Thursday, 6 August 2026

అప్రోప్రియేషన్ బిల్లుకు గ్రీన్ సిగ్నల్



  • రూ.54 వేల కోట్ల అదనపు వ్యయానికి పార్లమెంట్ ఆమోదం


2026 అప్రోప్రియేషన్ (నెం.3) బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును చర్చ అనంతరం రాజ్యసభ కూడా ఆమోదించి తిరిగి లోక్‌సభకు పంపింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మంజూరైన నిధులను మించి జరిగిన ఖర్చులకు భారత సమీకృత నిధి నుంచి నిధులు వినియోగించేందుకు ఈ బిల్లు అనుమతి ఇస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.54 వేల కోట్లకు పైగా అదనపు నిధులను కోరింది. ఇందులో రైల్వే శాఖకు సంబంధించిన రూ.196 కోట్ల అదనపు వ్యయంతో పాటు రూ.53,871 కోట్ల రుణాల చెల్లింపులకు వినియోగించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ అదనపు వ్యయాలను ప్రజా లెక్కల సంఘం నివేదిక ఆధారంగా పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చామని ఆమె వివరించారు.



No comments:

Post a Comment

Featured post

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్

దానం నాగేందర్ సంచలన నిర్ణయం హైదరాబాద్:తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో తనపై అనర్హత వేటు వేస్...