Tuesday, 6 October 2026

ఎన్నికల సంఘంతో చర్చలకే వస్తే ఎందుకు భయం?



  • ఈసీ తీరుపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం


న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం (ECI) పనితీరుపై నిరసన వ్యక్తంచేస్తూ విపక్షాలు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆకాశవాణి భవన్ పరిసర ప్రాంతాల్లో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఉభయ సభలకు చెందిన వందలాది మంది విపక్ష ఎంపీలు పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే భద్రతా కారణాల రీత్యా పోలీసులు వారిని ఆకాశవాణి భవన్ వద్దే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అక్కడే మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌తో పాటు ఇతర కమిషనర్లను కలిసేందుకే తాము వచ్చామని స్పష్టం చేశారు. "మేము కేవలం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, మిగతా ఇద్దరు ఈసీలను కలవాలనుకుంటున్నాము. లోక్‌సభ, రాజ్యసభలకు చెందిన మేమంతా ప్రతిపక్ష ఎంపీలము.. కేవలం వారితో మాట్లాడాలని మాత్రమే అనుకుంటున్నాము. అసలు ఎన్నికల సంఘం ఎందుకు మాతో మాట్లాడటానికి ఇష్టపడట్లేదో నాకు అర్థం కావడం లేదు. కోట్లాది మంది ప్రజలు మాకు ఓట్లు వేసి గెలిపించారు. కాబట్టి మేము కేవలం ఎన్నికల కమిషనర్లను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాము.. కానీ వారు మాత్రం మాకు సమాధానాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు" అని రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.



No comments:

Post a Comment

Featured post

అయోధ్య నుంచి పోటీ చేయండి

యోగి ఆదిత్యనాథ్‌కు అఖిలేశ్‌ యాదవ్‌ సవాల్‌ త్వరలో రామ మందిరానికి ఎస్పీ నేతలతో కలిసి వెళ్తా: ఎస్పీ అధినేత  న్యూఢిల్లీ, అక్టోబర్‌ 8: ఉత్తరప్రదే...