Showing posts with label #WorldInequalityReport2026 #EconomicInequality #WealthGap #IndiaEconomy #IncomeInequality #RichVsPoor #IndianWealth #EconomicDivide #StructuralInequality #PovertyInIndia. Show all posts
Showing posts with label #WorldInequalityReport2026 #EconomicInequality #WealthGap #IndiaEconomy #IncomeInequality #RichVsPoor #IndianWealth #EconomicDivide #StructuralInequality #PovertyInIndia. Show all posts

Saturday, 27 December 2025

1% భారతీయుల వద్దే 40% సంపద


  • ప్రపంచ అసమానతల నివేదిక - 2026 వెల్లడి
  • జనాభాలో అడుగున ఉన్న 50 శాతం మందికి అందుతున్న జాతీయ ఆదాయం15 శాతం మాత్రమే.



ఈ నెల 10 వతేదీ (బుధవారం) విడుదలైన 'ప్రపంచ అసమానతల నివేదిక -2026 కీలక విషయాలు వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. భారతదేశంలోని మొత్తం సంపదలో దాదాపు 40 శాతం కేవలం 1 శాతం ధనవంతుల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉంది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక ఆదాయ అసమానతలు ఉన్న దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. గతంతో పోలిస్తే ఈ పరిస్థితిలో మెరుగుదల చాలా తక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. ప్రముఖ ఆర్థికవేత్తలు లూకాస్ చాన్సెల్, రికార్డో గోమెజ్-కరీరా, రోవైడా మోష్రిఫ్, థామస్ పికెట్టిలు రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. దేశంలోని టాప్ 10 శాతం ధనవంతులు మొత్తం సంపదలో 65 శాతం వాటాను కలిగి ఉన్నారు. ఆదాయం విషయానికి వస్తే టాప్ 10 శాతం మంది మొత్తం జాతీయ ఆదాయంలో 58 శాతం పొందుతున్నారు. అట్టడుగున ఉన్న 50 శాతం మంది15 శాతం మాత్రమే  జాతీయ ఆదాయాన్ని పంచుకుంటున్నారు.


భారతదేశంలో లోతైన నిర్మాణాత్మక విభజనలు

"భారత్‌లో సగటు తలసరి వార్షిక ఆదాయం సుమారు 6,984 డాలర్లు. (PPP - కొనుగోలు శక్తి సామర్థ్యం ప్రకారం). సగటు సంపద 32,592 డాలర్లుగా ఉంది. స్త్రీల శ్రమ శక్తి భాగస్వామ్యం (Female labour participation) కేవలం 15.7 శాతం వద్దే నిలిచిపోయింది, ఇది గత దశాబ్ద కాలంగా ఏమాత్రం మెరుగుపడలేదు. ఆదాయం, సంపద, లింగ వివక్ష పరంగా భారతదేశంలో అసమానతలు ఇంకా లోతుగా పాతుకుపోయి ఉన్నాయి" అని ఆర్థికవేత్తలు జయతి ఘోష్, జోసెఫ్ స్టిగ్లిట్జ్ తమ ముందుమాటలో పేర్కొన్నారు. ప్రపంచ అసమానతల ల్యాబ్ కో-డైరెక్టర్ థామస్ పికెట్టి మాట్లాడుతూ, "రాజకీయంగా సవాలుతో కూడుకున్న సమయంలో ఈ నివేదిక వచ్చింది. సామాజిక, వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కోవాలంటే సమానత్వం వైపు అడుగులు వేయడం అత్యవసరం" అని అన్నారు.


ప్రపంచవ్యాప్తంగా విస్తుగొలిపే అసమానతలు

అసమానతల విషయంలో ప్రపంచమంతా ఒక్కటిగానే కనిపిస్తోంది. ప్రపంచ జనాభాలో అట్టడుగున ఉన్న సగం మంది (50 శాతం) సంపద కంటే, పైన ఉన్న కొద్దిమంది ఎలైట్ వర్గం వద్ద మూడు రెట్లు ఎక్కువ సంపద ఉంది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 60,000 మంది (టాప్ 0.001 శాతం) మల్టీ మిలియనీర్ల వద్ద సగటున ఒక్కొక్కరికి ఒక బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సంపద ఉంది. వీరి వాటా 1995లో 4 శాతం ఉండగా, నేడు 6 శాతానికికి పెరిగింది. మరోవైపు, అట్టడుగు 50 శాతం జనాభాలో ఉన్న ఒక వ్యక్తి సగటు సంపద కేవలం 7,550 డాలర్లు మాత్రమే.


కీలక పరిశీలనలు - సిఫార్సులు

సంపద కేంద్రీకరణ: ప్రపంచంలోని టాప్ 1 శాతం జనాభా (దాదాపు బ్రిటన్ జనాభా అంత) ప్రపంచ సంపదలో 37 శాతం నియంత్రిస్తున్నారు. ఇది చైనా, భారత్, అమెరికా, ఇండోనేషియా వంటి దేశాల మొత్తం దిగువ జనాభా సంపద కంటే 18 రెట్లు ఎక్కువ.

లింగ వివక్ష: వేతనం లేని గృహ పని , సంరక్షణ పనులను పరిగణనలోకి తీసుకుంటే, పురుషులు సంపాదించే ప్రతి గంట ఆదాయంలో మహిళలు కేవలం 32 శాతం మాత్రమే సంపాదిస్తున్నారు.

పరిష్కారం: అసమానతలను తగ్గించడానికి ప్రభుత్వాలు సంపన్నులపై ప్రగతిశీల పన్నులు (Progressive taxes) విధించాలని. నిధుల బదిలీ చేపట్టాలని పరిశోధకులు సిఫార్సు చేస్తున్నారు.


(financialexpress సౌజన్యంతో)

Featured post

ఓట్ల తొలగింపుపై అఖిలేశ్ యాదవ్ తీవ్ర ఆగ్రహం.. ఈసీ తీరుపై ప్రశ్నల వర్షం!

  లక్నో: ఓటర్ల జాబితా నుంచి ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారంటూ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ ఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయి...