Thursday 10 November 2011

ప్రకటన ప్రకంపనలు చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై రెండో ఎస్సార్సియే కాంగ్రెస్ పార్టీ విధానమని దిగ్విజై, రసిద్ఆల్వి లాంటి వాళ్ళు మాట్లాడడం లో వింత ఏమి లేదు. ఎందుకంటే వీరు యిప్పుడు రాహుల్ టీంలో చేరిపోయారు. అందుకే ఆ యువరాజు పార్టీ పగ్గాలు చేపట్టడానికి, ప్రధాని పదవికి అర్హుడే అని గొప్పలు చెబుతున్నాడు దిగ్విజై సింగ్. రాహుల్ త్వరలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపడతారని వార్తలు వస్తూనే ఉన్నాయి. అలాగే ఈ యువరాజు గత ఎన్నికల నుంచి ఉత్తరప్రదేశ్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడాని ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ సంకీర్ణ యుగం లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపి లు సొంతంగా కేంద్రం లో ప్రభుత్వాలను ఏర్పాటు చేయలేని స్టితిలో ఉన్నాయి. ఏదో ఒక కూటమికి నేతృత్వం వహిస్తూ, ప్రాంతీయ పార్టీల మద్దతుతో గత పదిహేనేళ్ళుగా కేంద్రం లో అధికారాన్ని చేలయిస్తున్నాయి. అందుకే మాయావతి ఉత్తరప్రదేశ్ ను మూడు లేదా నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారు. ఇందుకోసం అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. అదే జరిగితే గత ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఇరవై స్థానాలను గెలుచుకున్నది. రాష్ట్ర విభజన జరిగితే దాని వల్ల మాయావతి లబ్ధి పొందుతారని యిప్పుడు ఈ రెండో ఎస్సార్సీని కాంగ్రెస్ పార్టీ ముందుకు తెస్తున్నది. అయితే ఈ రెండో ఎస్సార్సీని బిజెపి, వామపక్షాలు ఇప్పటేకే వ్యతిరేకించాయి. కొత్త రాష్ట్రాల డిమాండ్ పై కమిషన్లు వేస్తారో, ఎస్సార్సీ వేస్తారో కాంగ్రెస్ పార్టీ సొంత నిర్ణయం. దాన్ని తెలంగాణ కు ముడిపెడుతున్న సీమాంధ్ర నేతల తీరే గర్హనీయం. ఎందుకంటే తెలంగాణ పై ఇప్పటికే కేంద్రం ఒక ప్రకటన చేసింది. ఆ ప్రకటనకు కట్టుబడి ఉండాలని రెండున్నర ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు ఉద్యమిస్తున్నారు. అంతే కాదు మొదటి ఎస్సార్సీకి సూచనకు వ్యతిరేకంగా తెలంగాణాను ఆంధ్రతో కలిపారు. నాటి నుంచే దీన్ని వ్యతిరేకిస్తూ, ఐదున్నర దశాబ్దాలు తెలంగాణ ప్రజలు పోరాడుతున్నారు. తెలంగాణ పై ఇప్పటికే ఎన్నో కమిటీలు, కమిషను వేశారు. అది ముగిసిన అధ్యాయం. గోడ మీద పిల్లి లాగ ఇప్పడు తమకు అనుకూలంగా ఏది ఉంటే దాన్ని పట్టుకో వేలాడడం టిజి, రాయపాటి, లగడపాటి వంటి సీమాంద్ర నేతలకు అలవాటే. తెలంగాణ పై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కాలయాపన వల్ల ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యే లు ఆ పార్టీని వీడారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంశాన్ని తేల్చకుండా ఎస్సార్సీ ద్వారా పరిష్కరిస్తామని అంటే ఇక ఆ పార్టీ తెలంగాణ లో మర్చిపోవలసిందే. ఈ విషయాన్నీ ఈ ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఇప్పటికే ప్రకటించారు కూడా. దీంతో అంపశయ్య మీద ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోవడం ఖాయం.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home