Showing posts with label #TamilNaduPolitics #VijayTVK #Congress #DMK #TamilNaduElection2026 #PoliticalShift #VijayAsCM #INDIAAlliance #TamilNews #BreakingNews. Show all posts
Showing posts with label #TamilNaduPolitics #VijayTVK #Congress #DMK #TamilNaduElection2026 #PoliticalShift #VijayAsCM #INDIAAlliance #TamilNews #BreakingNews. Show all posts

Wednesday, 6 May 2026

తమిళనాట డీఎంకేకు కాంగ్రెస్ హ్యాండ్

 

  • 'మతతత్వ శక్తులను' అడ్డుకునేందుకు విజయ్ పార్టీకి బేషరతు మద్దతు
  • కొత్త సమీకరణాలతో మారుతున్న రాజకీయ ముఖచిత్రం



తమిళనాడు ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. దశాబ్దాలుగా డీఎంకేతో ఉన్న తన చిరకాల మైత్రిని కాంగ్రెస్ పార్టీ తెంచుకుంటూ సంచలన నిర్ణయం తీసుకుంది. మతతత్వ శక్తులు రాష్ట్రంలో పాగా వేయకుండా అడ్డుకోవడమే తమ ప్రథమ లక్ష్యమని పేర్కొంటూ, నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీకి కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. అయితే ఈ మద్దతుకు కాంగ్రెస్ కొన్ని షరతులను విధించింది. ముఖ్యంగా సెక్యులర్ విలువలకు కట్టుబడి ఉండాలని, బీజేపీ వంటి శక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ చోటు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. లోక్‌సభ, రాజ్యసభ, స్థానిక ఎన్నికల్లోనూ టీవీకేతో కలిసి పని చేస్తామని కాంగ్రెస్‌ తన లేఖలో వెల్లడించింది.ఈ నిర్ణయం డీఎంకేకు పెద్ద షాక్ ఇవ్వడమే కాకుండా, రాష్ట్రంలో ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి గండి కొట్టేలా కనిపిస్తోంది.



ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీ టీవీకేకు లేకపోవడంతో, కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం విజయ్ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించడానికి కీలకం కానున్నది. డీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు విజయ్‌తో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఒకవేళ విజయ్ ఈ షరతులకు అంగీకరిస్తే, తమిళనాడులో సరికొత్త కూటమి ప్రభుత్వం కొలువుదీరనున్నది. అటు అన్నాడీఎంకే కూడా విజయ్‌కు బయటి నుంచి మద్దతు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం తమిళనాడు రాజకీయాల్లో డీఎంకేను ఒంటరిని చేయడమే కాకుండా, విజయ్ రాజకీయ భవిష్యత్తుకు బలమైన పునాది వేసింది.

Featured post

అమెరికా మిడ్‌టర్మ్‌ ఎన్నికల్లో భారత సంతతి నేతల సత్తా.. పియా దాండియా చరిత్ర

డెమోక్రాట్ల తరఫున సుహాస్‌ సుబ్రహ్మణ్యం, అరుణా మిల్లర్‌, పియా దాండియా విజయం ఫ్లోరిడా నుంచి దిగువసభకు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్‌గా పియా రి...