Wednesday 10 April 2024

కడియం కామెంట్స్‌.. బీఆర్‌ఎస్‌ భవిష్యత్తు



బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని కీలక విషయాలు మాట్లాడారు. 


గతంలో ఇరిగేషన్‌ మంత్రిగా పనిచేసిన అనుభవంతో చెబుతున్నాను. కాళేశ్వరం ఫీలర్ల కుంగుబాటుపై నిపుణుల సూచనల ప్రకారం మనం ముందుకు వెళ్లాలి. కానీ కేసీఆర్‌ తాను కుర్చీ వేసుకుని మూడు నెలల్లో బాగు చేస్తానని అనడాన్ని తప్పుపట్టారు. 


ఇలాంటివే పార్టీకి నష్టం చేశాయని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే పార్టీ నిర్మాణం లేకుండా ఎన్నికలకు వెళ్లడం సరికాదని తాను సూచించానని కానీ దాన్ని కేసీఆర్‌ పరిగణనలోకి తీసుకోలేదన్నారు.


నియోజకవర్గంలో గతంలో మంత్రిగా తాను చేసిన పనులే తప్పా గత పదేళ్ల కాలంలో స్టేషన్‌ ఘన్‌పూర్‌లో పెద్దగా అభివృద్ధి జరగలేదు అన్నారు. 


బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటే అన్న ప్రచారం పార్టీకి నష్టం చేసిందని, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలతో ఓటర్ల దగ్గరి వెళ్లి ఓట్లు అడిగే పరిస్థితి లేదన్నారు. 


కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకులు పార్టీ అధినాయకత్వానికి మధ్య దూరం పెరిగింది ఇది కూడా పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోవడానికి కారణం అన్నారు. 


కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదన్న తానే ఆ పార్టీ చేరడానికి కారణాలు చెబుతూ... కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చాక దళితులు, మైనారిటీలపై విపరీతంగా దాడులు పెరిగాయని.. దాన్ని అడ్డుకునే శక్తి ప్రాంతీయపార్టీలకు లేదన్నారు. అందుకే తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. 


అట్లనే మోడీ ప్రభుత్వం ప్రాంతీయపార్టీలను టార్గెట్‌ చేసిందని, దీంతో ప్రాంతీయపార్టీల మనుగడను ప్రశ్నార్థం చేసిందన్నారు. ఒకవేళ రాష్ట్రంలో బీజేపీకి బీఆర్‌ఎస్‌ కంటే ఎక్కువ సీట్లు వస్తే పార్టీ మనుగడ కష్టమే అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 


అయితే కేసీఆర్‌ ఫైటర్‌ అని ఆయన ప్రజా సమస్యలపై పోరు చేస్తూ పార్టీ నిర్మాణంపై దృష్టి సారిస్తే పార్టీకి తిరిగి పుంజుకునే అవకాశాలు ఉన్నాయన్నారు.

Labels: , , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home