జరిగింది. ఆ చర్చల సారాంశం కూడా మీకు తెలిసిందే. ఇన్ని సమావేశాలు, ఇన్ని కమిటీలు, ఇన్ని అభిప్రాయాలు ఇంత కాలం కాంగ్రెస్ పార్టీ దగ్గరే పెట్టుకుని మళ్లీ అఖిలపక్ష భేటీ అనడం, దానికి ముందే తమ వైఖరి చెప్పకుండా ఒక వ్యక్తి అవగాహన కోసం దీన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆజాద్ చెప్పడం గర్హనీయం.

ఇక అఖిలపక్ష భేటీ తమ ఘనతే అని జబ్బలు చరుచుకుంటున్న ఈ ప్రాంత ఎంపీలు అఖిలపక్ష భేటీలో అన్ని పార్టీల అసలు రంగు బయటపడుతుంది అంటున్నారు. కానీ భేటీకి ముందే కాంగ్రెస్ పార్టీ కుట్రలు బయటపడుతున్నాయి. కర్రవిరగకుండా పాముచావకుండా సమస్యను పరిష్కారించాలనుకే హస్తిన పెద్దల ఆటలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమవుతున్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న కాంగ్రెస్ పెద్దలకు ప్రజా ఉద్యమాలపై, సమస్య పరిష్కారంపై ఉన్న చిత్తశుద్ధి ఏమిటో కనబడుతున్నది. దీనికి తెలంగాణకు వ్యతిరేకం కాదంటున్న పార్టీలు కూడా మినహాయింపు కాదు. ఇంతకూ అఖిలపక్షభేటీకి ఇద్దర్ని పిలుస్తారా? లేక ఒక్కర్ని పిలుస్తారా అనేది మరో వారం రోజుల్లో తేలుతుంది. కానీ ఒక్కర్నే పంపాలని తెలంగాణవాదులంటుంటే, ఇద్దర్ని పిలవాలని సీమాంధ్రు నేతలు అంటున్నారు. ఇద్దర్ని పిలిస్తే జరిగేది ఏమిటో లగడపాటి కేంద్రం అఖిలపక్షం అనగానే మీడియా ముందుకు వచ్చే జోస్యం చెప్పారు. దానికి ఏకాభిప్రాయం అని ఒక ట్యాగ్ కూడా తగిలేశారు. నిజంగా ఏకాభిప్రాయం కావాలంటే తెలంగాణపై ద్వంద్వ విధానాలు అవలంబిస్తున్న పార్టీలను పిలిచి మాట్లాడండి. లేదా పార్టీల వారీగా దీనిపై చర్చించుకోండి. అప్పటికి ఏకాభిప్రాయం సాధ్యం కాకపోతే కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని లిఖిత పూర్వకంగా చెప్పండి. అప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వచ్చే వరకు మాట్లాడకుంటే మంచిది. కానీ మూడేళ్లుగా తెలంగాణ రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్న మూడు పార్టీల వల్లే (మూడు పార్టీల్లో అప్పుడు వ్యక్తిగతంగా ప్రత్యక్షంగా ఇప్పుడు పరోక్షంగా వైఎస్‌ఆర్‌సీపీ వైఖరి అలాగే ఉన్నది)ఈ సమస్య సాచివేతకు, రాష్ట్రంలో సంక్షోభానికి కారణమవుతున్నాయి. అందుకే అఖిలపక్ష భేటీకి ముందే ఈ మూడు పార్టీలు తమ పార్టీ పరంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. అంతేకాదు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకునేది మేమే అంటే టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలు స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలి. దీంతో అధికార పార్టీని నిలదీసే అవకాశం లభిస్తుంది. లేకపోతే కేంద్రం ఆడుతున్న ఈ నాటకంలో పార్టీలు, ప్రజాప్రతినిధులు, ప్రసారమాధ్యమాలు పాత్రధారులైతే... ప్రజలు ప్రేక్షులుగా మిగిలిపోవాల్సి వస్తుంది.

Labels: , , , ,

Thursday 6 December 2012

అఖిలపక్షంతోనే ఆకాంక్ష తీరదు

తెలంగాణపై ఎట్టకేలకు కేంద్రంలో కదలిక వచ్చింది. డిసెంబర్ 2న అఖిలపక్షభేటీని ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఇక తేల్చుకోవాల్సింది పార్టీలే. ఇంతకాలం తెలంగాణ ద్రోహులు మీరంటే మీరని ఒకరినొకరు నిందించుకున్నారు. రాష్ట్ర విభజనపై మీ అభిప్రాయం ఏమిటంటే భిన్నాభిప్రాయాలు చెప్పారు.  పార్టీకి ఒక్కరినే పిలుస్తామని కేంద్రహోం మంత్రి చెప్పారు అనితెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు స్పష్టం చేశారు. అదే గనుక నిజమైతే రెండు కండ్లు, ఇచ్చే శక్తి తెచ్చే శక్తి లాంటి మాటలకు అర్థం ఉండదు. అలాగే కాంగ్రెస్ చెబుతున్న ఏకాభిప్రాయం మాటకు కాలం చెల్లింది. ఎందుకంటే తెలంగాణకు అనుకూలంగా కేంద్రంలో మెజారిటీ పార్టీల మద్దతు ఉన్నది. ఏకాభిప్రాయానికి రావాల్సింది రాష్ట్ర పార్టీలేనని గతంతో చిదంబరం చెప్పిన విషయాన్ని గమనించాలి.

అలాగే ఇంత కాలం అఖిలపక్షం అన్న పార్టీలు ఇప్పుడు దీన్ని మరో నాటకంగా చిత్రించడం విడ్డూరంగా ఉన్నది. తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తమ వంతుగా ప్రయత్నం చేసి, అఖిలపక్షానికి ఒప్పించారు. ఎఫ్‌డీఐల ఓటింగ్ విషయంలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ తక్కువగా ఉండి అందుకు తలొగ్గిందా అనేది అప్రస్తుతం. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కాలయాపనపై ఎంపీలు కన్నెర్ర చేశారనే చెప్పవచ్చు. అఖిలపక్ష భేటీ తర్వాత ఫలితం ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే పార్టీల అసలు రంగు మాత్రం బయట పడడం ఖాయం. అఖిలపక్ష భేటీని రాజకీయ పార్టీలు రాజకీయం చేయకుండా సమస్య పరిష్కారానికి పోరాడాలి. ముఖ్యంగా చంద్రబాబు తాను తెలంగాణకు వ్యతిరేకం కాదు అని పదే పదే చెబుతున్నారు. అదే విషయాన్ని అఖిలపక్ష భేటీలో స్పష్టంగా చెప్పాలి. ఆ పార్టీ నేతలు కూడా చంద్రబాబే అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలని లేఖ రాసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. బాబు కూడా అఖిలపక్ష భేటీలో తమ అభిప్రాయం చెబుతామని అన్నారు కనుక దీన్ని స్వాగతించాలి. చంద్రబాబు చెబుతున్నట్టు తెలంగాణ అంశాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ పార్టీ టీడీపీ దెబ్బతీయాలని చూస్తుంది అనుకుంటే అఖిలపక్ష భేటీలో తెలంగాణపై స్పష్టంగా మీ అభిప్రాయం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ గనుక తెలంగాణకు వ్యతిరేకంగా ఉంటే ఆ పార్టీని ప్రజాక్షేత్రంలో ఎండగట్టే అవకాశం ఉంటుంది.  అలాగే వైఎస్‌ఆర్‌సీపీ కూడా కేంద్రం తెలంగాణ ఇస్తానంటే తాము అడ్డుకోబోమని ప్రకటించింది. దానికి ఆ పార్టీ కట్టుబడి ఉండాలి. అన్నికంటే ముందు కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణపై స్పష్టమైన వైఖరి వెల్లడించాలి. ఎందుకంటే అఖిలపక్ష భేటీ ఖరారైందని మీడియాలో వార్తలు రాగానే లగడపాటి రాష్ట్రం విడిపోదు అని చెప్పి తెలంగాణ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. అఖిలపక్షభేటీ తెలంగాణ ప్రాంత విజ్ఞప్తి మేరకే ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పడం చూస్తుంటే ఆయన ఏ హోదాలో దీనిపై స్పందిస్తున్నారో రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు చెప్పాలి. ఎందుకంటే కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని ముఖ్యమంత్రి మొదలు పీసీసీ అధ్యక్షులు చెబుతున్నారు. కనుక మూడేళ్లుగా రాష్ట్రంలోని ఒక ప్రధాన సమస్యపై కేంద్రం ఒక ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్న ఈ తరుణంలో లగడపాటి రాజగోపాల్ వంటి నేతల వ్యాఖ్యలు ఇరు ప్రాంతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా ఉన్నాయి. ఇలాంటి వారి వ్యాఖ్యలకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ అధిష్ఠానంపై ఉన్నది.

ఇక సీమాంధ్ర మీడియా కూడా రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న, సమర్థిస్తున్న వాళ్లను తెరమీదికి తెచ్చి వాళ్ల వ్యాఖ్యలను బ్రేకింగ్ న్యూస్ చేసి ప్రజలను గందరగోళపరచవద్దు. ప్రజలను సంయమనం కోల్పోవద్దు అని చెప్పే మీడియా ముందు ఆ పని తాను చేయాలి. సమస్య సానుకూలంగా పరిష్కారం కావాలంటే అందులో మీడియా పాత్ర ఎంతో ఉంటుంది. అందుకే మీడియా కూడా తమ వ్యక్తిగత అభిప్రాయాలను ఇతరుల ద్వారా చెప్పించి ప్రజలను రెచ్చగొట్టకుండా వ్యవహరిస్తే అదే పదివేలు. ఎందుకంటే చాలాకాలంగా ఈ సమస్య పరిష్కారం కావాలని రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారు. ఇందులో రాష్ట్ర విభజనకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఉన్నవారూ లేకపోలేదు. ఏదైనా ఒక అంశంపై ఏకాభిప్రాయం ఎన్నటికీ సాధ్యం కాదు. బాధితుల పక్షాన నిలవాల్సిన బాధ్యత పార్టీలపై ఉన్నది. తెలంగాణ అంశం ఈనాటిది కాదు ఆరు దశాబ్దాలుగా ఉన్నదే. అభివృద్ధి మండళ్లు, ప్యాకేజీలు ఈ ప్రాంత ప్రజలకు ఆమోదయోగ్యం కావు. గతంలో ఈ ప్రయోగాలన్నీ విఫలమయ్యాయి. ఇంకా ఈ ప్రాంతాన్ని ప్రయోగశాలగా ఉపయోగించుకోకుండా ప్రజల ఆకాంక్షను గౌరవించాల్సిన బాధ్యత అధికార పార్టీపై ఉన్నది. ఎందుకంటే ఇచ్చేది తెచ్చేది మేమే అని ఇంత కాలం ఊదరగొట్టింది కాంగ్రెస్ పార్టీ వారే. అయితే అఖిలపక్ష భేటీకి సంబంధించిన అధికార తేదీ ఖరారైంది కానీ విధివిధానాలు ఎలా ఉంటాయో వెల్లడికావాల్సి ఉన్నది. అంతవరకు ముఖ్యంగా నేతలు ప్రగల్భాలు పలకడం మానుకోవాలి. ఆల్ పార్టీ మీటింగ్ ప్రయత్నం ఎవరిదైనా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు ఏకతాటిపై నడవాలి. డిసెంబర్ 9 ప్రకటనకు కేంద్రం కట్టుబడి ఉండేలా ఒత్తిడి తేవాలి. ఇందుకు పార్టీల జెండాలు పక్కన పెట్టి తెలంగాణ అజెండాగా పనిచేస్తేనే ప్రజల ఆకాంక్ష నెరవేరుతుంది. లేకపోతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై ఇంతవరకు వేసిన కమిటీలకు కొనసాగింపుగా ఈ అఖిలపక్ష మిగులుతుంది తప్ప, ప్రయోజనం ఉండదు.

Labels: , , , ,

నరంలేని నాలుక



తెలంగాణ ప్రాంతంలోని కొందరు కాంగ్రెస్ ఎంపీలు ప్రత్యేక రాష్ట్రంపై కాంగ్రెస్ అధిష్ఠానంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్న తరణం ఇది. ఇందుకోసం వాళ్లంతట వాళ్లే డిసెంబర్ 9 డెడ్‌లైన్ కూడా విధించుకున్నారు. వాళ్లలో ఎంత మంది ఆ మాటకు కట్టుబడి ఉంటారో తెలియదు. కానీ వాళ్ల చిత్తశుద్ధిని మాత్రం శంకిచాల్సిన పనిలేదు. అయితే వచ్చిన సమస్యల్లా ఈ ప్రాంత ఎమ్మెల్యేలు, మంత్రులతోనే. వీళ్లు ఇంకా మాకు మా అధిష్ఠానంపై నమ్మకం ఉందంటారు. అధిష్ఠానానికి లేఖలు రాస్తారు. అధిష్ఠానంపై ఒత్తిడి తేవాడానికి ఢిల్లీ యాత్రలు చేస్తారు. ఇదంతా ఈ ప్రాంత ప్రజల ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికేనని ఈ ఈ ప్రాంతంలో ఏ చిన్నపిల్లవాడిని అడిగినా తడుముకోకుండా జవాబు ఇస్తాడు. ఇదీ ఈ ప్రాంత కాంగ్రెస్ నేతల వైఖరి.

ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు కొంతమంది గతంలో రాజశేఖర్‌రెడ్డి అనుయాయులు పోషించిన పాత్రను ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి కోసం చేస్తున్నారు. అందులో భాగంగానే జగ్గారెడ్డి వంటి నేతలు అసలు తెలంగాణే అవసరం లేదంటారు. తెలంగాణ కంటే తమకు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ముఖ్యమంటారు. అసలు ఈ ప్రాజెక్టుకు జాతీయ సాధ్యమవుతుందా అనే ప్రశ్నార్థకమే. అంతేకాదు ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై భిన్నవాదనలు జరుగుతున్నాయి. ఇక జాతీయహోదా అనేది కూడా అసంభవమే. ఎందుకంటే ఒక రాష్ట్రంలోని రెండు ప్రాజెక్టులకు జాతీయహోదా లభించకపోవచ్చు. నీటిపారుదల నిపుణులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. అలాగే  ఇప్పుడు జగ్గారెడ్డి చేస్తున్న వాదనకు మద్దతు ఎంతమంది ఇస్తున్నారో తెలియదు. కానీ జగ్గారెడ్డి ఎవరి మెప్పుకోసం తెలంగాణ వద్దంటున్నాడో వారే పోలవరం నిర్మించి తీరుతామంటున్నారు. లక్షలాది ఎకరాల భూములను, ఆదివాసులను ముంపుకు గురిచేసి తెలంగాణ ప్రాంతాన్ని నిలువునా ముంచే ప్రాజెక్టును మాత్రం జగ్గారెడ్డి వ్యతిరేకించడం లేదు. కానీ తెలంగాణ ఎందుకు వద్దో తాను ఢిల్లీకి వెళ్లి అధిష్ఠాన పెద్దలను కలిసి వివరిస్తాను అంటున్నారు. ఇక జగ్గారెడ్డి చేస్తున్న తెలంగాణ వ్యతిరేక వాదనలను ఆయన పార్టీకి చెందిన మంత్రులు తప్పుపడుతున్నారు. వాళ్లకు ఆయన సమాధానం చెప్పకుండా హస్తినకు వెళ్లి తన అంతరంగాన్ని వివరిస్తాను అనడం ఆయన అవివేకమే. ఎందుకంటే ఒకవైపు తెలంగాణ కోసం ఇంత పెద్దఎత్తున ఉద్యమం జరుగుతున్నది. ప్రత్యేక రాష్ట్రం కోసం వందలాదిమంది బలిదానాలు చేసుకున్నారు. సీమాంధ్ర పార్టీలకు ఈ ప్రాంతంలో మనుగడే లేకుండా చేయాలని ప్రజలంతా ఏకమై నినదిస్తుంటే, ఈ ప్రాంతంలోనే పుట్టి, ఈ ప్రాంత ప్రజల ఓట్లతో గెలిచిన వ్యక్తి వలసవాదులకు కొమ్ముకాసే విధంగా జగ్గారెడ్డి వ్యవహరిస్తున్నారు.

గతంలో రాజశేఖర్‌రెడ్డి హయాంలో మాకు తెలంగాణ కంటే అభివృద్ధే ముఖ్యమని చెప్పిన నేతల రాజకీయ భవితవ్యం ఏమైందో అందరికీ ఎరుకే. సొంత ప్రయోజనాల కోసం ప్రజల ఆకాంక్షలను సీమాంధ్ర పాలకుల దగ్గర తాకట్టు పెట్టాలనుకునే వారు కాలగర్భంలో కలిసిపోక తప్పదు. అది చరిత్రలో రుజువైంది కూడా. ఒక పార్టీ, ఒక వ్యక్తి పట్ల ఉన్న వ్యతిరేకతతో జగ్గారెడ్డి వంటి నేతలు నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను అవమాన పరిచేవిధంగా మాట్లాడితే అది క్షమించరాని నేరమే అవుతుంది. ఆయన మొదట తెలంగాణ కోసం ఏర్పాటైన పార్టీ నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయాన్ని మరిచిపోతున్నారు. రాజశేఖర్‌రెడ్డి ‘ఆపరేషన్ ఆకర్ష’కు ఆకర్షితులై ఉద్యమానికి వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు కిరణ్ కోసం తెలంగాణపై కిరికిరి చేయాలని చూస్తున్నారు. హస్తిన పెద్దల సాచివేతపై సమరం మోగిస్తున్న ఈ సమయంలో జగ్గారెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే దాని వెనుక ఎవరు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. స్వలాభం కోసం జగ్గారెడ్డి వంటి వారు ఈ ప్రాంత మనోభావాలను దెబ్బతీయాలని చూస్తే వారికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. అంతేకాదు ఇలాంటి నేతలు రేపు పోటీ చేయబోయేది తెలంగాణ ప్రాంతంలో అనే విషయాన్ని మరిచిపోతున్నారు. అధికారంలో ఉన్నాం కదా అనే అహంభావం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అంటే అది ఎంతో కాలం నిలవదు. ఇప్పుడు జగ్గారెడ్డి తెలంగాణ అవసరం లేదని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నా, లోలోపలే ఆయన మాటలను సమర్థిస్తున్న వారు కాంగ్రెస్ పార్టీలో లేకపోలేదు. అలాంటి వారు కూడా త్వరలో బయటపడతారు. అందుకే ఇప్పుడు ఈ ప్రాంత ప్రజలు చెబుతున్నది ఏమిటి? వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ తెలంగాణవాదులకు, తెలంగాణ ద్రోహులకు మధ్యే ఉంటాయి అంటున్నారు. అప్పుడు గెలిచేది ప్రజల ఆకాంక్షనా, లేక సీమాంధ్ర పాలకులకు వత్తాసు పలుకుతున్న వారి అహంకారామా అనేది. ఈ పరిణామలు కూడా తెలంగాణ ప్రజలకు ఒకింత మంచిదే. వచ్చే ఎన్నికల్లో మనం ఎవరితో యుద్ధం చేయాలో ప్రజలకు ఇప్పటికే స్పష్టమైంది. అందుకే కాళోజీ చెప్పినట్టు ప్రాంతం వాడు మోసం ప్రాంతంలోనే పాతరపెట్టాలి. ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం పొలిమేరదాకా తరిమికొట్టాలి అనేది ఆచరణలో చూపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది.

Labels: , ,

Tuesday 4 December 2012

ఆంధ్రా పార్టీలపై అలసత్వం వద్దు!


కేసీఆర్ హస్తిన చర్చల తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై ఎటూ తేల్చలేదు. ఢిల్లీలో ఒకవైపు ఆయనతో చర్చలు చేస్తూనే కాంగ్రెస్ అధిష్ఠాన పెద్దలు పూటకోరకంగా మాట్లాడారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై మోసం చేయబోతున్నదనే అంచనాకు వచ్చారు కేసీఆర్. ఇక కాంగ్రెస్ పార్టీతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. అయితే కేసీఆర్ ఢిల్లీ చర్చలపై ఇంటా బయటా విభిన్న వాదనలు ముందుకొచ్చాయి. దీంతో అయోమయంలో ఉన్న క్యాడర్‌కు హస్తిన చర్చల విషయాలను వెల్లడించేందుకు కరీంనగర్‌లో రెండు రోజుల పాటు ‘మేథోమధన’ సదస్సును ఏర్పాటు చేశారు. అందులో పార్టీలోని పొలిట్‌బ్యూరో సభ్యులు, రాష్ట్ర స్థాయి నేతలు, జిల్లా కన్వీనర్‌లు మొదలు అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకున్నారు.  తాను కూడా ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠాన పెద్దలతో చేసిన చర్చల సారాంశాన్ని ఆ సమావేశంలో వారితో పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వదనే అంచనాకు  వచ్చారు. ఇక ఆ పార్టీతో ప్రత్యక్ష యుద్ధానికి సన్నద్ధమయ్యారు. పార్టీలోని అందరి అభిప్రాయం కూడా అదే. ఆ తర్వాత మీడియా సమావేశంలోనూ కేసీఆర్ చర్చల సారాంశాన్ని వెల్లడించిన విషయం విదితమే.

ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమాన్ని అవసరానికి వాడుకొని,  తర్వాత ప్రజల ఆకాంక్షను పక్కన పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. అందుకే జేఏసీ కూడా కాంగ్రెస్ పార్టీయే లక్ష్యంగా ఉద్యమకార్యాచరణ ప్రకటించింది. తెలంగాణ కోసం ఎన్ని రూపాల్లోనూ ఉద్యమించినా కాంగ్రెస్ పార్టీ ఏకాభిప్రాయం, సంప్రదింపుల పేరుతో మూడేళ్లుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నది. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంపశయ్యపై ఉన్నాయి. కనుక ఎన్నికలు ఏ సమయంలోనైనా రావొచ్చుననేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. తెలంగాణ రాష్ట్రం సాకారం కావాలంటే ఉద్యమాల ద్వారానే అది సాధ్యం అనేది మెజారిటీ ప్రజల అభిప్రాయం. ఉద్యమాలతో పాటు రాజకీయ ప్రక్రియ కూడా అవసరమే అన్నది కూడా మరికొందరి అభిప్రాయం. అందుకే కేసీఆర్ సొంత రాజకీయ అస్తిత్వం ద్వారా తెలంగాణను సాధించుకుందానే నిర్ణయానికి వచ్చారు. ఒకవైపు ఉద్యమం చేస్తూనే మరోవైపు తెలంగాణలో సీమాంధ్ర పార్టీలకు చోటులేకుండా చేయాలని నొక్కిచెప్పారు. వంద అసెంబ్లీ, 16 పార్లమెంటు స్థానానాలు సాధిస్తే కేంద్రంలో ఎవరు ఉన్నా తెలంగాణను అడ్డుకోలేరని మేథోమధన సదస్సులో వెల్లడించారు. అట్లాగే జేఏసీతో టీఆర్‌ఎస్‌కు ఉన్న విభేదాల గురించి చెప్పారు. విభేదాలు ఉన్నమాట వాస్తవమేనని వాటిపై చర్చించి అందరిని కలుపుకుని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ బాధ్యత తానే తీసుకుంటానని కూడా చెప్పారు. అన్నట్టుగానే జేఏసీ నేతలతో సమావేశమై పాలమూరు, పరకాల ఉప ఎన్నికల తర్వాత జేఏసీ, టీఆర్‌ఎస్‌ల మధ్య ఏర్పడిన అభిప్రాయ భేదాలపై అంతా కలిసి చర్చించారు.

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని టీఆర్‌ఎస్ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. ఉత్తర తెలంగాణలో ఆ పార్టీ బలంగానే ఉన్నది. అయితే దక్షిణ తెలంగాణలో మాత్రం పార్టీ నిర్మాణం పటిష్టంగా లేదని ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. అందుకే దక్షిణ తెలంగాణలో పట్టుసాధించడానికి టీఆర్‌ఎస్  సూర్యాపేటలొ ‘సమరభేరి’ సభను ఏర్పాటు చేసింది. దీనికి తెలంగాణ పొలిటికల్ జేఏసీ  కూడా మద్దతు ప్రకటించింది. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడానికి ఆ సభ దోహదపడింది. అంతా అనుకున్నట్టుగానే లక్షలాది మందితో ఆ సభ విజయవంతం అయ్యింది. అయితే ఆ సభ సక్సెస్ అయినా కేసీఆర్ ప్రసంగం పేలవంగా ఉన్నదని కొంతమంది అభిప్రాయం. నిజమే లక్షలాది మందిలో కేసీఆర్ ప్రసంగం అనుకున్న రీతిలో లేదు. అయితే పార్టీలో మాత్రం జోష్‌ను పెంచగలిగారు. అంతకుముందు టీడీపీ అసమ్మతి ఎమ్మెల్యే  హరీశ్వర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరిక రంగారెడ్డి జిల్లాలో టీఆర్‌ఎస్‌కు కొంత కలిసివచ్చే అవకాశమే. అలాగే మరోటీడీపీ నేత సుధీర్‌రెడ్డి కూడా చేరడంతో రంగారెడ్డిలో టీఆర్‌ఎస్ పార్టీ పరిస్థితి గతంలో కంటే మెరుగ్గానే ఉన్నది. అయితే  సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఇదే సరిపోదు. క్షేత్రస్థాయిలో పార్టీ పునర్ నిర్మాణం జరగాలి. తెలంగాణ ప్రాంతంలో టీడీపీ నుంచి ఎంతమంది పెద్ద నేతలు వెళ్లిపోయినా ఆ పార్టీకి అంతో ఇంతో ఆదరణ ఇంకా ఉండడానికి కారణం ఆ పార్టీకి బలమైన క్యాడర్ ఉండడమే. అందుకే టీఆర్‌ఎస్ కూడా తన లక్ష్యసాధనలో విజయం సాధించాలంటే క్యాడర్‌ను మెరుగుపరుచుకోవాలి. అప్పుడు కేసీఆర్ అంచనాలు కార్యరూపం దాలుస్తాయి. టీఆర్‌ఎస్ ఇప్పటికే ప్రకటించిన పల్లెబాట, నగర బాట కార్యక్రమం ద్వారా ఆ లోటును పూడ్చుకోవాలి.

ఇక మరోసారి సూర్యాపేట సమరభేరి గురించి చర్చిద్దాం. ఈ సభ తర్వాత కాంగ్రెస్ పార్టీలో గుబులు పుట్టడానికి గల కారణాలు ఏమిటి? ఇంతకు ముందు టీఆర్‌ఎస్‌కు లక్షలాది మందిలో అనేక బహిరంగ సభలు నిర్వహించిన చరిత్ర ఉన్నది. కానీ నల్లగొండ జిల్లాలో సభ సక్సెస్ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. కేసీఆర్ నల్లగొండ జిల్లా నుంచి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. అందుకే ఈ చర్చలు. అదే గనుక నిజమైతే ఇప్పటి వరకు ఆ జిల్లాలో పాతుకుపోయిన తెలంగాణలోని ఒక సామాజిక వర్గానికి కొంత ఇబ్బందే. ఎందుకుంటే గత ఎన్నికల్లో కేసీఆర్ మహబూబ్‌నగర్ నుంచి పోటీచేయడం ద్వారా ఆ ప్రాంతంలో పరిస్థితులు మారాయి. తెలంగాణ ఉద్యమాన్ని చూస్తే ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు ఒకే రీతిలో ఉంటుంది. ఇంత కాలం ఉత్తరతెలంగాణకే పరిమితం అన్న సరిహద్దును మూడేళ్ల కిందట కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష చెరిపేసింది. ఉద్యమం ఉధృతంగా ఉన్న మాట వాస్తవమే. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత ఈ ప్రాంతంలో జరిగిన ఏ ఉప ఎన్నికల్లోనూ సీమాంధ్ర పార్టీలు గెలవలేదు. అదే పరిస్థితి సార్వత్రిక ఎన్నికల్లో పునరావృతం కావాలంటే చాలా శ్రమ పడాలి. అందుకే టీఆర్‌ఎస్ ఒకవైపు ఉద్యమం మరోవైపు ఎన్నికలు లక్ష్యాన్ని ఎంచుకున్నది.

అలాగే ఇప్పుడు రాష్ట్రంలో పాదయాత్రల కాలం సాగుతున్నది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, వైఎస్‌ఆర్‌సీపీ నుంచి షర్మిల తెలంగాణలో పాదయాత్రలు చేస్తున్నారు. ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నా పాదయాత్రలు మాత్రం ప్రశాంతంగానే సాగుతున్నాయి. ఇది తెలంగాణవాదులకు మింగుడు పడడం లేదు. ఎందుకంటే తెలంగాణను అడ్డుకున్నవారిలో ఈ రెండు పార్టీలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా కార్యాచరణ ఎంత ముఖ్యమో, టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీల రూపంలో కూడా తెలంగాణ ఉద్యమానికి ప్రమాదం పొంచి ఉన్నది. ఎందుకంటే ప్రత్యక్షంగానే చంద్రబాబు రాజీనామాలతో వచ్చిన తెలంగాణను అడ్డుకుంటే, పార్లమెంటులో ప్లకార్డు పట్టి తెలంగాణపై తనకున్న అక్కసును వెళ్లగక్కాడు జగన్. వీరు ఇప్పుడు తాము తెలంగాణకు వ్యతిరేకం కాదు అని తెలంగాణ ప్రాంతంలో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నా.. చంద్రన్న, రాజన్న రాజ్యం అని పాటలు పాడుతున్నారు. రాజశేఖర్‌రెడ్డి తెలంగాణకు ఎంత అన్యాయం చేశాడో తెలిసింది. ఆయన కూతురు ఇప్పుడు రాజన్న రాజ్యం వస్తేనే తెలంగాణకు న్యాయం జరుగుతుంది అంటున్నారు. ఇక చంద్రబాబు తన హయాంలోనే తెలంగాణ అభివృద్ధి చెందింది అంటున్నారు. దీనిపై బహిరంగ చర్చకు కూడా సిద్ధమే అన్నారు కూడా. ఈ రెండు పార్టీలు తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయకుండానే తమ పాదయాత్రలను కొనసాగిస్తున్నాయి. వీరిని అడ్డుకోవాల్సిందేనని తెలంగాణవాదుల అభిప్రాయం. ఈ విషయంలో తెలంగాణవాదుల అంతా కలిసికట్టుగా నినదిస్తేనే అది సాధ్యమవుతుంది. కానీ వాళ్లు ఎన్ని పాదయాత్రలు చేసినా జనం విశ్వసించరు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే తెలంగాణవాదం ఒక్కటే సీమాంధ్ర పార్టీలను మట్టికరిపించలేదు. సార్వత్రిక ఎన్నికల్లో అనేక అంశాలు ముందుకొస్తాయి. అప్పుడు సీమాంధ్ర పార్టీలు 20-40 స్థానాలు దక్కించుకున్నా అది ఉద్యమానికి ఎదురుదెబ్బే. ఆ పార్టీలో ఈ ప్రాంతంలో భూస్థాపితం కావాలంటే అందరి అభిప్రాయం ఒక్కటే కావాలి. తెలంగాణ కోరుకునే పార్టీలన్నీ ఏకతాటిపై రావాలి. అంతేకాదు ఎన్నికలే లక్ష్యంగా ఉద్యమిస్తే లాభం ఉండదు. అధికార పార్టీపై ఒత్తిడి పెంచాలి. ఎందుకంటే కేంద్రంలో ఇప్పుడు నడుస్తున్నది సంకీర్ణ ప్రభుత్వాలు. తమ రాజకీయ అవసరాలకు తీర్చుకోవడానికి చిన్నచితకా పార్టీలు కూడా కేంద్రాన్ని బెదిరించే స్థాయికి వచ్చాయి. అందుకే తెలంగాణకోసం ఉద్యమిస్తున్న టీ కాంగ్రెస్ ఎంపీలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఎఫ్‌డీఐలపై పార్లమెంటులో ఓటింగ్‌ను తమకు అనుకూలంగా మలుచకోవాలి. తెలంగాణపై స్పష్టమైన హామీ ఇస్తేనే ఓటింగ్‌లో పాల్గొంటామని తేల్చిచెప్పాలి. అంతేకానీ ఒకవేళ తెలంగాణ ఇవ్వకపోతే వేరే ఫ్రంట్ పెట్టుకుని పోటీ చేస్తామంటే కుదరదు. డిసెంబర్ ప్రకటన తర్వాత సీమాంధ్రలో పార్టీలకతీతంగా ఏకమై తెలంగాణను అడ్డుకున్న విషయాన్ని మరిచిపోవద్దు. అదే ఐక్యతను ఇప్పటికైనా ప్రదర్శిస్తే నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరుతుంది.

Labels: , , ,

చిత్తశద్ధిపైనే చింత

దళిత, గిరిజన ఉప ప్రణాళిక బిల్లుకు శాసనసభ అమోదం తెలిపింది.  ఈ ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించేందుకు ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని అన్ని పార్టీలు స్వాగతించాయి. అయితే ఈ సబ్‌ప్లాన్‌కు కొన్ని సవరణలు చేయాలని ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. ఏబీసీడీ వర్గీకరణ ప్రతిపాదికన ఉప ప్రణాళికలో నిధులు కేటాయించాలని టీడీపీ ప్రవేశపెట్టిన సవరణకు టీఆర్‌ఎస్, బీజేపీ, వైఎస్‌ఆర్‌సీపీ, ఎంఐఎం, వామపక్షాలు, లోక్‌సత్తా పార్టీలు మద్దతు తెలిపాయి. దీంతో స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. టీడీపీ ప్రతిపాదనకు అనుకూలంగా 47, వ్యతిరేకంగా 67 ఓట్లు వచ్చినట్టు స్పీకర్ ప్రకటించారు. దీంతో టీడీపీ సవరణ ప్రతిపాదన వీగిపోయింది. దీంతో సర్కార్ తీరుపై విమర్శలు వస్తున్నాయి.

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించే విషయంలో రాష్ట్ర సర్కార్ రాజకీయ లబ్ధి కోసమే ప్రయత్నించింది తప్ప చిత్తశుద్ధి చూపలేదన్నది ప్రతిపక్షాల వాదన. అందులో కొంత వాస్తవము లేకపోలేదు. ఎందుకంటే ఈ సబ్‌ప్లాన్‌కు రాష్ట్ర సర్కార్ పదేళ్ల కాలపరిమితి విధించింది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలకు చెందిన కోట్లాది రూపాయల నిధులు ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాల కోసం మళ్లించబడ్డాయి. దీన్ని స్వయంగా ముఖ్యమంత్రే అసెంబ్లీ వేదికగా ఒప్పుకున్నారు. మళ్లించిన నిధులు తిరిగి రికవరీ చేయాలని ప్రతిపక్షాలు చేసిన విజ్ఞప్తికి సర్కారు నుంచి సానుకూల స్పందన లేదు. అలాగే ఇప్పటి ఈ సబ్‌ప్లాన్ నిధులు మురిగిపోకుండా ఉండడానికి కూడా ప్రతిపక్షాలు కొన్ని సవరణ చేశాయి. దీనికి కూడా కిరణ్ సర్కార్ అంగీకరించలేదు. దీనిపై ముఖ్యమంత్రి ఓటింగ్‌కు స్పీకర్ అనుమతి ఇవ్వడాన్ని తప్పుపట్టారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా తాము వ్యవహరిస్తున్నామని పేర్కొన్నారు. అంతేకానీ ఇందులో ఎలాంటి దురుద్దేశాలు లేవన్నారు. కనుక ఈ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందేందుకు అందరూ సహకరించాలని విన్నవించారు.

రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజాల కోసమే పాకులాడుతాయనడంలో సందేహం లేదు. కానీ ఎట్టకేలకు ఎస్సీ, ఎస్టీల ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించే బిల్లును పాస్ చేయించుకోవడంలో కిరణ్ సర్కార్ విజయం సాధించింది. చట్టబద్ధత అయితే కల్పించింది కానీ దీని చిత్తశుద్ధిపైనే చింత ఉన్నది. ఎందుకంటే స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అన్ని పార్టీలు దళిత, గిరిజనుల అభ్యున్నతి గురించి మాటల్లో వల్లెవేస్తూనే ఉన్నాయి. కానీ నేటికి వారి జీవన స్థితిగతుల్లో వచ్చిన మార్పులేవీ లేవు.  వారి బతుకులు ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. ఇంకా దురదృష్టమేమింటే ఈ సామాజిక వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు కూడా వీళ్ల సమస్యలపై పోరాడడం లేదని దళిత, గిరిజనులు వాపోతున్నారు. ఇప్పటికీ దళిత, గిరిజన గూడాల్లో మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవు. ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు ఓట్ల కోసం అక్కడ రెండురోజులు బస చేయడం, కొన్ని హామీలు గుప్పించడం,  ఓట్లు దండుకున్నాక తిరిగి వారివైపు కన్నెత్తి చూడకపోవడం మనం చూస్తూనే ఉన్నాం. అందుకే ఎస్సీ, ఎస్టీల ఉపప్రణాళిక చట్టబద్ధత కల్పించినందుకు ఆయా సామాజిక వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతున్నా, దీని ఆచరణపై ఆందోళన కూడా వ్యక్తమవుతున్నది. ఇక అధికార పార్టీ నేతలు ఈ ఉప ప్రణాళిక చట్టబద్ధత ఘనత గురించి ఎవరికి వారే గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆ ఘనత ఎవరిదైనా ఈ ఉప ప్రణాళిక లక్ష్యం గాడితప్పకుండా పాటుపడితే అదే పదివేలు. అందుకు ప్రతిపక్షాలు కూడా పార్టీలకు అతీతంగా ఈ చట్టం సక్రమంగా అమలయ్యేలా ఒత్తిడి తేవాలి. అప్పుడు ఈ చట్టం లక్ష్యం నెరవేరుతుంది.

Labels: , ,

Friday 23 November 2012

అంతా అనుకూలమైతే, అడ్డు ఎవరు?

తెలంగాణ ప్రాంత ఎంపీలు డిసెంబర్ 9 ప్రకటనను అమలు చేయాలని పార్లమెంటు ఆవరణలో నిరసన తెలుపుతున్నారు. అయితే వీళ్ల నిరసన పత్రికలకే పరిమితమవుతున్నది తప్ప ప్రయోజనం లేదు. ఎందుకంటే పార్లమెంటు లోపల సభా కార్యక్రమాలను అడ్డుకున్నప్పుడే వారు చేపట్టే నిరసన కార్యక్రమాలకు విలువ ఉంటుంది. తెలంగాణకు మద్దతు ఇస్తున్న పార్టీలు కూడా వారికి సంఘీభావం తెలుపుతాయి. అప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానంపై ఒత్తిడి పెరుగుతుంది. అంతేకానీ ‘కర్ర విరగకూడదు పాము చావకూడదు’ అన్నట్టు టీ ఎంపీలు వ్యవహరించడం వల్ల వీళ్లు అలసిపోవడం తప్ప వాళ్ల అధిష్ఠానం మాత్రం స్పందించే అవకాశాలు లేవు. అట్లాగే టీ. ఎంపీలు ఏమంటున్నారు? కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ ఇవ్వము అని చెప్పలేదు కదా! అలా చెప్పినప్పుడు మా నిర్ణయం మేం తీసుకుంటాము అంటున్నారు. ఇంతకీ కాంగ్రెస్ తెలంగాణ ఇస్తామని ఎప్పుడు చెప్పింది? (ఇది కాంగ్రెస్ పార్టీలోని సీమాంధ్ర నేతలే కాదు తెలంగాణ ప్రాంతంలోని కొంతమంది కూడా మీడియా ముందు చెబుతూనే ఉన్నారు). మూడేళ్లు కాంగ్రెస్ పార్టీ చెబుతున్న కారణాలు, కాలయాపనల చూసినాక కూడా ఇంకా టీ. ఎంపీలకు తమ అధిష్ఠానం మీద ఇంకా నమ్మకం ఉంది అని అంటే అది వారి భ్రమే అవుతుంది. ప్రజలు మాత్రం విశ్వసించడం లేదు. ఆ పార్టీని విశ్వసించే అవకాశమూ లేదు. అలాగే ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే, చచ్చేది కూడా మేమే అని చెబుతున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చేది లేదు మీరు తెచ్చేది లేదు అనేది తేలిపోయింది. అందుకే  ఇక చచ్చే కంటే ప్రత్యేక కార్యాచరణ ఒకటి రూపొందించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే తెలంగాణపై నినదించే టీ ఎంపీల సంఖ్య కూడా రోజురోజూకు తగ్గిపోతున్నది. ఇంత గోడ మీద పిల్లుల్లా ఉన్నవాళ్లు మెల్లగా జారుకుంటున్నారు.

పదవులు వచ్చాక తెలంగాణవాదానికి తిలోదకాలు ఇచ్చినవాళ్లు కొంతమంది అయితే భవిష్యత్ వచ్చే పదవుల కోసం మరికొంత మంది పాకులాడుతున్నారు. తెలంగాణ కోసం అంతా ఐక్యంగా ఉండాలంటున్న వాళ్లే స్వలాభం కోసం శత్రువుతో జతకట్టబోతున్నారు. అందుకే తెలంగాణ కోసం పార్లమెంటు గొంతు చించుకుంటున్న టీ ఎంపీలకు బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ మద్దతు పలికారు కానీ తెలంగాణే తమ ఎజెండా అన్న వాళ్లు అక్కడ కనిపించలేదు. కనిపించరు కూడా. ఎందుకంటే వాళ్లకు కావలసింది ‘అమ్మ’ కనికరం. అందుకే సోనియాగాంధీ, రాహుల్‌గాంధీల దృష్టిలో పడడానికి పరుగులుపెడుతున్న నేతలు తెలంగాణ తేల్చకుండా నాన్చివేత ధోరణిని అవలంబిస్తున్న వారిని మాత్రం ప్రశ్నించడంలేదు. ప్రశ్నిస్తే పదవులు పోతాయి అన్న సంగతి వాళ్లకు ఎరుకే! అందుకే ఇప్పటికీ ‘అమ్మ’ తెలంగాణ ఇస్తుంది అని నమ్మబలుకుతారు. ఈ మాట ఇప్పుడు కాదు మూడేళ్లుగా చెబుతున్నారు. వినివాళ్లు ఉంటే ఇంకా కొత్తగా చెప్పేందుకు ప్రయత్నిస్తారు కూడా. అందుకే పార్లమెంటులో తెలంగాణకు వ్యతిరేకంగా ప్లకార్డు పట్టుకున్న జగన్‌ను ప్రశ్నించకుండా అవసరమైతే ఆయనకు అండగా ఉంటామంటారు. తెలంగాణపై విషం కక్కిన వైఎస్‌కు మేము అభిమానులం అంటారు. ఇంత బానిస మనస్తత్వం ఉన్నవాళ్లు ప్రజల పక్షాన నిలబడి, తమ బాధ్యతను నెరవేర్చాలి అంటే ఎలా కుదురుతుంది? వాళ్ల ఆలోచనలు వేరు, ప్రజల ఆకాంక్ష వేరు.

