Sunday 4 March 2012

మన్మోహన్ మాయాజాలం



కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్య, వైద్య రంగాల బాధ్యతల నుంచి పూర్తి వైదొలగాలని ప్రయత్నిస్తున్నాయి. సంస్కరణల పేరుతో ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తున్నాయి. అందులో భాగంగానే విదేశీ విశ్వవిద్యాలయాలను దేశంలో నెలకొల్పడానికి అనుమతిచ్చే బిల్లును తెచ్చేందుకు కేంద్రం కసరత్తు మొదలు పెట్టింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీ ఏ లోని కేంద్ర మంత్రివర్గంలో పాలనా దక్షుల కంటే సంస్కరణలను నెత్తిన పెట్టుకొని ఊరేగే వారికే పదవులు కట్టబెట్టింది. స్వతహాగా ఈ దేశ ప్రధానే పెద్ద బ్యూరోక్రాట్. అయన సహచర మంత్రులైన చిదంబరం, కపిల్ సిబాల్ వంటి వారు మన్మోహన్ విధానాలను తూచా తప్పకుండా ఆచరిస్తారు. విదేశీ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన బిల్లు తేవడానికి ఎదురవుతున్న అవరోధాలపై అధిగమించడానికి ప్రధాని ఆ పనిని సిబాల్ కు అప్పజెప్పారు. ఇక అటవీ ప్రాంతాలలోని సహజ వనరులను బహుళజాతి కంపనీలకు కట్టబెట్టే బాధ్యతలు చిదంబరం తన భుజాల పై మోస్తున్నారు. అందుకే ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆదివాసులను, వారికి అండగా ఉంటున్న మావో యిస్టులను ఏరివేయడానికి గ్రీన్ హంట్ ను అమలు చేస్తున్నారు. హక్కులు అడిగితే అరదండాలె అన్నటు మానవ హక్కుల, సామాజిక కార్యకర్తలపై కాలం చెల్లిన రాజద్రోహం వంటి కేసులు వారిపై పెడుతూ, ఏళ్ల తరబడి జైళ్ళలో మగ్గేల చేస్తున్నారు. దేశ పౌరులకు ఆహార భద్రత కల్పిస్తామంటున్న పాలకులు ఎఫ్ డి ఐ ల పేరుతో  ఉన్న ఉపాధిని కొల్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మన్మోహన్ కు అణు ఇందనం పై ఉన్న ప్రేమ అట్టడుగు వర్గాలపై లేదు. అందుకే దేశవ్యాప్తంగా అణు ఇంధన ప్రాజెక్టుల కు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్నా.. వాటిపై ఉక్కుపాదాన్ని మోపుతున్నారు. గోదాముల్లో మూక్కిపోతున్న ధాన్యాన్ని పేదలకు పంచిపెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించిన కుదరదు అని చెప్పి, రోజుకు ముప్పై నాలుగు రూపాయలు ఖర్చు చేసేవారందరూ దారిద్ర్యరేఖకు ఎగువన ఉన్నవారే అని తేల్చేశారు.మన్మోహన్ మాయజాలంలో దేశం సాధించిన అభివృద్ధి కంటే అధోగతి పాలైందే ఎక్కువ. దీనికి ఆమ్ ఆద్మీ అని చెప్పే సోనియా, రాహుల్ లు కూడా బాధ్యులే. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో విఫలమౌతున్న ప్రతిపక్షాలు దోషులే.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home