హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. శాసనసభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రసంగాన్ని ప్రారంభించారు. రూ.3,24,234 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక న్యాయం అదించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అంబేడ్కర్ అడుగు జాడల్లోనే పాలన సాగిస్తున్నట్లు తెలిపారు. అటు శాసనమండలిలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
బడ్జెట్ స్వరూపం
మొత్తం బడ్జెట్.. రూ.3,24,234 కోట్లు
రెవెన్యూ వ్యయం.. రూ.2,34,406 కోట్లు
మూలధన వ్యయం.. రూ.47,267 కోట్లు
బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షలతో జీవిత బీమా.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి రూ.4 వేల కోట్లు
జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రకటన
ఐటీఐ, ఏటీసీల్లో చదివే విద్యార్థులకు నెలకు రూ.2 వేల ఉపకారవేతనం
రూ.73,383 కోట్ల కొత్త రుణాలకు ప్రతిపాదన
వ్యవసాయ శాఖకు రూ.23,179 కోట్లు
విద్యుత్ శాఖకు రూ.21,285 కోట్లు
పౌరసరఫరాల శాఖకు రూ.7,366 కోట్లు
పశుసంవర్ధక శాఖకు రూ.1,529 కోట్లు
విద్యా శాఖకు రూ.26,674 కోట్లు
వైద్య శాఖకు రూ.13,679 కోట్లు
కార్మిక శాఖకు రూ.998 కోట్లు
మహిళ, శిశు సంక్షేమ శాఖకు రూ.3,143 కోట్లు
పర్యాటక రంగానికి రూ.1,224 కోట్లు
ఎస్సీ సంక్షేమం.. రూ.11,784 కోట్లు
ఎస్టీ సంక్షేమం.. రూ.7,934 కోట్లు
బీసీ సంక్షేమం.. రూ.12,511 కోట్లు
మైనార్టీ సంక్షేమం.. రూ.3,769 కోట్లు
కల్యాణ లక్ష్మీ పథకం.. రూ.3,683 కోట్లు
ఉపకార వేతనాలకు రూ.4,343 కోట్లు
యంగ్ ఇండియా స్కూళ్లకు రూ.5 వేల కోట్లు
మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్.. రూ.1500 కోట్లు
ఉస్మానియా యూనివర్సిటీకి రూ.వెయ్యి కోట్లు
మెట్రో రైలు ఫేజ్-2.. రూ.600 కోట్లు
మహాలక్ష్మీ గ్యాస్ సబ్సిడీ పథకం.. రూ.723 కోట్లు
రాజీవ్ ఆరోగ్యశ్రీ.. రూ.1143 కోట్లు
గృహజ్యోతి పథకానికి రూ.2,080 కోట్లు
వ్యవసాయ ఉత్పత్తులకు బోనస్.. రూ.3500 కోట్లు
మహాలక్ష్మీ పథకం.. రూ.4,305 కోట్లు
ఇందిరమ్మ ఇళ్లు.. రూ.5,500 కోట్లు
చేయూత పథకం.. రూ.14,861 కోట్లు
రైతు భరోసా.. రూ.18 వేల కోట్లు
ఆరు గ్యారంటీల అమలుకు.. రూ.50,713 కోట్లు
No comments:
Post a Comment