Showing posts with label #ElectionResults2026 #AssemblyElections2026 #WestBengal #TamilNadu #Kerala #Assam #Puducherry #CountingDay #TMCvsBJP #DMKvsAIADMK #LDFvsUDF. Show all posts
Showing posts with label #ElectionResults2026 #AssemblyElections2026 #WestBengal #TamilNadu #Kerala #Assam #Puducherry #CountingDay #TMCvsBJP #DMKvsAIADMK #LDFvsUDF. Show all posts

Sunday, 3 May 2026

బెంగాల్‌, తమిళనాడు.. గత ఎన్నికల ఫలితాలు ఇలా..

 




పశ్చిమబెంగాల్‌లో భాజపాకు అధికారం దక్కేనా? తమిళనాడులో డీఎంకే మరోసారి విజయం సాధిస్తుందా? కేరళలో కాంగ్రెస్‌ పరిస్థితి ఏంటీ? మరి కొన్ని గంటల్లో ఈ ప్రశ్నలకు సమాధానాలు తేలనున్నాయి. యావత్‌ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న పశ్చిమ బెంగాల్ (West Bengal), కేరళ, అస్సాం, తమిళనాడు (Tamil Nadu), పుదుచ్చేరీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికాసేపట్లో వెల్లడి కానున్నాయి. మరి ఈ 4 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో 2021లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో (Assembly Elections) ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో ఓసారి గుర్తుచేసుకుందాం..!


పశ్చిమ బెంగాల్‌:


మొత్తం సీట్లు : 294 ; మ్యాజిక్‌ ఫిగర్‌ : 148


టీఎంసీ - 215

బీజేపీ  - 77

ఇతరులు - 2

తమిళనాడు 


మొత్తం సీట్లు : 234 ; మ్యాజిక్‌ ఫిగర్‌ :  118


డీఎంకే -133

అన్నాడీఎంకే - 66

కాంగ్రెస్‌ - 18

బీజేపీ - 4

పీఎంకే - 5

వీసీకే - 4

సీపీఐ - 2

సీపీఎం - 2

కేరళ


మొత్తం సీట్లు : 140 ; మ్యాజిక్‌ ఫిగర్‌ : 71


ఎల్‌డీఎఫ్‌ - 99

సీపీఎం  - 62

సీపీఐ - 17

ఇతరులు - 20

యూడీఎఫ్‌ - 41

కాంగ్రెస్‌ - 21

ఐయూఎంఎల్ - 15

ఇతరులు - 5

అస్సాం


మొత్తం సీట్లు : 126 ; మ్యాజిక్ ఫిగర్‌ :  64 


బీజేపీ - 60 

ఏజీపీ - 9

యూపీపీఎల్‌ - 6

కాంగ్రెస్‌ 29

ఏఐయూడీఎఫ్‌ - 16

బీపీఎఫ్‌  - 4

సీపీఎం - 1

స్వతంత్రులు - 1

పుదుచ్చేరీ


మొత్తం సీట్లు : 30 ; మ్యాజిక్‌ ఫిగర్‌ : 16


ఆల్‌ ఇండియా ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ - 10

డీఎంకే - 6

కాంగ్రెస్‌ - 2

బీజేపీ - 6 

స్వతంత్రులు - 6

దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఓట్ల లెక్కింపు



  •  823 స్థానాల్లో ఎవరిది గెలుపు
  • పటిష్ట భద్రత మధ్య ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ

నిర్ణీత సమయం ప్రకారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో ఈ ప్రక్రియ మొదలైంది, అనంతరం 8:30 గంటల నుంచి ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్‌లో 293 స్థానాలకు (ఫాల్టా మినహా), తమిళనాడులో 234, కేరళలో 140, అస్సాంలో 126 , పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల సంఘం లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేయడమే కాకుండా, తొలిసారిగా క్యూఆర్ కోడ్ ఆధారిత ఫొటో ఐడెంటిటీ కార్డుల ద్వారా ప్రవేశాలను నియంత్రిస్తోంది. ఫలితాలను ఈసీఐనెట్ (ECINET) ప్లాట్‌ఫామ్ , అధికారిక పోర్టల్ ద్వారా ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తున్నారు.  లెక్కింపు ప్రారంభం కాగానే పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. భవానీపూర్ వంటి కీలక నియోజకవర్గాల లెక్కింపు కేంద్రాల వద్ద ఫైళ్లు, పెన్నులు అనుమతించే విషయంలో టీఎంసీ , బీజేపీ ఏజెంట్ల మధ్య వాగ్వాదం జరిగింది. బెంగాల్‌లో మమతా బెనర్జీ నాలుగోసారి అధికారాన్ని ఆశిస్తుండగా, బీజేపీ చారిత్రక విజయంపై ధీమాగా ఉంది. కేరళలో వరుసగా ప్రభుత్వాలు మారే ఆనవాయితీని బ్రేక్ చేస్తూ ఎల్‌డీఎఫ్ మళ్ళీ వస్తుందా లేదా యూడీఎఫ్ పుంజుకుంటుందా అనేది తేలనుంది. తమిళనాడులో డీఎంకే ఆధిపత్యం కొనసాగుతుందా లేక విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభావం చూపుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.  

Featured post

‘మెయిన్ వాపస్ ఆవుంగా’ ట్రోల్స్‌కు ఆస్కార్ విజేత అదిరిపోయే కౌంటర్!

నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్‌.. రెహమాన్‌కు మద్దతుగా నిలుస్తున్న అభిమానులు! ప్రముఖ దర్శకుడు ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన తాజా పీరియడ్ లవ్ స్ట...