Thursday 11 April 2024

మంత్రి మాటల్లో అప్పటికి ఇప్పటికి ఎంత మార్పు


అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి  ఏం మాట్లాడినా కౌంటర్‌ ఇచ్చారు. అసలు రేవంత్‌ చెప్పేది కాంగ్రెస్‌ పార్టీలో నడువదు అన్నారు. అట్లా ఉప్పూ నిప్పులా ఉన్న ఆ ఇద్దరు నేతలు ఫలితాల తర్వాత ఒక్కటయ్యారు. ఈ మధ్యకాలంలో బీజేపీ నిర్మల్‌ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి కోమటిరెడ్డి బీజేపీలోకి వస్తాననని తమ పార్టీ పెద్దలతో చెప్పినట్టు ఆరోపించారు. దీన్ని మంత్రి కోమటిరెడ్డి తీవ్రంగా ఖండించారు. తమ ఎమ్మెల్యేల్లో ఒక్కరిని టచ్‌ చేసినా రెండురోజుల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుందని మహేశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి గేట్లు ఎక్కడివి? బిల్డింగ్‌ ఎక్కడిది? ఉన్న8 సీట్ల ఉన్న ఆపార్టీ ఎక్కడిది అని ఎదురు ప్రశ్నించారు. 


రాష్ట్రంలో కొన్నిరోజులుగా ఏక్‌నాథ్‌ షిండే ఎవరు అన్న చర్చ జరుగుతున్నది. దీనిపై స్పందించి మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ... 'కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్‌ షిండేలు ఎవరూ లేరు. పదేళ్లు రేవంత్‌రెడ్డినే ముఖ్యమంత్రి బీజేపీనే ఏక్‌నాథ్‌షిండేను సృష్టించిందన్నారు. హరీశ్‌రావు, మహేశ్వర్‌రెడ్డిలు నోరు అదుపులోపెట్టుకోవాలని మంత్రి వార్నింగ్‌ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ ఒక్క సీటు గెలిచినా దేనికైనా సిద్ధమని' మంత్రి సవాల్‌ విసిరారు.


రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక అధిష్ఠాన నిర్ణయాన్నికోమటిరెడ్డి బ్రదర్స్‌  బహిరంగంగా వ్యతిరేకించారు. ఆయన నాయకత్వంలో పని చేయను అన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన ఎమ్మెల్మే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచార సందర్భంగా రేవంత్‌రెడ్డి రాజగోపాల్‌రెడ్డిల జరిగిన మధ్య మాటల యుద్ధం తెలిసిందే. ఆ సమయంలో వెంకట్ రెడ్డి కూడా కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కాకుండా తన తమ్ముడి కోసం పనిచేయాలని కార్యకర్తలను, నేతలను కోరినట్టు ఆడియో ఒకటి కలకలం సృష్టించింది., అట్లా రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకించిన కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఇప్పుడు పూర్తిగా స్వరం మార్చారు. రేవంత్‌ నాయకత్వంలోనే తాము పనిచేస్తామని అంటున్నారు. ఆయనే పదేళ్లు సీఎం అని కొనియాడుతున్నారు. అధికారంలోకి వచ్చాక  వాళ్లలో ఎంత మార్పు వచ్చిందో అంటున్నారు. 

Labels: , , , , , , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home