ఇక చంద్రబాబు ఏమంటున్నడు. టీడీపీ అధికారంలోకి వస్తే అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటాడట. ఈ చంద్రబాబు వల్లే ఇంత మంది బిడ్డలు బలిదానాలు చేసింది. మానవహక్కుల దినోత్సవం రోజు (డిసెంబర్ 10) ఈ ప్రాంత ప్రజల ప్రజాస్వామిక హక్కును కాలరాసింది ఈ చంద్రుడే. పెద్ద నిర్ణయమని, ఎవ్వరినీ సంప్రదించలేదని, ఆంధ్రప్రదేశ్‌ను విడదీయడానికి కర్నాటక వీరప్పమొయిలీ, తమిళనాడు చిదంబరం ఎవరని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టింది ఎవరు? ఇప్పుడు తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని, ఎప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడలేదని, మాట్లాబోనని అంటే ఎలా నమ్మాలి? ఎందుకు నమ్మాలి? ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష కోసం నలభై రెండు రోజులు సకల జనులు సమ్మె చేస్తే సంఘీభావం తెలపని చంద్రబాబు ఇప్పుడు సానుభూతి మాటలు మాట్లాడుతున్నాడు. దీనికి ఈ ప్రాంత టీడీపీ నేతలు ఆహా ఓహో అంటున్నారు.

వైఎస్ కూతురు, జగనన్న వదిలిన బాణం షర్మిల అంటున్నారు రాజన్న రాజ్యం వస్తేనే ప్రజల కష్టాలు తీరుతాయంటున్నారు. విజయమ్మ ఇంకో అడుగు ముందుకేసి వైఎస్, జగన్ ఎన్నడూ తెలంగాణను వ్యతిరేకించలేదన్నారు. నంద్యాలలో వైఎస్, పార్లమెంటులో జగన్ చర్యలు తెలంగాణ ప్రజల మరిచిపోలేదు. వైఎస్ తెలుగువారంతా కలిసి ఉండాలని కోరుకున్నారు అని చెప్పేవాళ్లు ఇప్పుడు తెలంగాణ గురించి వాళ్ల వైఖరి ఏమిటో స్పష్టంగా చెప్పడం లేదు. కానీ ఇచ్చే శక్తి తెచ్చే శక్తి లేదని ఎంత కాలం చెబుతారు. ఇవ్వండి అని ఎందుకు ప్రశ్నించరు. మీ ద్వంద్వ విధానం ఏమిటో అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు ఈ ప్రాంత ప్రజలు. వచ్చిన తెలంగాణను అడ్డుకున్న జగన్నాటక సూత్రాధారులు ఏవరో తెలంగాణ ప్రజలకు తెలుసు. అందుకే ఇంకా ఈ మాయ మాటలు నమ్మి మోసపోయే కాలం పోయింది. రాజకీయ అవసరాల కోసం తెలంగాణ అంటున్న ఈ ప్రాంత నేతలకైనా, ప్రాంతేతర నేతలకైనా ఎన్నికల సమయంలో ఈ ప్రాంత ప్రజల నుంచి ఎదురయ్యేది ప్రతిఘటనే!

Labels: , , ,

Saturday 17 November 2012

తేల్చుకోవాల్సింది తెలంగాణ ప్రజలే!



తెలంగాణ ప్రజలకు ఇప్పుడు పరీక్షా సమయం. ఎందుకంటే రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని ఒకరిపై ఒకరు నిందలు మోపుకోవడం కొంతకాలంగా చూస్తున్నాం. ఇంతకీ ఎవరు ఎవరితో లాలూచీ పడ్డారు? పడుతున్నారు అనేది సమస్య. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. టీడీపీ తెలంగాణపై తేల్చడానికి వెంటనే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని ప్రధానికి లేఖ రాసింది. దీన్ని నిరసిస్తూ ఆ పార్టీకి చెందిన ఇద్దరు రాయలసీమ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి వైఎస్‌ఆర్‌సీపీలో జంప్ అయ్యారు. నిజానికి వాళ్లు పార్టీని వీడడానికి, బాబు తెలంగాణపై ప్రధానికి లేఖ రాయడానికి సంబంధం లేదు. కానీ దీన్ని సాకుగా చూపి వాళ్లు పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. అంటే వారి ఉద్దేశ్యం ఏమిటి? వైఎస్‌ఆర్‌సీపీ సమైక్యవాదానికే మొగ్గుచూపుతున్నదని దాని అర్థం. కానీ వైఎస్‌ఆర్‌సీపీ నేతలు చెబుతున్నదేమిటి? మేం తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తున్నాం. అందుకే తెలంగాణలో జరిగిన గత ఉప ఎన్నికల సమయంలో మేం పోటీ పెట్టలేదు అంటున్నది. కానీ అప్పుడు ఆ పార్టీ పోటీ పెట్టి ఉంటే కాంగ్రెస్, టీడీపీలకు ఎదురైన చేదు అనుభవానికి భిన్నంగా ఏమీ ఉండేది కాదు. అలాగే వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు అభివృద్ధి మంత్రమే జపిస్తున్నాయి. కానీ ప్రజల ఆకాంక్ష గురించి మాట్లాడడం లేదు. దానిపై డిమాండ్ చేయడం లేదు. అధికార పార్టీకి చెందిన కొంత మంది తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు ప్రత్యేక రాష్ట్రం కోసం నినదిస్తున్నా.. అన్నీ వారి అధిష్ఠానం కనుసన్నల్లోనే జరుగుతున్నది. ఇక తెలంగాణ టీడీపీ నేతలు అయితే టీఆర్‌ఎస్, ఉద్యమ నాయకత్వాన్ని తిట్టడమే ఉద్యమమని అనుకుంటున్నారు.

మూడేళ్లుగా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీలకు చెందిన తెలంగాణ ప్రజాప్రతినిధులు తమ పదవులను వదులుకోవడం లేదు. వీరికి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రత్యేక కార్యాచరణ అంటూ ఏదీ లేదు. కాంగ్రెస్ నేతలది ఢిల్లీ చక్కర్లు, లేఖల ఉద్యమాలైతే.. టీడీపీ నేతలు ప్రెస్‌మీట్లకే పరిమితమయ్యారు. పైగా తెలంగాణ కోసం రాజీనామా చేసిన చోట్ల పోటీకి కూడా దిగారు. అదేమంటే ఒకరు తమది జాతీయ పార్టీ కాబట్టి పోటీకి దిగకపోతే కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు వెళతాయి అంటారు. టీడీపీ కాంగ్రెస్ పోటీలో ఉన్నది కాబట్టి తామూ కూడా పోటీ పెడుతున్నట్టు చెబుతుంది. ఒక పార్టీ కాలయాపనతో కాలం వెళ్లదీస్తుంటే.. మరొక పార్టీ కబుర్లతో కాలక్షేపం చేస్తున్నది. ఇక టీడీపీ అంటున్న అఖిలపక్షం ఉంటుందో లేదో తెలియదు. ఎందుకంటే ఇటీవలే కేంద్ర హోం మంత్రి తెలంగాణపై చర్చలు పూర్తయ్యాయి. అవసరమనుకుంటే అఖిలపక్షం పెడతామన్నారు. దీనికంటే ముందు టీడీపీ అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం చేయాలని పట్టుబట్టాలి. నిజంగా ఆ పార్టీ తెలంగాణకు కట్టుబడి ఉన్నట్టయితే తీర్మానం సమయంలో ఎవరు తెలంగాణ ద్రోహులో తెలిసిపోతుంది. ఆ మధ్య ముఖ్యమంత్రి చెప్పినట్టు తీర్మానం వీగిపోతుందా? లేక నెగ్గుతుందా అనేది కూడా తేలుతుంది. అప్పుడు వైఎస్‌ఆర్‌సీపీ, కాంగ్రెస్‌ల వైఖరి కూడా బయటపడుతుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఈ పని చేయగలిగితే తెలంగాణపై ఏ పార్టీ ఎంత నిజాయితీగా ఉన్నదో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది. అప్పుడు వాళ్లే నిర్ణయించుకుంటారు ఏం చేయాలో?

మరో విషయం ఏమంటే ఎంఐఎం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతు ఉపసంహరిస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నాక దీనిపై కూడా భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఎంఐఎం వైఎస్‌ఆర్‌సీపీతో జతకట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నది అధికార, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అదే గనుక నిజమైతే తెలంగాణపై వైఎస్‌ఆర్‌సీపీ అభిప్రాయం అడక్కరలేదు. ఎందుకంటే ఎంఐఎం అసెంబ్లీ వేదికగానే సమైక్యవాదాన్ని వినిపించింది. ఆ పార్టీ వైఎస్‌ఆర్‌సీపీతో జతకట్టబోతున్నదంటే రాష్ట్ర విభజనపై ఆ పార్టీ విధానం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అందుకే గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకుంటున్నట్టు మొన్నటి దాకా తెలంగాణపై కాంగ్రెస్, టీడీపీల్లోనే భిన్న రాగాలుండేవి. ఇప్పుడు తాజాగా వైఎస్‌ఆర్‌సీపీ ఆ జాబితాలో చేరింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది తెచ్చేది మేమే కాబట్టి మేం లేఖ ఇవ్వాల్సిన అవసరం లేదంటుంది. టీడీపీ లేఖ ఇచ్చాము కాబట్టి అఖిలపక్షం పెట్టాలంటుంది. వైఎస్‌ఆర్‌సీపీ లేఖ రాయదు, అఖిలపక్షం పెట్టమని డిమాండ్ చేయదు. తెలంగాణపై తేల్చాల్సిందేనని కేంద్రంపై ఒత్తిడి చేయదు. రాష్ట్రంలోని ప్రధాన సమస్యపై పార్టీల ద్వంద్వ నీతి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో  బయటపడింది. ఇక తేల్చుకోవాల్సింది తెలంగాణ ప్రజలే!

Labels: , , ,

Saturday 10 November 2012

హస్తిన ఆటలు ఇంకెన్నాళ్లు ?




రాజకీయ పార్టీలు ఎప్పుడూ రాజకీయాలే చేస్తాయిఇందులో జాతీయ పార్టీలు మొదలు ప్రాంతీయ పార్టీల వరకు ఎవరి పంథా వారిదిఅట్లాగే రాజకీయ పార్టీలు ప్రజాసమస్యలపై చేసే పోరాటాల్లో కూడా వారి ప్రయోజనాలు ఉంటాయిఇందులో వంతలువిశేషాలు ఏమీ లేవుటీఆర్‌ఎస్ పార్టీ రెండు మేధోమథనం తర్వాత పరిణామాలు రాష్ట్ర రాజకీయాలో మాటల యుద్ధానికి తెరలేపాయిఐదు దశాబ్దాలుగా తెలంగాణను మోసం చేసింది ఇప్పుడూ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీఅయితే తెలంగాణపై ఐదు దశాబ్దాలలో ఒక సానుకూల ప్రకటన చేసింది కూడా ఆ పార్టీనేటీఆర్‌ఎస్ రెండు రోజుల మేధోమథనం తర్వాత కేసీఆర్ నాలుగు నెలలుగా తెలంగాణపై జరిగిన చర్చల సారాంశాన్ని మీడియా ముందు వెల్లడించారుహస్తిన జరిగిన చర్చలపై ఇంత కాలం సాగిన అనేక వాదోపవాదాలకు ఆయన తెర దించారుకాంగ్రెస్ పార్టీ మోసపూరిత విధానాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామన్నారుఅయితే హస్తినకు వెళ్లే ముందే కేసీఆర్‌ను హెచ్చరించిన వాళ్లు ఉన్నారురాయబారం విఫలమవుతుందని తెలిసినా ఇచ్చేది అధికార పార్టీ కనుక కేసీఆర్ హస్తినకు వెళ్లారుసంప్రదింపుల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారమని తెలంగాణ వ్యతిరేకులు అంగీకరిస్తున్నారు

కాంగ్రెస్:
అయితే హస్తిన రాయబారం విఫలమైన తర్వాత తాజాగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపాయిచర్చలకు ముందు ఆయన చెప్పిన 'ఇస్తే సంబురంలేకపోతే సమరం అనేది ఇప్పుడు ఆచరణలోకి వచ్చిందిఅయితే తెలంగాపై కేసీఆర్‌తో ఒకవైపు చర్చలు చేస్తూనే మరోవైపు ప్రత్యేక రాష్ట్రానికి వ్యతిరేకంగా హస్తిన పెద్దలు అవాకులు చెవాకులు పేలారుఇది సహజంగానే ఉద్యమకారులకు ఆగ్రహాన్ని తెప్పించిందిఅందుకే కేసీఆర్ కంముందుగానే టీ జేఏసీ తెలంగాణ మార్చ్ రోజునే కాంగ్రెస్‌పై సమరానికి సిద్ధమన్నదిఇంతకాలం తెలంగాణపై తనకు అవగాహన లేదనిదీనిపై ఎలాంటి చర్చలు జరగడం లేదని అన్న కేంద్ర హోం మంత్రి ఇప్పుడు అఖిలపక్ష భేటీ ఎప్పుడైనా జరగవచ్చు అని ప్రకటించారుతెలంగాణపై పూర్తిస్థాయిలో చర్చించామన్నారుతెలంగాణ పరిష్కారం కోసం ఇంతకాలం ఆగారుమరికొంతకాలం వేచిచూడాలని తాజా గడుపు పెట్టారుఅంతెలంగాణపై ఒక్క కేసీఆర్ మాత్రమే గడువులు పెట్టలేదుకాంగ్రెస్ పార్టీ మూడేళ్లుగా అనేక గడువులు పెట్టిందిఅయినా అటు ఉద్యమ నాయకత్వం గానీఇటు ఈ ప్రాంత ప్రజలు గానీ ఎంతో ఓపిగా ఎదురుచూశారుఇప్పుడు కేసీఆర్ ఇక సమరమే అన్నాక మరికొంత సమయం కావాలంటున్నదిఈ అంశాన్ని తేల్చడానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే  అంతర్గంతా ఆజాద్వాయలార్ రవి వంటి నేతలు ఇరు ప్రాంతాల నేతలతో చర్చించిందివారి అభిప్రాయాలను అధినేత్రి ముందు పెట్టారుఇరు ప్రాంతాల నేతలు కూడా దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఎంతో కాలంగా అడుగుతున్నారుకానీ హస్తిన పెద్దలు పండుగలుఎన్నికలుసోనియా ఆరోగ్యంక్యాబినేట్ పునర్ వ్యవస్థీకరణపార్టీ సంస్థాగత మార్పులు అంటూ గడువులు పెట్టుకుంటూ గందరగోళానికి గురైందిఅలాగే తెలంగాణపై జరుగుతున్న చర్చలకు సంబంధించి ఒకమాట మీద నిలబడితే దీనిపై ఏదో నిర్ణయం వస్తుందని ప్రజలు ఆశించే వారుకానీ కాంగ్రెస్ నేతల కన్ఫ్యూజన్ మాటలు  ఇరు ప్రాంతాల ప్రజలను బాధపెట్టాయిఆంధ్రప్రదేశ్ ఉన్న అస్థిరతకు పుల్‌స్టాప్ పెట్టాలని ప్రజాప్రతినిధులుప్రజలు ఎంత వేడుకున్నా సోనియామన్మోహన్‌లు మౌనమే మా సమాధానం అన్నారు

టీడీపీ:
అలాగే టీడీపీ కూడా తెలంగాణపై లేఖ విషయంలో ఎన్ని గడువులు విధించిందో మనకు తెలిసిందేతీరా ఆ లేఖలో తెలంగాణకు అనుకూలంగా ఏమీ లేదుకాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిందని చెప్పుకొచ్చారుతెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీయే అని చెప్పిన బాబు దీనిపై ఎన్ని మాటలు మార్చారుఅఖిలపక్ష భేటీలో తమ అభిప్రాయం స్పష్టంగా చెబుతామన్న బాబు  మాటల్లో స్పష్టత లేనే లేదునిజంగా బాబు తెలంగాణకు వ్యతిరేకం కాకపోతే గతంలో అఖిలపక్ష భేటీలోనే స్పష్టమైన వైఖరి వెల్లడిస్తే బాగుండేదిఅలాగే 200నుంచి తెలంగాణపై బాబు వైఖరి అసంబద్ధంగానే ఉన్నదిమొదట సమైక్యం అన్నారుతర్వాత 200తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేశారుడిసెంబర్ ప్రకటన తర్వాత మాట మార్చారుశ్రీకృష్ణ కమిటీ ముందుఅఖిలపక్ష భేటీలోనూ రెండు వాదనలు వినిపించారుఇప్పుడు మాత్రం స్పష్టమైన వైఖరి చెబుతామంటున్నారుఇప్పటి వరకు బాబు చేసిన ఫీట్లు వల్ల టీడీపీ ఎక్కువ నష్టపోయిందితేల్చాల్సి కాంగ్రెస్ మాత్రం ఇంత వరకు తన అభిప్రాయం చెప్పకుండా గుంభనంగా ఉన్నదిఅందుకే కాంగ్రెస్ పార్టీ అడిన నాటకంలో ప్రధాన భూమిక బాబు పోషించారని టీడీపీని వీడిన ఎమ్మెల్యే బాబు వైఖరిని తప్పుపట్టారుఅందుకే ఆ పార్టీ నేతలు టీఆర్‌ఎస్ ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు టీడీపీ విశ్వసించకపోవడానికి కారణం బాబు వైఖరేగతంలో కేంద్రం తెలంగాణపై సానుకూల ప్రకటన చేస్తుందని బాబు భావించలేదుఅందుకే నాటి ముఖ్యమంత్రి రోశయ్య అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష భేటీలో అశోకగజపతి రాజు పంపి తెలంగాణకు మేము అనుకూలం అన్నదిచిదంబరం ప్రకటన తర్వాత షాక్‌కు గురైన చంద్రబాబు డిసెంబర్ 1తర్వాత తెలంగాణపై తన వ్యతిరేకతను మీడియా ముందు వెళ్లగక్కాడునాటి నుంచి తెలంగాణ ప్రాంతంలో పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుండడంతో మళ్లీ బాబు మాట మార్చాడుఅయితే ఇప్పటికి తెలంగాణపై చంద్రబాబు వైఖరి నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టుగానే ఉన్నదిఅందుకే తెలంగాణ మేం అనుకూలం అనకుండా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారుబాబు ఆంతర్యాన్ని అర్థం చేసుకోలేనంత అమాయకులా ఈ ప్రాంత ఇప్పటికైనా బాబు ద్వంద్వ వైఖరిని విడనాడి స్పష్టమైన ప్రకటన చేస్తే ఇరు ప్రాంతాల ప్రజలకు మేలు చేసినవారవుతారు

వైఎస్‌ఆర్‌సీపీ:
తెలంగాణపై వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వైఖరి ఏమిటో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విదితమేఆయన ఆశయాలు సాధిస్తామురాజన్న రాజ్యం తెస్తామంటున్న ఆ పార్టీ వైఖరి తెలంగాణపై బాబు కంభిన్నంగా ఏమీలేదుబాబు అయినా వ్యతిరేకం కాదంటున్నా జగన్ బాబు ఇప్పటికే తన వ్యతిరేకతను పార్లమెంటులో ప్రదర్శించారుకనుక ఈ ప్రాంత ప్రజల మనోభావాలను గుర్తిస్తున్నాము అని అంటున్నా ప్రజల మనసులను గెలుచుకోలేకపోతున్నారుఅందుకే మానుకోటసిరిసిల్లలో ఆ పార్టీని నిలదీశారుపరకాల ఎన్నిక ద్వారా సంకేతం పంపారుఅయితే స్వల్ప మెజారిటీతో టీఆర్‌ఎస్ నెగ్గడాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నది ఆ పార్టీఇది తమను తాము మోసం చేసుకోవడమేతెలంగాణ సంగతి పక్కన పెడితే పరకాలలో కొండా దంపతులకు ఉన్న పట్టు గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదుఅంతటి బలమైన నేతలే అక్కడ ఓటమి పాలయ్యారుఇప్పుడు ఆ స్థాయి నాయకులు తెలంగాణ ప్రాంతంలో వైఎస్‌ఆర్‌సీపీకి లేరుకాబట్టి తెలంగాణ వైఎస్‌ఆర్‌సీపీ బలం పుంజుకుంటున్నది అందానికి అర్థం లేదువైఎస్‌ఆర్‌సీపీ అంఅందులో ఉన్నది కొత్త రక్తం ఏమీ కాదుదశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కాకలు తీరన నేతలంతా ఇప్పుడు ఆ పార్టీలోకి వెళ్లిపోయారుఇక తెలంగాణలో ఈ పార్టీ విశ్వాసం పొందకపోవడానికి అనేక కారణాలున్నాయిఇచ్చే శక్తి తేచ్చే శక్తి తమకు లేదని తాత్కాలింగా తప్పించుకున్నా.తెలంగాణ ఇవ్వాలని డిమాండ్ చేసే పరిస్థితిలో ఆ పార్టీ లేదుఇప్పటి వరకు ఆ పార్టీ ప్రజాసమస్యలపై ఫీజు పోరుజల దీక్ష,చేనే దీక్షరైతు దీక్ష వంటి పేర్లతో అనేక పోరాటాలు చేసిందినిజంగా ఆ పార్టీకి తెలంగాణపై చిత్తశుద్ధి ఉంతెలంగాణ కోసం ఒక్కరోజైనా దీక్ష లేదుఎందుకంఆ పార్టీ బలం సీమాంధ్రకే పరిమితంఅందులోనూ మొత్తం ప్రాంతం కాదుకొన్ని జిల్లాలు మాత్రమేఅందుకే రాజన్న రాజ్యం కోసం రాజీనామా చేసిన పద్దెనిమిది స్థానాల్లో మూడుస్థానాలను కోల్పోయింది ఆ పార్టీఅందుకే ఆ పార్టీ కూడా కప్పదాటు వైఖరిని అవలంబిస్తే తెలంగాణలో ఆ పార్టీ ఎదురీదాల్సిందే!

టీఆర్‌ఎస్:
తెలంగాణ కోసమే పుట్టిన పార్టీగా ఆ పార్టీ పట్ల గౌరవం ఉన్నా. కేసీఆర్ చెప్పినట్టు 10అసెంబ్లీ1పార్లమెంటు స్థానాలు దక్కించుకోవడం అంత సులభంకాదుఎందుకంరేపు జరగబోయే చతుర్ముఖ పోటీలో నెగ్గాలంప్రజలు టీఆర్‌ఎస్‌కే ఎందుకు ఓయ్యాలో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలితెలంగాణకు శత్రువులెవరోమిత్రులెవరు ప్రజలకు తెలిసినా స్థానిక నాయకత్వాలు పటిష్టంగా ఉన్నప్పుడే కేసీఆర్ అంచనాలు కరెక్ట్ అవుతాయిక్షేత్రస్థాయిలో ఆ పార్టీకి బలమైన పునాది లేదన్నది ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారుఉద్యమమే వారి బలం అంటున్నా..దాన్ని ఓట్లు మలుచుకోవడానికి మరింత కృషి చేయాలిఎలాగూ ఒంటరిగానే పోటీ చేస్తాము అన్నారు కనుక ఎన్నికల ఆరునెలల మందుగానే అభ్యర్థులను ప్రకటించాలిగ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసే విధంగా పల్లె బాటను ఉయోగించుకోవాలిఅప్పుడు నిజంగానే  ఆ పార్టీ అంచనాలకు దగ్గరగా వెళ్లే అవకాశం ఉన్నది.
రాజు

Labels: , , ,

Monday 5 November 2012

రాంలీల మైదానంలో వాల్ మార్ట్ రాగం

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భావి ప్రధానిగా భావిస్తున్న రాహుల్‌గాంధీకి ఈ దేశ సమస్యలపై పూర్తి అవగాహన లేదని అనేక సందర్భాల్లో వెల్లడైంది. రాంలీల మైదానంలో కాంగ్రెస్ పార్టీ బలనిరూపణ కోసం ఏర్పాటు చేసిన బహిరంగసభలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలను సమర్థించడానికి ఏర్పాటు చేశారు. మన్మోహన్ సర్కార్ తీసుకుంటున్న సంస్కరణలు మరింత వేగవంతం చేయడానికి వేదిక చేసుకున్నారు. అలాగే పరోక్షంగా ముందస్తు ఎన్నికల కోసం కార్యకర్తలను సమాయత్తం చేశారు. చిల్లర వర్తకంలోకి విదేశీపెట్టుబడులను ఆహ్వానిస్తూ మన్మోహన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని ముక్తకంఠంతో అందరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మన్మోహన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు సరైనవే అని ఆయనకు అభయహస్తం అందించడానికి సోనియా, రాహుల్ గాంధీలు ముందుకొచ్చారు.  ఎఫ్‌డీఐలను వ్యతిరేకిస్తున్న ప్రధాన ప్రతిపక్షాన్ని విమర్శించడానికి రాహుల్ గాంధీ మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టారు. కార్గిల్ యుద్ధ సమయంలో అప్పుడు మేం ప్రతిపక్షంలో ఉన్నాము. అయినా జాతి ప్రయోజనాల దృష్ట్యా మేము ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలిపామన్నారు. పక్క దేశం దురక్రమణకు పాల్పడితే మన దేశ సైనికలు  సాహసోపేత పోరాటంతో దాన్ని ప్రటిఘటించారు. ఆ సమయంలో యావత్ భారత దేశం  కేంద్ర సైనిక సర్కార్ తీసుకున్న సైనిక చర్యకు సంఘీభావం తెలిపింది. దానికి ఎప్‌డీఐలకు ముడిపెట్టడం అంటే కాంగ్రెస్ పార్టీ నిజాయితీ ఏమిటో ప్రజకలు అర్థమయ్యే ఉంటుంది. ఆ సమయంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్ దీనిపై చర్చిండానికి నాటి భారత ప్రధాని వాజపేయిని ఆహ్వానిస్తే తిరస్కరించారు. కానీ ఇప్పటి ప్రధాని మన్మోహన్ మాత్రం దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టే విధంగా అమెరికాతో అణు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ చర్యను నిరసిస్తూ వామపక్షాలు యూపీఏ-1 ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తే, వారిని అభివృద్ధి నిరోధకులుగా ప్రచారం చేశారు. ఈ దేశ ప్రజలు ఎన్ని పాట్లు పడ్డా అమెరికా అభిమానాన్ని పొందడానికి మన్మోహన్ ఎంతటికైనా సిద్ధపడతాడు అనడానికి ఈ ఉదాహరణ చాలు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం తమది అని చెప్పుకుంటున్న వీళ్లు తమ కాళ్లమీద తాము బతికే అభాగ్యుల పొట్టకొట్టి పెద్దలకు పంచేందుకు వాల్‌మార్ట్‌లకు వెల్‌కమ్ చెబుతున్నారు. అలాగే త్వరలో ఆహార భద్రత బిల్లు తెస్తామని కూడా రాంలీల మైదాన్‌లో ఘనంగా ప్రకటించారు. అయితే కొన్ని విషయాలు ప్రజాప్రతినిధులు మరిచిపోయినంత తొందరగా ప్రజలు మరిచిపోరు. ఆ మధ్య సుప్రీంకోర్టు గిడ్డంగుల్లో మూలుగుతున్న బియ్యాన్ని పేదలకు పంచాలని ఆదేశించింది. కానీ మన మన్మోహన్ గారు దానికి ఒప్పుకోలేదు. పైగా కోర్టు తీర్పును తప్పుపట్టారు కూడా. ఇలా చెప్పుకుంటూ పోతే యూపీఏ1, యూపీఏ2 ప్రభుత్వాలు ప్రజలకు మిగిలింది కష్టాలు, ప్రజాప్రతినిధులు కుంభకోణాల్లో కూరుకుపోతున్నారు.

అలాగే తమపై అవినీతి బురదచల్లేవారే కుంభకోణాల్లో ఇరుక్కున్నారు. అవినీతి నిర్మూలనలో కాంగ్రెస్ పార్టీకి ఎవరూ సాటిరారని సోనియా, రాహుల్‌లు అన్నారు. నిజమే. అవినీతికి ఏ పార్టీ అతీతం కాదు. అందుకే ప్రజలు ప్రత్యామ్నాయ వేదికలకు మద్దతు పలుకుతున్నారు. అది అన్నాహజారే, కేజ్రీవాల్ ఎవరైనా కావొచ్చు. ప్రజలు అవినీతిని అంగీకరించడం లేదు. దానికి అడ్డుకట్టవేయాల్సిందేనని నినదిస్తున్నారు. అందులో ఏ పార్టీకి, ఏ ప్రజాప్రతినిధికి మినహాయింపు లేదు. చేసే పనిని మాత్రం చిత్తశుద్ధితో చేయాలి అంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా తామే పోరాడుతున్నట్టు సమాచార హక్కుచట్టం గురించి, లోక్‌పాల్ బిల్లు గురించి గొప్పలు చెప్పుకుంటున్నది. లోక్‌పాల్ బిల్లు రాజ్యసభలో పాస్ చేయడానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తే ప్రధాన ప్రతిపక్షం అడ్డుకున్నది అంటోంది. కాంగ్రెస్ పార్టీ తేవాలనుకున్న లోక్‌పాల్ బిల్లుతో అవినీతి అంతం కాకపోగా, అది మరింత పెరిగే అవకాశముందనే ఆరోపణలు వచ్చాయి. ఇక సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వ విధానాలు. కానీ ఆ హక్కు చట్టం లక్ష్యాలు ఇంకా నెరవేరడం లేదు. ప్రజల్లో దీనిపై ఇంకా చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది.

