- కేరళ కౌముది 115వ వార్షికోత్సవంలో సీపీ రాధాకృష్ణన్
- శతాబ్దానికిపైగా నైతిక విలువలతో సేవలందించడంపై అభినందనలు
అలప్పుజ, ఆగస్టు 30: జర్నలిజంలో విశ్వసనీయతే ప్రధాన నైతిక విలువ అని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు. కేరళలోని అలప్పుజలో ‘కేరళ కౌముది’ పత్రిక 115వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
శతాబ్దానికి పైగా జర్నలిజం రంగంలో నైతిక విలువలను వదులుకోకుండా సేవలందిస్తున్న కేరళ కౌముది యాజమాన్యాన్ని, సిబ్బందిని ఉపరాష్ట్రపతి అభినందించారు. కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, మంత్రి రోజీ ఎం. జాన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
రెండు రోజుల పర్యటన కోసం కొచ్చికి చేరుకున్న ఉపరాష్ట్రపతికి గవర్నర్ స్వాగతం పలికారు. అనంతరం అరన్ముల పడవ పందేలను ఆయన ప్రారంభించనున్నారు. తిరువనంతపురంలో జరుగుతున్న ఓనం టూరిజం వీక్ వేడుకల ముగింపు భారీ ఊరేగింపును కూడా ఆయన జెండా ఊపి ప్రారంభిస్తారు.

No comments:
Post a Comment