Showing posts with label and #CongressAgainstSIR.. Show all posts
Showing posts with label and #CongressAgainstSIR.. Show all posts

Saturday, 29 November 2025

'ఎస్ఐఆర్'పై ప్రజలు మొదటిసారి భయపడుతున్నారు




  •  కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ 


జైపూర్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్‌) పై కాంగ్రెస్ పార్టీ నాయకుడు సచిన్ పైలట్ మాట్లాడుతూ... దేశంలో ఎస్ఐఆర్ ఇంతకుముందు చాలాసార్లు జరిగింది, కానీ అప్పుడు ప్రజల మనస్సుల్లో ఎలాంటి చర్చ లేదా భయం ఉండేది కాదు. "కానీ, మొదటిసారిగా, ప్రజలు దీనిపై ఆందోళన చెందుతున్నారు" అని ఆయన అన్నారు. బిహార్‌లో లక్షలాదిమంది పేర్లు తొలగించబడ్డాయి. ప్రస్తుతం జరుగుతున్న ఈ ప్రక్రియకు ప్రజలకు చాలా తక్కువ సమయం ఇచ్చారని అన్నారు.  అనేక రాష్ట్రాల్లో బీఎల్ఓలు ( బూత్ లెవెల్ ఆఫీసర్స్) ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరికొందరు ఫిర్యాదు చేస్తున్నారు; వారు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఒక నిష్పాక్షిక సంస్థ  వలె పనిచేయాలని పైలట్ విజ్ఞప్తి చేశారు. ఏ ఒక్క ఓటరు కూడా తమ ఓటు హక్కును కోల్పోకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ఆయన తెలిపారు.

Featured post

ఓట్ల తొలగింపుపై అఖిలేశ్ యాదవ్ తీవ్ర ఆగ్రహం.. ఈసీ తీరుపై ప్రశ్నల వర్షం!

  లక్నో: ఓటర్ల జాబితా నుంచి ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారంటూ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ ఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయి...