Sunday 4 March 2012

మాటల్లోనే హక్కులు


ఈ దేశంలో పాలకవర్గ విధానాలతో ఎక్కువగా నష్టపోతున్నది మొదటి వరుసలో ఉండేది ఆదివాసులు. వాళ్ళు అడివినే నమ్ముకొని బతుకుతారు. ప్రకృతి ప్రేమికులు కాబట్టే అటవీ ప్రాంతాలు అన్యాక్రాంతం కాకుండా కంటికి రెప్పల కాపాడుకుంటారు. అడివిలో దొరికే సహజ వనరులతో వ్యాపారం చేస్తే కోట్లాది రూపాయలు గడించవచ్చు.కానీ వాళ్ళు ఆ పని చేయరు. కాసులకోసం చేసే వ్యాపారం తమ ముందు తరాలను కభలిస్తుంది అనేది వాళ్ళ ప్రగాడ విశ్వాసం. అందుకే ఆ మట్టి మనుషుల మనసులో మానవ సంబంధాలకే ప్రాధాన్యం ఉంటుంది. కానీ మనీకి కాదు. ప్రపంచీకరణ పుణ్యమా అని ప్రపంచం ఒక కుగ్రామం అయ్యింది.  అభివృద్ధి అనేది దేశంలోని పది శాతం కూడా లేని పెట్టుబడిదారులది అవుతోంది. వీళ్ళ ఉత్పత్తి వేటలో కోట్లాది ప్రజలకు  ఉపాధి కరువవుతోంది. అందుకే ఆదివాసుల హక్కులన్నీ రాజ్యాంగంలో రాసుకోవడానికే కానీ ఆచరణలో అమలు చేయడం సాధ్యం కాదని... ఏలికల చేతలు చూపుతున్నాయి. ఇవాళ కేంద్ర మంత్రి జయరాం రమేష్ మాట్లాడుతూ నేను, కిషోర్ చంద్ర దేవ్ మంత్రి వర్గంలో ఉన్నంత కాలం బాక్సైట్ తవ్వకాలు ఉండవు అని ప్రకటించారు. ఈ మంత్రి గారే గతంలో బిటి విత్తనాలన విషయంలో ఎలా వ్యవహరించారో మనకు తెలిసిందే. రాష్ట్ర శాసనసభ స్పీకర్ నేతృత్వంలో శాసనసభ్యులంతా గిరిజనుల సమస్యలను తెలుసుకోవడానికి అరకులో మూడు రోజులు బస చేసినా వాళ్ళ సమస్యలు తీరలేదు. తీరవు కూడా. అలాగే ఆదిలాబాద్ లోని కవ్వాల్ లో పులుల అభయారణ్యం పేరుతో అక్కడ నివసిస్తున్న ఆదివాసులను అడవి నుంచి తరిమికొట్టే ప్రయత్నాలకు ఇదే పాలకులు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ గత కొంతకాలంగా ఆ ప్రాంత గిరిజనులు ఉద్యమిస్తూనే ఉన్నారు. వీళ్ళ బాధలు అధికార, ప్రతిపక్ష నేతలకు పట్టడం లేదు. కాకులను కొట్టి గద్దలకు పంచడం అంటే ఇదేనేమో!

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home