Friday, 2 October 2026

మీ ధైర్యం ఎన్నో ప్రాణాలను కాపాడింది



  • ఫ్లై దుబాయ్‌ కెప్టెన్‌తో మోడీ వీడియో కాల్‌


న్యూఢిల్లీ: ఫ్లై దుబాయ్‌ విమాన కెప్టెన్‌ స్మిత్‌ మచ్ఛర్‌తో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాల్‌లో మాట్లాడారు. క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యం, సమయస్ఫూర్తి, సంయమనం ప్రదర్శించి ఎంతోమంది ప్రాణాలను కాపాడినందుకు కెప్టెన్‌ను ప్రధాని అభినందించారు. ఈ సందర్భంగా కెప్టెన్‌ స్మిత్‌తో ప్రధాని మోడీ  మాట్లాడుతూ.. ‘‘దేశం మొత్తం మీ కోసం ప్రార్థిస్తోంది. మీ ఆరోగ్యం కోసం మహా మృత్యుంజయ జపం చేస్తున్నారు. మీరు ప్రదర్శించిన ధైర్యం, సమయస్ఫూర్తి, సంయమనం ఎంతోమంది ప్రాణాలను కాపాడాయి’’ అని అన్నారు. కెప్టెన్‌ స్మిత్‌ చూపిన ధైర్యాన్ని దేశం గర్వంగా చెప్పుకునే విధంగా ఉందని మోడీ పేర్కొన్నారు.‘‘భారతీయులు ఇతరుల ప్రాణాలను తీసేవారు కాదు.. ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు సిద్ధపడే వారు అని దేశం గర్వంగా చెప్పుకోగలదు’’ అని ప్రధాని అన్నారు.కష్టసమయంలో కెప్టెన్‌ స్మిత్‌ ప్రదర్శించిన ధైర్యం, అప్రమత్తత, సమయస్ఫూర్తిని ప్రధాని ప్రత్యేకంగా ప్రశంసించారు.


"బాధ కలిగినప్పుడల్లా హనుమాన్ చాలీసా చదువుతా: కెప్టెన్ స్మిత్ మచ్చర్


ఫ్లైదుబాయ్ విమానంలో తనపై జరిగిన ప్రాణాంతక దాడిని, ఆ క్లిష్ట సమయంలో తాను ఎదుర్కొన్న పరిస్థితులను భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పంచుకున్నారు. ప్రధాని మోదీతో వీడియో కాల్‌లో మాట్లాడిన ఆయన.. ఆ సంక్షోభ సమయంలో తాను పూర్తిగా హనుమాన్ చాలీసా పఠనంలోనే ఉన్నానని భావోద్వేగంతో తెలిపారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీతో కెప్టెన్ స్మిత్ మాట్లాడుతూ.. "నాకు ఎప్పుడైనా తీవ్రమైన బాధ లేదా కష్టం కలిగినప్పుడు హనుమాన్ చాలీసా చదువుతాను. ఆ భయానక సమయంలో కూడా నేను కేవలం హనుమాన్ చాలీసాని మాత్రమే జపించాను. తీవ్ర గాయాలపాలై ప్రాణాల కోసం పోరాడుతున్న తరుణంలో.. నేను ఇప్పుడే ఓడిపోకూడదని, లేస్తేనే అందరి ప్రాణాలను కాపాడగలనని నానికి నేనే ధైర్యం చెప్పుకున్నాను. నేడు మీ నుంచి వచ్చిన ఒక్క ఫోన్ కాల్ నాకు ఎంతో గర్వకారణంగా అనిపిస్తోంది" అని పేర్కొన్నారు

No comments:

Post a Comment

Featured post

మీ ధైర్యం ఎన్నో ప్రాణాలను కాపాడింది

ఫ్లై దుబాయ్‌ కెప్టెన్‌తో మోడీ వీడియో కాల్‌ న్యూఢిల్లీ: ఫ్లై దుబాయ్‌ విమాన కెప్టెన్‌ స్మిత్‌ మచ్ఛర్‌తో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాల్‌లో మా...