Friday 19 April 2024

సార్వత్రిక సమరంలో తొలి విడుత పోలింగ్‌ ప్రారంభం


సార్వత్రిక ఎన్నికల సమరంలో తొలి దశ పోలింగ్‌ ప్రారంభమైంది. 17 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరుగుతున్నది. తమిళనాడులోని మొత్తం 39 స్థానాలకు నేడు ఒకేసారి పోలింగ్‌ జరుగుతున్నది. దీనితోపాటు అరుణాచల్‌ప్రదేశ్‌లోని 50  , సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతున్నది. 60 స్థానాలున్న అరుణాచల్‌ ప్రదేశ్‌లో బీజేపీకి చెందిన 10 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. 

ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 1 వరకు ఏడు దశల్లో జరిగే పోలింగ్‌లో ఇదే పెద్దది. అలాగే కేంద్రంలో బీజేపీ రెండుసార్ల సంపూర్ణ మెజారిటీ సాధించడంలో కీలక రాష్ట్రాలైన యూపీలో 8, రాజస్థాన్‌లో 12 లోక్‌సభ స్థానాలకు నేడు పోలింగ్‌ జరుగుతున్నది. యూపీలోని ముస్లిం, దళిత, ప్రాబల్య ప్రాంతాల్లో తొలి విడుత పోలింగ్‌ జరుగుతున్నది. యూపీలో ఇవాళ జరుగుతున్న 8 స్థానాల్లో 2019లో బీజేపీ 3 స్థానాలు గెలుచుకోగా, బీఎస్పీ 3, ఎస్పీ రెండు చోట్ల గెలుపొందాయి. బీజేపీకి సంప్రదాయంగా మొదటి నుంచి మద్దతుగా ఉన్న రాజ్‌పూత్‌లు ఈసారి ఆ పార్టీపై ఆగ్రహంగా ఉన్నారు. దీంతో ఫలితాలు ఎలా ఉండనున్నాయనే ఆసక్తి నెలకొన్నది. అలాగే రాజస్థాన్‌లోని 12 చోట్ల ఇండియా కూటమి బీజేపీకి గట్టి పోటీ ఇస్తున్నది. 

Labels: , , , , , , , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home