తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి పాత్ర ఏమిటి అంటే ఎవరిని అడిగినా చెబుతారు. ఆయనకు ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు. ఆయన గురువు చంద్రబాబు గుర్తుకు వస్తారు. కానీ పధ్నాలుగేళ్లు ఉద్యమం చేసిన ఉద్యమనాయకుడు, పదేళ్లు సీఎంగా పనిచేసి వ్యక్తి, గుర్తుకురారు. అంతేలే. చంద్రబాబు సూత్రధారిగా, రేవంత్ రెడ్డి పాత్రధారిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాన్ని ఛేదించిన నాయకుడి పేరు తలుచుకోవాలన్నా, ఆయనతో పోల్చుకోవాలన్నా ఉద్యమకాలంలో తమరి ట్రాక్ రికార్డు కూడా సక్కగ లేదాయే. అందుకే ప్రపంచంలో అన్ని విషయాల గురించి మాట్లాడుతారు కానీ తెలంగాణ విషయానికి వస్తే ఎక్కడ కేసీఆర్ పేరు ప్రస్తావించాల్సి వస్తుందోనని అతి తెలివితో అర్థంపర్థం లేని మాటలు మాట్లాడి అభాసుపాలవడం మీకు అలావాటుగా మారింది. తెలంగాణ విషయంలో ఫణికర మల్లయ్యకు ఉన్న చైతన్యం కూడా లేకపాయే. ఏం కావాలి అని మీ గురువు చంద్రబాబు అడిగితే మరో మాట లేకుండా తెలంగాణ కావాలన్నడు. ఇది కదా తెలంగాణ సోయి అంటే!
No comments:
Post a Comment