- అలీ ఖమేనీ మృతితో రగిలిపోతున్న ఇరాన్
- ఇజ్రాయెల్‌కు లరిజానీ భయంకర హెచ్చరిక!
టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ మరణంతో పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు కనీవినీ ఎరుగని స్థాయికి చేరాయి. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఖమేనీ కన్నుమూశారన్న వార్తను ధృవీకరించిన కొద్దిసేపటికే, ఇరాన్ ఉన్నతాధికారి, సుప్రీం లీడర్ సలహాదారు అలీ లరిజానీ అత్యంత కఠినమైన పదజాలంతో ప్రతీకార ప్రకటన చేశారు. "శత్రువులు మా దేశపు గుండెలపై కత్తితో పొడిచారు.. గుర్తుంచుకోండి, త్వరలోనే వారి గుండెలు కూడా అదే రీతిలో బద్దలవుతాయి" అంటూ ఆయన అంతర్జాతీయ సమాజం ఉలిక్కిపడేలా హెచ్చరించారు. ఖమేనీ మరణం ఇరాన్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేదని, ప్రతి దెబ్బకు వడ్డీతో సహా సమాధానం ఇస్తామని ఆయన ఉద్ఘాటించారు.
ఇజ్రాయెల్, అమెరికా ఉమ్మడిగా చేపట్టిన ఈ ఆపరేషన్ వల్ల ఇరాన్ అగ్రనేత మరణించడం ఆ దేశ చరిత్రలోనే అతిపెద్ద సంక్షోభంగా మారింది. దీనికి "అత్యంత విధ్వంసకర ప్రతిస్పందన" ఉంటుందని లారిజానీ స్పష్టం చేశారు. ఇప్పటికే ఇరాన్ తన క్షిపణి వ్యవస్థలను యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేసినట్లు సమాచారం. ఇజ్రాయెల్‌లోని ప్రధాన నగరాలు , సైనిక స్థావరాలే లక్ష్యంగా భారీ దాడులు జరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఖమేనీ మరణంతో ఇరాన్ ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహం, ఆ ప్రాంతాన్ని పూర్తిస్థాయి యుద్ధంలోకి నెట్టేలా కనిపిస్తోంది.
మరోవైపు, టెహ్రాన్ వీధుల్లో వేలాది మంది ప్రజలు ఖమేనీ చిత్రపటాలతో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. "అమెరికాకు మరణం, ఇజ్రాయెల్‌కు మరణం" అంటూ నినాదాలతో ఇరాన్ మార్మోగిపోతోంది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఇప్పటికే అత్యవసర సమావేశం నిర్వహించి ప్రతీకార చర్యల ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఐక్యరాజ్యసమితి శాంతి విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ, ఇరాన్ అధికారుల మాటలు చూస్తుంటే పశ్చిమాసియాలో పెను వినాశనం తప్పదనిపిస్తోంది.
మరి ఇరాన్ దేశంలో లోగడ జరిగిన ఖమేనీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు అన్నీ తప్పుడు వార్తలే అంటారా?
ReplyDeleteBest Nursing Coaching in Yamunanagar
ReplyDeleteBest Nursing Coaching in Sonipat
Best Nursing Coaching in Karnal
Best Nursing Coaching in Jind