- భారత్ జీడీపీ వృద్ధి రేటుపై శ్యామ్ పిట్రోడా కీలక వ్యాఖ్యలు
షికాగో (యూఎస్):భారత ఆర్థిక వ్యవస్థ తొలి త్రైమాసికంలో 7.8 శాతం జీడీపీ (GDP) వృద్ధి రేటును నమోదు చేయడంపై ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్ శ్యామ్ పిట్రోడా సందేహాలు వ్యక్తం చేశారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ప్రస్తుతం దాదాపు 100కి సమీపిస్తోందని, ఇది ఆర్థిక వ్యవస్థ స్థితికి ఒక సూచిక అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "అసలు ఇది ఎలాంటి వృద్ధి? ఈ ఎదుగుదల కొద్దిమంది కోసమేనా లేక దేశ ప్రజలందరి కోసమా? ఇది సమానత్వంతో కూడుకున్నదేనా? ఈ వృద్ధి ఫలాలు సమాజంలోని కింది స్థాయి వరకు అందుతున్నాయా లేదా కేవలం మరో కొద్దిమంది బిలియనీర్లు తయారు చేసేందుకు మాత్రమే ఉపయోగపడుతోందా? నా దృష్టిలో ఇది అత్యంత ప్రాథమికమైన, కీలకమైన అంశం" అని వ్యాఖ్యానించారు.

No comments:
Post a Comment