Showing posts with label Tejaswi yadav. Show all posts
Showing posts with label Tejaswi yadav. Show all posts

Tuesday, 14 October 2025

ఎన్నికల్లో పోటీ చేయనన్న పీకే




పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో జన సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో (బిహార్ ఎన్నికలు) వ్యక్తిగతంగా పోటీ చేయకుండా ఉంటానని ప్రకటించారు. ఈ విషయాన్ని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. పార్టీ కోసం ఎన్నికల పనుల్లో నేను పాల్గొంటాను.. కానీ తాను పోటీ చేయనని పీకే (ప్రశాంత్ కిశోర్) తెలిపారు.‘‘ఈ అసెంబ్లీ ఎన్నికల్లో (బిహార్ అసెంబ్లీ ఎన్నికలు) నేను పోటీ చేయకూడదని పార్టీ నిర్ణయించింది. దానికి నేను పూర్తిగా కట్టుబడి ఉన్నాను. దీంతో రాఘోపుర్‌లో తేజస్వీ యాదవ్‌పై పోటీ చేసే మరో అభ్యర్థిని ప్రకటించాం. పార్టీ ప్రయోజనాల కోసమే నేను పోటీకి దూరంగా ఉంటున్నాను. ఒకవేళ నేను పోటీలో ఉంటే.. పార్టీ సంస్థాగత కార్యకలాపాల నుంచి నా దృష్టి మళ్లిపోయే అవకాశం ఉంది’’ అని ప్రశాంత్ కిశోర్ 


ఇక, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జన సురాజ్ పార్టీ దాదాపు 150 సీట్లలో విజయం సాధిస్తుందని పీకే విశ్వాసం వ్యక్తం చేశారు. అప్పుడు తమ పార్టీ దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతుందని చెప్పారు. ఒకవేళ ఎన్నికల్లో హంగ్ ఏర్పడితే జన సురాజ్ పార్టీ ఏ కూటమికి మద్దతిస్తుందన్న ప్రశ్నకు.. పీకే బదులిస్తూ ‘అది అసాధ్యం’ అని పేర్కొన్నారు.నీతీశ్ మళ్లీ సీఎం కాలేరు..

ఈ సందర్భంగా బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌పై ప్రశాంత్ కిశోర్ విమర్శలు గుప్పించారు. ‘‘వచ్చే ఎన్నికల్లో జేడీయూకు కనీసం 25 సీట్లు కూడా రాకపోవచ్చు. ఎన్డీఏకు ఓటమి తప్పదు. నీతీశ్ కుమార్ మళ్లీ సీఎం కాలేరు. అటు ఇండియా కూటమి పరిస్థితి కూడా అంత బాగా లేదు. కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి’’ అని పీకే ఆరోపించారు.తమ పార్టీ అధికారంలోకి వస్తే మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నెల రోజుల్లోనే 100 మంది అవినీతి రాజకీయ నేతలు, అధికారులను గుర్తించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బిహార్‌లో వచ్చే నెల 6, 11 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. నవంబరు 14న ఫలితాలు వెల్లడికానున్నాయి.


Featured post

ఓట్ల తొలగింపుపై అఖిలేశ్ యాదవ్ తీవ్ర ఆగ్రహం.. ఈసీ తీరుపై ప్రశ్నల వర్షం!

  లక్నో: ఓటర్ల జాబితా నుంచి ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారంటూ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ ఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయి...