Showing posts with label #ManmohanSingh #Congress #DeathAnniversary #RTI #MGNREGA #IndianEconomy #Tribute #FormerPM #NationalLeader #IndiaRemembers. Show all posts
Showing posts with label #ManmohanSingh #Congress #DeathAnniversary #RTI #MGNREGA #IndianEconomy #Tribute #FormerPM #NationalLeader #IndiaRemembers. Show all posts

Thursday, 25 December 2025

దేశ ఆర్థిక గమనాన్ని మార్చిన మేధావికి కాంగ్రెస్ నివాళులు


  • మన్మోహన్ సింగ్ ప్రథమ వర్ధంతి 


న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రథమ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్నారు. గతేడాది డిసెంబర్ 26న 92 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన సంస్మరణార్థం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. మన్మోహన్ సింగ్ నాయకత్వం భారతదేశ ఆర్థిక వ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిందని కొనియాడింది.



2005లో సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) ద్వారా ప్రభుత్వ పాలనలో మన్మోహన్ సింగ్ పారదర్శకతను తీసుకొచ్చారని కాంగ్రెస్ పేర్కొంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) ద్వారా పేదల పని హక్కును, గౌరవాన్ని ఆయన కాపాడారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గుర్తు చేసుకున్నారు. 1991లో ఆర్థిక మంత్రిగా దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కించడంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నివాళులర్పించారు. 2004 నుంచి 2014 వరకు పదేళ్ల పాటు ప్రధానమంనిగా పనిచేసిన మన్మోహన్ సింగ్, రాజకీయాలకు అతీతంగా దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చిన నిరాడంబర నాయకుడిగా భారతీయుల గుండెల్లో నిలిచిపోయారు.

Featured post

ఓట్ల తొలగింపుపై అఖిలేశ్ యాదవ్ తీవ్ర ఆగ్రహం.. ఈసీ తీరుపై ప్రశ్నల వర్షం!

  లక్నో: ఓటర్ల జాబితా నుంచి ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారంటూ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ ఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయి...