Tuesday, 12 May 2026

ఇరాన్‌పై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రహస్య దాడులు


  • పశ్చిమాసియా యుద్ధంలో యూఏఈ అనూహ్య అడుగుపై వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడి!



దుబాయ్‌:పశ్చిమాసియాలో కొనసాగుతున్న భీకర యుద్ధం మధ్య ఒక దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.  కొన్ని నెలలుగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఘర్షణల తరుణంలో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ అత్యంత రహస్యంగా ఇరాన్ భూభాగంపై సైనిక దాడులు నిర్వహించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్  తన కథనంలో వెల్లడించింది. సాధారణంగా ఇటువంటి ప్రాంతీయ సంక్షోభాల్లో తటస్థంగా ఉండేందుకు లేదా దౌత్యపరమైన పరిష్కారాలకే మొగ్గుచూపే యూఏఈ, ఈసారి నేరుగా ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగడం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో పెను సంచలనంగా మారింది. ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపుల నుంచి తమ దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందన్న ఆందోళనల నేపథ్యంలోనే, ఎమిరేట్స్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ రహస్య దాడులు ప్రధానంగా ఇరాన్‌లోని వ్యూహాత్మక స్థావరాలు , సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నాయని నివేదిక పేర్కొంది. ఇప్పటివరకు బహిరంగంగా ఇరాన్‌ను నేరుగా ఢీకొనడానికి వెనుకడుగు వేసిన అరబ్ దేశాలు, ఇప్పుడు తమ రక్షణ వ్యూహాలను మార్చుకున్నట్లు ఈ పరిణామం సూచిస్తోంది. అయితే ఈ దాడులపై యూఏఈ ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రభావానికి అడ్డుకట్ట వేయాలని భావిస్తున్న అగ్రరాజ్యాల మద్దతు కూడా ఈ చర్యల వెనుక ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామంతో అటు గల్ఫ్ దేశాలకు, ఇటు ఇరాన్‌కు మధ్య సంబంధాలు మరింత క్షీణించే అవకాశం ఉందని, ఇది మొత్తం పశ్చిమ ఆసియాలో పెను రాజకీయ మార్పులకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

No comments:

Post a Comment

Featured post

హార్ముజ్ జలసంధి పరిధిని పెంచిన ఇరాన్

500 కిలోమీటర్ల మేర 'ఆపరేషనల్ జోన్'గా ప్రకటన అంతర్జాతీయ నౌకాయానానికి ఐఆర్జీసీ కొత్త సవాల్ టెహ్రాన్‌: ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలక...