Wednesday, 30 April 2025
పంతానికి పోతే తెలంగాణ రైతాంగానికి తీరని నష్టం
కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్నచిన్న లోపాలున్నాయనేది వాస్తవం. దీనిపై అధికార, ప్రతిపక్ష పార్టీ వాదనలు ఎలా ఉన్నా తెలంగాణకు ఎత్తిపోతల పథకాలు తప్ప మరో మార్గం లేదు. ఇది అందరూ అంగీకరిస్తున్నదే. అందుకే కాళేశ్వరం నిర్వహణకు అయ్యే కరెంటు ఖర్చు గురించి కాకుండా ఆ ప్రాజెక్టు అందించిన ఫలితాల గురించి ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పంటల ఉత్పత్తి పెరిగింది. భూగర్భ జలాలు పెరిగాయని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. మేడిగడ్డలో లోపాన్ని కారణంగా చూపెట్టి నీటిని ఎత్తిపోయకుండా పదహారు నెలలుగా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే విమర్శలు వస్తున్నాయి. ఫలితంగా ఈ ఏడాది ఎండాకాలంలో తాగు,సాగు నీటి కష్టాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైతులు చేతికి వచ్చిన పంటలు ఎండిపోతున్నాయని వాపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఎన్డీ ఎస్ ఏ నివేదికను ముందుపెట్టి ప్రాజెక్టే పనికిరాదనే ప్రచారం చేస్తున్నది. కానీ ఆ నివేదిక మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్ కూల్చి తిరిగి నిర్మించాలని సూచించింది. మిగతా రెండు బ్యారేజీలు ఇదే డిజైన్ లో నిర్మించారు కాబట్టి వాటి పటిష్టతపైనా స్టడీ చేయాలని ఉచిత సలహా ఇచ్చింది. దీన్నిబట్టి ఆ నివేదిక ఎంతవరకు ప్రామాణికమో ఏలికలే చెప్పాలి. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం గోదావరిలో తెలంగాణకు కేటాయించిన 900 టీెఎంసీలకు పైగా నీటిని వినియోగించుకోవాలంటే మేడిగడ్డ ఏడో బ్లాక్ తిరిగి నిర్మించి వినియోగంలోకి తేవాలి. అలాకాకుండా ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టాలని రాజకీయాల కోసం పంతానికి పోతే దీర్ఘకాలంలో తెలంగాణ రైతాంగానికి తీరని నష్టం చేసిన వాళ్లు అవుతారు.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
కవిత కొత్త పార్టీ పెడుతాారా?
బీఆర్ఎస్ పార్టీలో సంక్షోభం గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఆమె పార్టీ పెడుతుందన...

-
రాష్ట్రంలో ఆరు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రజలు మార్పు కోరుకున్న మార్పు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష...
-
వరుసగా మూడోసారి నరేంద్రమోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 2014,2019లో సొంతంగా మెజారిటీ సాధించడంలో మంత్రివర్గ కూర్పులోనూ తన మార్క్‌ను చూపెట్...
-
https://www.teluguscribe.com/top-stories/whenever-cm-is-on-defense-he-raises-wrong-issues-602972 https://www.teluguscribe.com/top-storie...
No comments:
Post a Comment