Showing posts with label #DonaldTrump #GeorgeClooney #AmalClooney #FranceCitizenship #USPolitics #HollywoodNews #TrumpVsClooney #InternationalNews #TeluguNews. Show all posts
Showing posts with label #DonaldTrump #GeorgeClooney #AmalClooney #FranceCitizenship #USPolitics #HollywoodNews #TrumpVsClooney #InternationalNews #TeluguNews. Show all posts

Wednesday, 31 December 2025

జార్జ్ క్లూనీ దంపతులపై ట్రంప్ తీవ్ర విమర్శలు



  • ఫ్రెంచ్ పౌరసత్వం తీసుకోవడమే కారణం!

వాషింగ్టన్: ప్రముఖ హాలీవుడ్ నటుడు జార్జ్ క్లూనీ, ఆయన భార్య, మానవ హక్కుల న్యాయవాది అమల్ క్లూనీ అమెరికాను వీడి ఫ్రెంచ్ పౌరసత్వాన్ని స్వీకరించాలని నిర్ణయించుకోవడంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. వారిని "అత్యంత చెత్త రాజకీయ జోస్యులు"  అంటూ విమర్శించారు.గత ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా క్లూనీ దంపతులు గళమెత్తారు. ప్రస్తుతం వారు అమెరికా పౌరసత్వాన్ని వదులుకుని ఫ్రాన్స్‌కు వెళ్లాలని నిర్ణయించుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. క్లూనీ దంపతులకు రాజకీయాల పట్ల కనీస అవగాహన లేదని, వారు అంచనా వేసిన రాజకీయ పరిణామాలు ఎప్పుడూ నిజం కాలేదని ట్రంప్ ఎద్దేవా చేశారు. వారు దేశం విడిచి వెళ్లడం పెద్ద విషయమేమీ కాదని ఆయన వ్యాఖ్యానించారు.వ్యక్తిగత కారణాలతో పాటు, ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో వారు ఫ్రాన్స్‌లో స్థిరపడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. క్లూనీ దంపతులు గతంలో డెమొక్రాటిక్ పార్టీకి మద్దతుగా నిలవడమే కాకుండా, బైడెన్ ప్రచారానికి భారీగా నిధులు కూడా సేకరించారు. ఇప్పుడు వారు దేశం దాటడంపై ట్రంప్ వర్గం సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తోంది.



Featured post

ఓట్ల తొలగింపుపై అఖిలేశ్ యాదవ్ తీవ్ర ఆగ్రహం.. ఈసీ తీరుపై ప్రశ్నల వర్షం!

  లక్నో: ఓటర్ల జాబితా నుంచి ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారంటూ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ ఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయి...