- కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
న్యూఢిల్లీ: హల్ద్వానీలో జరిగిన ‘శుద్ధీకరణ’ ఘటన నేరుగా అంటరానితనానికి సంబంధించినదని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా దళితులకు తాము ఉన్నతులమని, వారు తక్కువ కులానికి చెందినవారనే భావనను తెలియజేసే ప్రయత్నం జరిగిందని విమర్శించారు. కుల వివక్ష కారణంగా దళితులకు నీరు తాగే హక్కు, నీటిని వినియోగించే అవకాశం కూడా లేకపోయిన సమయంలో బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహాడ్ ఉద్యమాన్ని చేపట్టారని ఖర్గే గుర్తుచేశారు. అంటరానితనాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతోనే డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ 17ను పొందుపరిచారని తెలిపారు. అయితే బీజేపీ ప్రభుత్వం కళ్ల ముందే హల్ద్వానీలో ‘శుద్ధీకరణ’ ఘటన జరిగినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఖర్గే విమర్శించారు. ‘‘ప్రభుత్వం కళ్ల ముందే ఇలాంటి ఘటన జరిగి, అందులో ఎలాంటి చర్యలు తీసుకోకపోతే.. దేశంలోని మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలి’’ అని ఖర్గే అన్నారు.
No comments:
Post a Comment