తెలంగాణలో కొన్ని ఆంధ్ర న్యూస్ చానళ్లు ఒక వర్గంపై వివక్షతో వ్యవహరిస్తున్నాయని బీఎస్పీ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు 100 శాతం నిజమని పేర్కొంటూ.. బలమైన రాజకీయ అండ లేకుండా ఆ చానళ్లు ఇంతగా వ్యవహరించలేవని అన్నారు.
తనను, తన పిల్లలను బహిరంగంగా అవమానించారంటూ తాను దాఖలు చేసిన కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు ఇప్పటివరకు ‘మహా న్యూస్’ వంశీని అరెస్టు చేయలేదని ఆరోపించారు. ఈ వ్యవహారంలో సీఎంవో ఆదేశాలున్నాయని కింది స్థాయి పోలీసులు చెబుతున్నారని పేర్కొన్నారు.
తన కేసు ఫైల్‌ను నార్సింగి నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు పంపించేందుకే నెల రోజులు పట్టిందని, తన వాంగ్మూలాన్ని నమోదు చేయాలని పలుమార్లు కోరిన తర్వాతే ఎస్సైని పంపించారని విమర్శించారు. కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేయడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందని ప్రశ్నించారు.
“అన్నీ రికార్డు అవుతున్నాయి.. తర్వాత సారీ అంటే కుదరదు” అంటూ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.