మార్పు కాంగ్రెస్‌తోనే సాధ్యమని చెప్పిన రాహుల్‌గాంధీ మన్మోహన్ మనసును మార్చలేకపోతున్నారు. అందుకే మన్మోహన్ అండ్ కోల విధానాలకు వంత పాడుతున్నారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుల అభిప్రాయం ప్రకారం ఈ దేశంలో పేదలు అధికారిక లెక్కల్లో కనిపించరు. కానీ వీళ్లు మాత్రం అధికారం కోసం ఇంకా ఆమ్ ఆద్మీ ప్రవచనాన్ని మాత్రం వదలడం లేదు. అందుకే ఇప్పటికీ భారత దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే పరిగణింపబడుతున్నది. అది అభివృద్ధిలో కాదు.. అవినీతిలో, కుంభకోణాల్లో, ప్రజా వ్యతిరేక విధానాల్లో.. సో... భద్రతలేని జీవుల్లారా బహుపరాక్!
-రాజు

Labels:

Thursday 1 November 2012

నిర్బంధం నీడలో ....

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం పేరుతో కిరన్ సర్కార్ చేసిన చర్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. నిర్బంధం నీడలో అవతరణ దినోత్సవ వేడుకలు జరుపుకునే దుస్థితి దాపురించింది. ప్రభుత్వం  చేసిసిన ఆర్భాటంలో ప్రజలు లేరు, ప్రజాప్రతినిధులు లేరు. పోలీసులతోనే కార్యక్రమాన్ని పూర్తిచేశారు. ఇక తెలంగాణ ప్రాంతమంత్రా విద్రోహ దినాన్ని పాటించింది. ప్రభుత్వ కార్యాలయాలపై నల్లజెండాలతో ప్రజలు తమ నిరసనను వ్యక్తం చేశారు. తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరాంను హౌస్ అరెస్టు , చాలామంది ఉద్యమకారులను అరెస్ట్‌చేసి ప్రభుత్వం తన దమననీతిని మరోసారి చాటింది. ఇందిరాపార్క్ వద్ద రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిరసిస్తూ తమ నిరసనను తెలియజేస్తామని జేఏసీ ముందే ప్రకటించింది. కానీ ప్రభుత్వం జేఏసీని అడ్డుకునే పేరుతో ఇందిరాపార్క్ ప్రాంతాన్ని పోలీసుల చేతిలో పెట్టింది. దీంతో ప్రజలు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి నెలకొన్నది. లేని సమైక్య భావనను తలకెత్తుకున్న రాష్ట్ర సర్కార్‌కు అవతరణ వేడుకలు అసంతృప్తినే మిగిలిచ్చాయని చెప్పవచ్చు.

ఒప్పందాలతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ను రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది త్యాగాల వల్ల ఏర్పడిందనే దుష్ప్రచారాన్ని  మొదలుపెట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనతో తెలిసిపోతుంది. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ ప్రకటనలో తెలుగుతల్లితో పాటు పొట్టిశ్రీరాములు బొమ్మను ముద్రించింది. అసలు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు సంబంధంలేని వ్యక్తిని ఈ వివాదంలోకి లాగా ఆయన ఆంధ్ర ప్రజల కోసం చేసిన త్యాగాన్ని అగౌరవపరిచింది. శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ దీక్ష చేసిన విషయం విదితమే. ఆయన ప్రాణ త్యాగం ఫలితంగానే మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబర్ 1న ఏర్పాటైంది. పెద్దమనుషుల ఒప్పందంలో ఆంధ్రప్రదేశ్ 1956 నవంబర్ 1న ఆవిర్భవించింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందే చనిపోయిన వ్యక్తిని తమ స్వార్థం కోసం సీమాంధ్ర నేతలు వాడుకుంటున్నారు. దీనికి శ్రీరాములు ఆత్మ ఎంత క్షోభిస్తున్నదో. గాంధీ వారసులమని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఆయన ఆశయాలకు తిలదోకాలు ఇచ్చింది. శ్రీరాములు పేరు చెప్పుకుంటూ కొంతమంది సీమాంధ్ర పెట్టుబడిదారులు ఆయన ఆకాంక్షను అమ్ముకుంటున్నారు. మంత్రి టీజీ వెంకటేశ్ లాంటి వాళ్లయితే తన స్థాయిని మరిచి  అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు. రాష్ట్ర అవతరణ వేడుకలను బహిష్కరించిన వారిని రాష్ట్రం నుంచి బహిష్కరించాలంటున్నారు. దానికి సమాధానం కావాలంటే తన సహచర తెలంగాణ మంత్రులను అడిగితే బాగుంటుంది. అయినా తెలంగాణ ప్రజలు సీమాంధ్ర ప్రభుత్వాన్ని 2009 డిసెంబర్ 9వ తేదీనే బహిష్కరించారు.ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఉల్లంఘనలు చూసే ఈ ప్రాంత ప్రజలు ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకలను బహిష్కరించారు. ఇప్పుడు టీజీ కానీ సీమాంధ్ర నాయకులు కానీ కొత్తగా బహిష్కరించడానికి ఏమీ లేదు. భౌగోళిక విభజనకు సహకరించడం తప్ప.

ఎవరికి ఎవరు ప్రత్యామ్నాయం?

రాష్ట్రంలో ఇప్పుడు రెండు పార్టీల్లోకి వలసలు మొదలయ్యాయి. దీనిపై ఎవరి విశ్లేషణలు వారివే. ఈ రెండు పార్టీల బలాబలాలను ఆ మధ్య రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను బట్టి చర్చలను బట్టి సీమాంధ్రలో వైఎస్‌ఆర్‌సీపీ, తెలంగాణలో టీఆర్‌ఎస్ ముందజలో ఉన్నాయని వివిధ సర్వేలు కూడా తేల్చాయి. అది అప్పటి మాట.  టీఆర్‌ఎస్ అధినేత ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠాన పెద్దలతో చర్చలు, తెలంగాణపై కాంగ్రెస్ నేతలు భిన్నస్వరాల తర్వాత మళ్లీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. దీనికి ఈ చర్చలే కారణమని కాదు, చంద్రబాబు, షర్మిల పాదయాత్రలు ఒక కారణమైతే.. కేంద్రంలో మధ్యంతర ఎన్నికలు రావచ్చుననే సంకేతాలు మరోకారణం. అయితే ఇప్పుడు జరుగుతున్న చర్చ కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. తెలంగాణలో వైఎస్‌ఆర్‌సీపీ బలం పుంజుకుంటున్నదని మీడియాలో చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి. అయితే తెలంగాణ ప్రజల మనోభావాలను తాము గుర్తిస్తున్నామని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమ పార్టీ జాతీయ పార్టీ అవుతుందని ఆ పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. మరి అలాంటిది ఇప్పుడు తెలంగాణ పుంజుకుంటున్నది అంటే ఒక సీమాంధ్ర ప్రాంతానికి పరిమితమైన పార్టీ జాతీయ పార్టీ ఎలా అవుతుందో అర్థం కాదు. మరో విషయం ఏమంటే తెలంగాణ ప్రాంతంలో ఆ పార్టీ చేరుతున్నవారిలో మెజారిటీ వర్గం జగన్ సామాజిక వర్గానికే చెందిన వారు కావడం గమనార్హం. అలాగే అందులో చాలామంది వైఎస్ బతికి ఉన్నప్పుడు ఆయన అనుంగులుగా ఉన్నవారు కొందరతై మరికొంత మంది ఆయనటో అంటకాగిన వారే. కనుక ఇప్పుడు వాళ్లు వైఎస్‌ఆర్‌సీపీలో చేరితే టీఆర్‌ఎస్‌కు ఏదో ఇబ్బంది వస్తుందనే వార్తల్లో వాస్తవం లేదు.


అట్లాగే తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు వైఎస్‌ఆర్‌సీపీలో చేరుతున్నవారిని చూపిస్తూ టీఆర్‌ఎస్‌లో కలవరం మొదలైందని అంటున్నారు. ఇంకా సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎన్నడూ సత్తా చూపలేదంటున్నారు. ఆ పార్టీ బలం ఉప ఎన్నికలకే పరిమితమంటున్నారు. కానీ ఆ పరిస్థితి 2009 డిసెంబర్ 9 తర్వాత మారిందనే చెప్పాలి. ఎందుకంటే అప్పటి వరకు ఎవరు తెలంగాణ అన్నా నెత్తిన పెట్టుకున్నారు. అంతెందుకు 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశలు వదులుకున్న చోట టీఆర్‌ఎస్ తన జెండా ఎగురవేసింది. వైఎస్ పెట్టిన ప్రలోభాలకు లొంగి పార్టీని వదిలినవారు వారు ఇప్పుడు ఉద్యమంపై విషం చిమ్ముతున్నారు. ఇప్పుడు మాత్రం తెలంగాణవాదులెవరో వలసవాదులకు అంటకాగుతున్నదెవరో ఒక స్పష్టమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. అలాగే ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో చేరుతున్న నాయకులు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్నవారు కొంతమంది అయితే మరికొందరు మూడేళ్లుగా ఉద్యమంలో భాగస్వామ్యమవుతున్నవారే. కాబట్టి ఏదో మాట వరుసకు మేము తెలంగాణ బిడ్డలమే అంటే అర్థం చేసుకులేనంత అమాయకులు కాదు ఈ ప్రాంత ప్రజలు. కాకపోతే టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఏ వేదిక ఏర్పడినా, ఏ పార్టీ పుట్టుకొచ్చినా దాన్ని ఆకాశానికి ఎత్తడం కొన్ని మీడియా సంస్థలకు అలవాటైంది. దీనికి కారణం ఒక పార్టీ, ఒక వ్యక్తిపై ఉన్న వ్యతిరేకతను బహిరంగంగా చూపెట్టలేక పరోక్షంగా అలాంటి వేదికలు అవకాశం కల్పించడం. అందుకే ఇప్పటి వరకు తెలంగాణ ఎన్ని పార్టీలు వచ్చినా టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాలేకపోయాయి. కారణం సుదీర్ఘ ప్రక్రియతో కూడుకున్న ఈ లక్ష్య సాధన కోసం ఎదురుచూసే ఓపిక వాళ్లకు లేకపోవడమే. అవకాశవాదం కోసం అన్ని వదులుకొని ఇప్పుడు అధికార పదవులు అనుభవిస్తున్న వారిని మనం చూస్తూనే ఉన్నాము.

అయితే కొత్త పార్టీ వచ్చినప్పుడు అందులోకి వెళ్లడం కొత్త కాదు. ప్రజాప్రతినిధులు ప్రజల గురించి ఆలోచించే స్థితిలో లేకున్నా తమ పదవుల కోసం మాత్రం అనుక్షణం తపిస్తూనే ఉంటారు. తీరా ఎన్నికల సమమంలో జంప్ జిలానీ అయితే రెంటికి చెడ్డ రేవడి అవుతామేమోనన్న మీమాంస వారిని వెంటాడుతుంది. అందుకే తమ బెర్తులను ఖాయం చేసుకోవడానికి ప్రజాప్రతిధులు ఇలాంటి ప్రయోగాలు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. ఇక వైఎస్‌ఆర్‌సీపీ బలమెంతోఇప్పుడే చెప్పలేము కానీ కడప పార్లమెంటు, పులివెందుల, కోవూరు అసెంబ్లీ ఎన్నికల్లో చూపిన ఊపు ఆ తర్వాత ఉప ఎన్నికల్లో కనిపించలేదు. ఎందుకంటే జగన్ కోసం రాజీనామా చేసిన రెండుస్థానాల్లో ఆ పార్టీ చతికిలపడింది. దీన్ని ఆ పార్టీ వాళ్లు అవి మా సీట్లు కావు కదా అని సమర్థించుకున్నా దాని ప్రభావం ఆ పార్టీపై ఉన్నది. అలాగే తెలంగాణ ప్రాంతంలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడే ఈ ప్రాంతంలో ఎవరిది పై చేయి అవుతుందో సర్వేలకు అందని సస్పెన్స్ అది. కానీ సీమాంధ్ర ప్రాంతంలో కుల ప్రాతిపదిక రాజకీయాలు జరుగుతాయన్నది జగమెరిగిన సత్యం. కనుక గంపగుత్తగా వైఎస్‌ఆర్‌సీపీకే అత్యధిక సీట్లు వస్తాయని చెప్పలేము. ఎందుకంటే అక్కడ త్రిముఖ పోటీ ఉంటుంది. వాటిలో టీడీపీ, కాంగ్రెస్‌లకు ఎంతోకొంత ఓటు బ్యాంకు ఉంటుంది. అలాగే ఇరు పార్టీల్లోనూ ఎంతో కొంత వ్యక్తిగత బలమున్న నేతలే ఎక్కువగా ఉన్నారు. ఈ త్రిముఖ పోటీలో ఆ సైకిల్, చేతి వాటాన్ని తట్టుకొని ఫ్యాన్ గాలి వీస్తుందని అక్టోపస్‌లా భవిష్యత్తు చెప్పడానికి ఆంధ్ర రాజకీయాలు అంతుచిక్కవు. కనుక అక్కడ ఎవరికి ఎవరు తక్కువేమీ కాదు. కాకపోతే ఏ పార్టీ మెజారిటీ సీట్లు దక్కించుకుంటుందనే దానిపైనే అంతా ఆసక్తి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అసలు రాజకీయం ఆంధ్రలోనే ఉండబోతున్నది. తెలంగాణపై తేల్చేదాకా ఇక్కడ ఉద్యమపార్టీదే ఉన్నతస్థానం.
-రాజు

Labels: , , ,

Wednesday 31 October 2012

బాటలు-బీటలు

చంద్రబాబు ఒకవైపు ‘వస్తున్నా మీ కోసం’ అంటూ కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపుతుంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం వెళ్తున్నాం జగన్ కోసం అంటూ బాబుకు నిస్తేజాన్ని నింపుతున్నారు. ముప్ఫై ఏళ్ల తెలుగుదేశం పార్టీని ఈ మూడేళ్లలో అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. హైటెక్ ముఖ్యమంత్రిగా అంతర్జాతీయ ప్రశంసలు పొంది ఆంధ్రప్రదేశ్‌లో అధికారాన్ని కోల్పోయిన బాబును తాజా పరిణామాలు కలవరపెడుతున్నాయి. ఎందుకంటే రాష్ట్రానికి ఇప్పుడు సమర్థవంతమైన నాయకుడు కావాలి, అది చంద్రబాబే అని ఆ పార్టీ ప్రచారం చేస్తుంటే.. ఆ పార్టీ అసమ్మతి నేతలు మాత్రం బాబు నాయకత్వ వైఫల్యం వల్లే తాము పార్టీని వీడుతున్నామంటున్నారు.

2009 సార్వత్రిక ఎన్నికల్లో మహాకూటమి పేరుతో టీడీపీ 92 స్థానాల్లో గెలిచింది. ఇప్పుడు ఆ సంఖ్య 7 కి చేరింది. ఇందులో పన్నెండు మంది ఆ పార్టీకి దూరం కాగా మరో ఇద్దరు అదే బాటలో ఉన్నారు. వీళ్లే కాదు మునుముందు మరికొంత మంది పార్టీని వీడుతారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. నిజానికి అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత ప్రధానప్రతిపక్షానికి లాభించాలి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇందుకు విరుద్ధంగా జరుగుతున్నది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీని కలవరపెడుతున్నా పైకి మాత్రం ఆ పార్టీ నేతలు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతున్నది. రోశయ్య తర్వాత అంధకారంలో ఉన్న రాష్ట్ర కాంగ్రెస్‌కు వెలుగు ‘కిరణం’ అవుతాడునుకున్న ముఖ్యమంత్రి ఒంటెద్దు పోకడల వల్లే ఆ పార్టీ కూడా నానాటికీ బలహీనపడుతున్నదని ఆ పార్టీ నేతల బహిరంగంగా విమర్శిస్తున్నారు. చిత్తూరు బాబులిద్దరు జనంలో ఉంటే వారి పార్టీ ఎమ్మెల్యేలు జగన్ వెంట నడుస్తామంటున్నారు.

అధికార పార్టీ పరిస్థితికి వారి అధిష్ఠానం చేస్తున్న తప్పిదాల స్వయంకృతపరాధం ఒక కారణమైతే ఆ పార్టీలో అంతర్గత ఆధిపత్యపోరు మరో కారణం. కానీ చంద్రబాబు పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధం. టీడీపీలో ఆయనే కర్త, కర్మ, క్రియ. కానీ బాబు నాయకత్వంపై నీలినీడలు ఎందుకు కమ్ముకుంటున్నాయి? బాబు పాదయాత్ర సక్సెస్ అని ఒకవైపు ప్రకటిస్తూనే..మరోవైపు పార్టీతో విభేదిస్తున్న ఎమ్మెల్యేపై సస్పెన్షన్లు కొనసాగుతున్నాయి. ఈ ముంచుకొస్తున్న ముప్పును చంద్రబాబు ఎలా అధిగమిస్తారు అనే ప్రశ్నకు ప్రస్తుతం సమాధానం దొరకడం కొంచెం కష్టమే. ఎందుకంటే పార్టీని వీడుతున్న ఎమ్మెల్యే చంద్రబాబుపై దుమ్మెత్తిపోస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో బాబు పాదయాత్ర చేస్తూ తాను తెలంగాణకు వ్యతిరేకం కాదు అని గొంతెత్తి అరుస్తుంటే ఆ పార్టీని వీడుతున్న సీమాంధ్ర ఎమ్మెల్యేలు మాత్రం సమైక్య ఉద్యమానికి ఊతమిచ్చింది బాబేనని మీడియా ముందు వెల్లడిస్తున్నారు. అయితే ఈ విమర్శలను టీడీపీ నేతలు సూటికేసులకు అమ్ముడుపోయి బాబుపై నిందలు వేస్తున్నారన్నా వారి వ్యాఖ్యల ప్రభావం ఆ పార్టీపై తప్పకపడుతుంది. ఎందుకంటే టీఆర్‌ఎస్ పార్టీ,  నాగం జనార్ధన్‌రెడ్డి వంటి నేతలు ఇప్పటికే సమైక్య ఉద్యమాన్ని నడిపించింది బాబేనని చాలా కాలంగా ఆయనను కార్నర్ చేస్తున్నారు. దాని ఫలితమే తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఒకటి రెండు చోట్ల మాత్రం డిపాజిట్ దక్కించుకోగలిగింది. ఇప్పుడు తాజా మాజీ టీడీపీ ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలకు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు తెలుగుతమ్ముళ్లు. అందుకే తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి మళ్లీ లేఖ రాసినా ఈ ప్రాంత ప్రజలు విశ్వసించడం లేదు. కానీ బాబు లేఖను బూచిగా చూపిస్తు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు పార్టీని వీడుతున్నారు. నారా నందమూరి కుటుంబాల మధ్య జరుగుతున్న కోల్డ్‌వార్ బాబు పాదయాత్రతో సద్దుమణుగుతుందని అంతా భావిస్తున్న ఈ సమయంలో ఆ పార్టీలో కొత్త సంక్షోభాలు ముందుకొస్తున్నాయి. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే మునుముందు ఎలా ఉంటుందో చెప్పలేం.

ముఖ్యంగా తెలంగాణ ప్రాంత ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎలా చూస్తున్నారో ప్రత్యేక రాష్ట్రంపై స్పష్టత ఇవ్వని టీడీపీని అలాగే చూస్తున్నారు. ఇందుకు వైఎస్‌ఆర్‌సీపీ కూడా మినహాయింపు కాదు. ఇచ్చేది మేమే తెచ్చేది మేమే ఒకరు, ఇచ్చే శక్తి గానీ తెచ్చే శక్తి గానీ తమకు లేవని మరొకరు, తెలంగాణపై తేల్చాంది కేంద్రమే అని ఇంకో పార్టీ వీరి వాదనలు ఏవైనా వాస్తవాలను మాత్రం ప్రజలు గ్రహిస్తున్నారు. ఇచ్చేది కేంద్రమే తేల్చాల్సింది రాష్ట నేతలే అని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో గెలవాలని ఆశపడుతున్న అశావహులు కూడా ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. దీంతో రెండు పార్టీల్లో ఆనందం మరో పార్టీలో ఆందోళన మొదలైంది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడాలంటే అన్ని పార్టీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న తెలంగాణపై ఒక అభిప్రాయానికి రావాలి. అప్పుడు అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం అసాధ్యమేమీ కాకపోవచ్చు.
-రాజు

Labels: , , ,

విస్తరణ తెచ్చిన విభిన్న సమస్యలు

కేంద్ర క్యాబినెట్ పునర్‌వ్యవస్థీకరణతో కాంగ్రెస్ కొత్త సంకేతం పంపింది. ముంచుకొస్తున్న ముప్పును తట్టుకునేందుకు ముందస్తు ఎన్నికల ప్రణాళికలను రూపొందించుకున్నది. అందుకే  ఇప్పుడు కేంద్ర క్యాబినేట్ 79 మంది ఉంటే అరవై పైచిలుకు మంత్రివర్గ స్థానాలు అధికార పార్టీ అభ్యర్థులే. అలాగే పది మంది మహిళా మంత్రులు. యువతకు పెద్దపీట వేస్తామన్న హామీని కూడా ఆచరణలో పెట్టినట్టు కనిపిస్తున్నది. ఇలా యువరాజు పట్టాభిషేకానికి రాజమార్గాన్ని సిద్ధం చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. అయితే మంత్రి వర్గంలో చోటు దక్కని అసంతృప్తులు, వాళ్లను బుజ్జగించేందుకు కాంగ్రెస్‌లో పార్టీలో ఉండే సోనియా ఆంతరంగికులు ఉండనే ఉన్నారు. కానీ పెట్రోలియం శాఖ నుంచి జైపాల్‌రెడ్డిని తప్పించి వీరప్పమొయిలీ అప్పగించడం పట్ల అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. రిలయన్స్ అధినేత ముఖేశ్ ఒత్తిడితోనే జైపాల్ శాఖ మారింది అనుకున్నా దీనికి గల కారణాలను కూడా కాంగ్రెస్ చెబుతున్నది. దీన్ని సామాజిక ఉద్యమకారుడు కేజ్రీవాల్ బహిరంగంగానే ప్రభుత్వ తీరును విమర్శస్తున్నారు. అంతేకాదు యూపీఏకు బయటి  నుంచి మద్దతు ఇస్తున్న ఎస్పీ కూడా మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణపై విమర్శలు చేస్తున్నది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఉన్నత పదవులు కట్టబెట్టడాన్ని నిరసిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్నదనే వారి ఆరోపణలు. అలాగే కేంద్ర మానవ వనరుల శాఖ విషయంలో ఇదే రగడ కొనసాగుతున్నది. ఎందుకంటే గతంలో ఆ పదవిని నిర్వహించిన వారు చాలా అనుభవజ్ఞులనేది విశ్లేషకుల భావన. అలాంటిది ఇప్పుడు ఆ పదవిని పల్లంరాజుకు కేటాయించడంపై అధికార పార్టీలో కొందరు అసంతృప్తితో ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే మంత్రివర్గ కూర్పుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్లు స్వచ్ఛందంగానే వైదొలిగి యువత అవకాశాలు కల్పించడానికి పార్టీ కోసం పనిచేస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేస్తున్నది. అయితే దీనిపై కేంద్రంలో ఒక వాదన, రాష్ట్రంలో ఒక వాదన వినిపిస్తుండడం గమనార్హం. రాష్ట్ర రాజకీయాల్లో జైపాల్ తలదూర్చినందుకే ఆయన హోదాకు తగిన శాఖ దక్కలేదు అనేది వాస్తవం కాదు. ఎందుకంటే మన్మోహన్ తాజా క్యాబినేట్ కూర్పు అంతా సంస్కరణలు వేగవంతం చేసేందుకే అన్నది జగమెరిగిన సత్యమే. అందుకే ఆయన శాఖ మార్పు జరిగి ఉండవచ్చు.  కార్పొరేట్ స్వామ్యానికి జై కొడుతూ కామన్‌మ్యాన్‌ను పట్టించుకోని మన్మోహన్  ఇంత కాలం మిత్రపక్షాల ఒత్తిడి పక్కకుపెట్టిన అంశాలన్నీ వచ్చే ఏడాదిన్నర కాలంలో ఆచరణలో పెట్టబోతున్నారు.

అలాగే రాష్ట్రాల వారీగా పార్టీని పటిష్టం చేసే వ్యూహం కూడా ఈ తాజా కూర్పులో కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికలను ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండాలసి సోనియాగాంధీ తన పార్టీ ఎంపీల సమావేశంలో చెప్పినట్టు వార్తలు కూడా వచ్చాయి. అందులోవాస్తవ అవాస్తవాలను పక్కన పెడితే కచ్చితంగా ఇది ఎన్నికల క్యాబినేటే అని స్పష్టమవుతుంది. ఇక విధేయత గురించి కూడా చర్చ జరుగుతున్నది. కానీ ఇదేం కాంగ్రెస్ పార్టీలో కొత్త అంశం కాదు. ఇందిరాగాంధీ హయాం నుంచి కొనసాగుతున్నదే. అది ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే కాదు అన్ని పార్టీల్లోనూ ఎంతోకొంత విధేయతకు పట్టం కట్టడం మనం చూస్తూనే ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీలో అది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎలాగంటే వాళ్ల పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కదా! పార్టీని, ప్రభుతాన్ని ఇబ్బందిపెట్టకుండా అంటే కర్ర విరగకుండా పాము చావకుండా వ్యవహరించేవారిని అందలం ఎక్కించడంలో కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీల కంటే ముందుంటుంది. అలాగే వచ్చే ఏడాది నవంబర్, డిసెంబర్‌లోనే లోక్‌సభ ఎన్నికలు జరగవచ్చునని యువనేత రాహుల్‌గాంధీ తనను కలిసిన ఎంపీలకు చెబుతున్నారనే వార్తలు వస్తున్నాయి. అంతేకాదు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టికెట్లు కేటాయించే బాధ్యతను కూడా ఆయనకే కట్టబెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. అందుకే ఆయన రాష్ట్రాల వారీగా కొంతమంది ఆయన టీమ్‌లో చేర్చుకుంటున్నారు కూడా. వీరికి వారి వారి సొంత రాష్ట్రాలు కాకుండా ఇతర రాష్ట్రాల బాధ్యతలు అప్పగిస్తున్నారట. ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ పనితీరు, ప్రజాప్రతినిధుల పనితీరుపై తనకు నివేదికలు ఇవ్వాలని వారికి ఆదేశిస్తున్నారట.  గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల తర్వాత ముందస్తు ఎన్నికలపై మరింత సమాచారం రావచ్చు. సార్వత్రిక ఎన్నికల కోసం ఒక్క కాంగ్రెస్ పార్టీయే కాదు బీజేపీ కూడా సన్నద్ధం అవుతున్నది. అందుకే పార్టీని విభేదించి బయట ఉన్న అసంతృప్తులను బుజ్జగించే పనిలో ఆ పార్టీ ఉన్నది.

ముఖ్యంగా కర్ణాటక నుంచి యడ్యూరప్ప, రాజస్థాన్ నుంచి వసుంధరాజే, ఉత్తరప్రదేశ్ నుంచి మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్‌సింగ్‌లను సంప్రదించి కలుపుకుపోవాలనుకుంటోంది. లేదు లేదు అంటూనే అధికార, ప్రతిపక్ష పార్టీలు ముందస్తు ఎన్నికల సందడి చేస్తున్నాయి. అయితే బీజేపీ సంగతి ఏమో కానీ కాంగ్రెస్ పార్టీ నవంబర్‌లో ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ చేపట్టబోతున్నట్టు సమాచారం. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఆ పార్టీకి పట్టున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మూడేళ్లుగా రాజకీయ సంక్షోభం నెలకొన్నది. ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్‌రెడ్డి రెండేళ్ల పాలనలో ఆ పార్టీ పరిస్థితి దిగజారిందనేది విశ్లేషకుల వాదన. పార్టీలో ప్రక్షాళన జరగకపోతే గతంతో సాధించిన 33 పార్లమెంటు స్థానాల సంగతి ఏమో కానీ 13 స్థానాలు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆ పార్టీకే చెందినవారు విమర్శిస్తున్నారు. అందుకే  ముఖ్యమంత్రిని, పీసీసీ అధ్యక్షుడిని సంప్రదించకుండానే మంత్రివర్గ విస్తరణలో రాష్ట్రానికి పెద్దపీట వేశారు అన్నది స్పష్టమే. అట్లాగే చంద్రబాబు జపిస్తున్న బీసీ మంత్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఆచరణలో చూపెట్టినట్టుంది. సీమాంధ్రలో ఒక సామాజిక వర్గం జగన్ వెంట వెళతారు అన్న ప్రచారం నేపథ్యంలో కాపులను ప్రసన్నం చేసుకోవడానికే పల్లంరాజు, చిరంజీవి లాంటి వారికి పెద్దపీట వేశారు అన్న చర్చ సాగుతున్నది. ఇందులో కొంత వాస్తవం కూడా ఉండవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో మొన్న జరిగిన 1 అసెంబ్లీ స్థానాల్లో రెండు స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. ఆ అభ్యర్థులు కూడా కాపు సామాజిక వర్గం నేతలే కావడం గమనార్హం. అందుకే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు చంద్రబాబు బీసీ మంత్రాన్ని, వైఎస్‌ఆర్‌సీపీ ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ ఈ వ్యూహాన్ని అనుసరించింది. అంతేకాదు రాష్ట్రానికి గతంలో ఎన్నడూ లేనివిధంగా పది  మంత్రిపదవులు కట్టబెట్టింది. వీరి ద్వారా వలసలకు చెక్ పెట్టాలని భావించింది. కానీ మంత్రివర్గ విస్తరణ తర్వాతే అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. ఇంకొంత మంది అదే బాటలో ఉన్నట్టు సమాచారం. అయితే రాజకీయ పార్టీలో వలసలు అనేవి సహజమే. కానీ రాష్ట్రంలో అతిపెద్ద సమస్య అయిన తెలంగాణ అంశాన్ని పరిష్కరించకుండా ఇంకా నాన్చివేత ధోరణిని అవలంబిస్తే ఈ ప్రాంతంలోనూ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవడం ఖాయం. కాంగ్రెస్ పార్టీ రోగమొకటి అయితే చికిత్స మరొకటి చేస్తున్నది. ఇలా ఎంత కాలం నెట్టుకొస్తుందో హస్తిన పెద్దలకే అర్థం కావాలి.
-రాజు

Labels: , ,

Tuesday 23 October 2012

అనుకూలమనకుండా అఖిలపక్షం అంటే ఎట్లా?

ప్రజాస్వామ్యంలో ప్రజలకు నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణ ప్రజలకు నిరసన తెలిపే హక్కును నిరాకరిస్తున్నది. మొన్న ప్రధాన పర్యటన సందర్భంగా, నేడు చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా తెలంగాణవాదులను నిర్బంధించి, వారి గొంతు నొక్కాలని యత్నిస్తున్నది. తెలంగాణపై బాబు మరోసారి లేఖ రాశారని తెలంగాణ తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. కానీ బాబు లేఖలో స్పష్టత లేదని ఈ ప్రాంత నేతలే కాదు సీమాంధ్ర టీడీపీ నేతలు కూడా చెప్పిన విషయాన్ని గుర్తించుకోవాలి. బాబుకు ఈ ప్రాంతంలో పర్యటించే హక్కు ఎలా ఉందో ఆయనను నిలదీసే హక్కు కూడా తెలంగాణ వాదులకు ఉంటుంది. అధికార పార్టీ అండతో తెలంగాణపై దండయాత్ర చేస్తున్న సీమాంధ్ర నేతలను స్వాగతిస్తున్న ఈ ప్రాంత టీడీపీ ప్రజాప్రతినిధులకు ఆత్మాభిమానం లేదా? తెలంగాణపై స్పష్టమైన నిర్ణయం చెప్పమంటే అఖిలపక్షం అని తప్పించుకుంటున్న బాబుకు మీరు వంత పాడడం ఏమిటి? అంటే మీరు ఆ ప్రాంత ప్రజల ఆకాంక్ష కోసం పనిచేస్తున్నారా? లేక చంద్రబాబు ప్రాపకం కోసం పరితపిస్తున్నారా తెలియజేయాలి. అయినా జేఏసీ నేతలు ఎక్కడా చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని చెప్పలేదు. తెలంగాణపై బాబు వైఖరికి నిరసనగా తమ నిరసనను తెలిజేస్తామన్నారు. అంది కూడా నేరమేనా?

సీమాంధ్ర నేతల పర్యటన అనగానే ప్రభుత్వం వారికి భారీ బందోబస్తును ఏర్పాటు చేసి తెలంగాణ వాదులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి, నిర్బంధించి ఈ ప్రాంతాన్ని ఒక మిలటరీ క్యాంపుగా మార్చే ప్రయత్నం చేస్తున్నది. ప్రశ్నించడమే అదో మహా పాపం అన్నట్టు కిరణ్ సర్కార్ వ్యవహరిస్తున్నది. అయితే వలసపాలకుల కుటిల నీతి తెలియంది కాదు. దానికి ఈ ప్రాంత కాంగ్రెస్, టీడీపీ నేతలు వంతపాడడమే విషాదం. బాబు పాదయాత్ర ఉద్దేశ్యం ఏమిటి? ప్రజల కష్టాలను తెలుసుకొని వారి అండగా ఉంటామనే భరోసా ఇవ్వడానికి ‘వస్తున్నా మీ కోసం’ అంటూ బయలు దేరారు. మరి ఈ ప్రాంత ప్రజానీకాన్ని నిర్బంధించి, వారి వాక్ స్వాతంత్య్రాన్ని అడ్డుకుంటుంటే ఇక బాబు ఎవరి బాధలు వింటారు. బాబు బాగోతాలు ఈ ప్రాంత టీడీపీ నేతలకు అర్థం కాకపోవచ్చు. కానీ ఈ ప్రాంత ప్రజలకు మాత్రం అది ఎప్పుడో అర్థమైంది. అందుకే బాబు ఇప్పటికి ఎన్నిసార్లు నేను తెలంగాణకు వ్యతిరేకం కాదని మొత్తుకుంటున్నా ఆయనను విశ్వసించడం లేదు. ఒక ప్రధాన ప్రతిపక్షంగా తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తే ఇవ్వాళ నాలుగున్న కోట్ల ప్రజానీకం ఇలా రోడ్లపైకి వచ్చేవారు కాదు. స్వరాష్ట్రం కోసం ఇన్ని ఆత్మబలిదానాలు జరిగి ఉండేవికావు. వారి తల్లులకు కడుపుకోతలు మిగిలేవి కావు.

తెలంగాణ ప్రాంత టీడీపీ మాట్లాడితే తెలంగాణకోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధమని ఉరితాళ్లను పట్టుకుని తిరిగారు. మీరు ఎలాగూ చంద్రబాబును తెలంగాణపై నిలదీయలేరు. కనీసం ప్రజలనైనా అ పని చేయనివ్వరా? మొన్నటి దాకా జేఏసీకి మేమున్నాం అని పలికిన టీ టీడీపీ నేతలు ఇప్పుడు ఆ జేఏసీపైనే విమర్శలకు దిగడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనం. అంటే వారి అవసరానికి అనుగుణంగా మాటమార్చడం చంద్రబాబు నుంచి నేర్చుకున్నారు. ఇక చంద్రబాబు మహబూబ్‌నగర్‌లో పాత పాటే పాడారు. తాము తెలంగాణకు వ్యతిరేకం కాదంటారు. (వ్యతిరేకం కాదంటే అనుకూలం కాదు). ఈ విషయాన్ని ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పామని అన్నారు. మరి డిసెంబర్ 10 ప్రెస్‌మీట్ పెట్టి రాష్ట్రాన్ని విభజించడానికి తమిళనాడుకు చెందిన చిదంబరం, కర్ణాటకు చెందిన వీరప్ప మొయిలీ ఎవరు ఎందుకు ప్రశ్నించారు. సీమాంధ్రలో తెలంగాణకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాన్ని ఎందుకు అడ్డుకోలేదు? మొదటి రాజీనామాల అస్త్రాన్ని సంధించిన టీడీపీ నేతలను ఎందుకు వారించలేదు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా రెండు కండ్ల సిద్ధాంతాన్ని ఎందుకు ముందుకు తెచ్చారు. తమరు రెండు కండ్లు అంటే, కాంగ్రెస్ వారు ఏకాభిప్రాయం అంటారు. మరొక పార్టీ ఇచ్చే శక్తి తెచ్చే శక్తి తమకు లేదంటుంది. ఇవి చాలవా తెలంగాణపై మీ వైఖరి ఏమిటో తెలియజేయడానికి. అట్లాగే ఇవ్వాల్సిన కాంగ్రెస్‌ను నిలదీయకుండా మమ్మల్ని నిందించడం ఏమిటని బాబు ప్రశ్నించారు. నిజమే. కేంద్ర చెబుతున్న మాటేమిటో బాబు అండ్ కో కు తెలియదా? రాష్ట్రంలో ఏకాభిప్రాయం లేనిదే తాము తెలంగాణపై ఏమీ చేయలేమని చెప్పిన విషయాన్ని మరిచిపోతున్నారు. మీరు నిజంగా తెలంగాణపై స్పష్టంగా ఉంటే ఈ అంశంపై ఎవరు నాటకం ఆడుతున్నారో ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో తెలుస్తుంది. అలాగే తెలంగాణపై మీరు రెండోసారి లేఖ రాసిన తర్వాత సీమాంధ్ర ప్రజాప్రతినిధుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. పాదయాత్ర సమయంలో సమైక్యాంధ్ర జేఏసీ మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ అది టీ కప్పులో తుపానే. అయితే తెలంగాణ ప్రాంతంలోకి మీరు అడుగుపెడతారనగానే ఎందుకు ఇంత రచ్చ జరిగింది. టీడీపీ వైఖరి స్పష్టంగా ఉంటే రాజోలి రగడ ఎందుకు జరిగింది. పాలకుర్తిలో ప్రజల నుంచి నిరసన ఎందుకు ఎదురైందో సదరు టీడీపీ నేతలు సమాధానం చెప్పాలి. అట్లనే చంద్రబాబు అఖిలపక్షం అనేకంటే తెలంగాణకు అనుకూలం అంటే వారికి జరిగే నష్టమేమిటో? నిజంగా టీడీపీ ఈ పనిచేస్తే కాంగ్రెస్‌తో కేసీఆర్ కుమ్మక్కయ్యారో, లేక చంద్రబాబు కాంగ్రెస్‌తో చేసుకున్న చీకటి ఒప్పందం ఆరోపణలు ఏమిటో అందరికి అర్థమవుతాయి.

Labels: , , ,

Saturday 20 October 2012

అన్నింటికి అతనే



గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు ఉంది లగడపాటి రాజగోపాల్ వైఖరి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. డెంగీ మరణాలు, విద్యుత్ కోతలు, చేనేత సమస్యలు, ఇలా ఒక్కటేమిటి సకల జనుల సమస్యలన్నీ సచివాలయంలో పేరుకుపోయాయి. వీటి పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని ఈ లగడపాటి ఏనాడూ లేఖ రాయలేదు. రాయడు కూడా. కానీ తెలంగాణ అన్నా, తెలంగాణ ఉద్యమకారులన్నా ఆయనకు చిర్రెత్తుకొస్తుంది. సీమాంధ్ర మీడియా కూడా తెలంగాణపై మాట్లాడడానికి, ఉద్యమకారులపై విమర్శలు చేయడానికి ఆయనకే పేటెంట్ హక్కు ఇచ్చినట్టు ఉన్నాయి. అందుకే తెలంగాణ అనగానే లగడపాటి వచ్చి వాలుతాడు. అయితే తెలంగాణ ఉద్యమంపై ఆయనకు అవగాహన ఉన్నదా? లేక రాజకీయాల్లో తలపండిన నేతా అంటే పొరపాటే సుమా! ఆయనకు తెలిసిందల్లా వాస్తవాలు లేని వితండవాదమే తప్ప దేనికి సరైన ఇవ్వడు. మొన్నటికి మొన్న కేసీఆర్ హైదరాబాద్‌లేని తెలంగాణ ఇవ్వమని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరాడని, దీనికి ఒప్పుకోవాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు, ఇతర ముఖ్యులకు ఫోన్ చేశాడని అర్థంలేని ఆరోపణలు చేశాడు. దీనికి రుజువులు ఉన్నాయా అంటే ఏవీ లేవు. ఆరోపణలు చేసిన వ్యక్తే ఏమంటాడు అంటే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను గుండె మీద చెయ్యి వేసుకుని తన ఆరోపణలు వాస్తవమో, అవాస్తమో చెప్పమంటాడు. సదరు సీమాంధ్ర మీడియాకు లగడపాటి చేస్తున్న జగడం ఏమిటో అర్థమయ్యాక కూడా మళ్లీ మళ్లీ అతని అభిప్రాయమే సర్వరోగ నివారణి అన్నట్టు మైకు తీసుకెళ్లి ఆయన ముందు పెడతారు.

ఇప్పుడు తాజాగా కెమెరామెన్ గంగాతో రాంబాబు విషయంలోనూ తలదూర్చి ముఖ్యమంత్రికి లేఖ కూడా రాశాడు. ఈ విషయంలో ఉద్యమకారులపై ముఖ్యమంత్రి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతాడు. రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ఈ సినిమా వివాదంపై అందులో అభ్యంతరాలు ఉన్నాయని తమ దృష్టికి వచ్చినట్టు ఒక కమిటీ కూడా వేసింది. ఆ కమిటీ సభ్యులు కూడా ఇందులో తొమ్మిది చోట్ల అభ్యంతరాలు ఉన్నట్టు ప్రభుత్వానికి నివేదించారు కూడా. అయినా లగడపాటికి ‘రాంబాబు’మత్తు వదలలేదు. ఆ సినిమా డైరెక్టర్ పేరు కూడా సరిగ్గా తెలియని రాజగోపాల్ ఇవ్వాళ ఆ సినిమాలో సమైక్యత గురించి గొప్ప సందేశముందని లెక్చర్లు దంచుతున్నాడు. దీనికి ఓ సీమాంధ్ర మంత్రి, మరో రాయలసీమ నేత కూడా వంత పాడుతున్నారు. అంటే వీళ్ల ప్రభుత్వం నియమించిన కమిటీయే ఈ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటే వీళ్లు మాత్రం ఓ హీరోను పల్లకిలో మోసే పనిలో ఉన్నారు. అంతేమరి ప్రభుత్వాధినేత పనితీరు బాగుంటే వీళ్లు ఇంత కులాసాగా ఉందుకుంటారు. ముఖ్యమంత్రి ముందు సమస్యలు లేవనెత్తితే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తారు. పరిష్కారం చూపమంటే పక్కవాడి మీద నెట్టేస్తారు. అందుకే యథారాజ తథా ప్రజా అన్నట్టు ఉన్నది రాష్ట్ర ప్రభుత్వ పాలన! కేంద్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యను పరిష్కరించి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాన్న ఉద్దేశ్యం ఉన్నట్టు కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అలజడులను చూస్తూ హస్తినలో పెద్దలతో పూటకో మాట పలికిస్తున్నది. ఈ పరిస్థితిని ఇంకా ఎంతకాలం ఏకాభిప్రాయం పేరుతో  కొనసాగిస్తారో వారికే తెలియాలి.