- 1.5 లక్షల ఉద్యోగాలతో బయోఎనర్జీకి భారీ ఊతం
దేశంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) ఉత్పత్తిని విస్తరించేందుకు రూ.23,731 కోట్ల వ్యయంతో ‘గోబర్‌ధన్’ జాతీయ సర్క్యులర్ బయోఎనర్జీ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2026-27 నుంచి 2035-36 వరకు అమలయ్యే ఈ పథకం ద్వారా దేశంలో సుమారు 1.5 లక్షల ఉద్యోగాలు సృష్టించడంతో పాటు వ్యవసాయ అవశేషాలు, పశువుల పేడ, మున్సిపల్ సేంద్రియ వ్యర్థాలను స్వచ్ఛ ఇంధనంగా మార్చే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. దేశీయ సీబీజీ ఉత్పత్తిని దాదాపు పది రెట్లు పెంచడంతో పాటు భారీ ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించనుంది. ఇదే సమావేశంలో అసోంలోని బైహాటా చారియాలి నుంచి తేజ్‌పూర్ వరకు 135.87 కి.మీ. పొడవైన నాలుగు లేన్ల జాతీయ రహదారి నిర్మాణానికి రూ.8,970 కోట్ల ప్రాజెక్టును కూడా ఆమోదించారు. ఈ ప్రాజెక్టుతో ప్రయాణ సమయం సగానికి తగ్గి, రహదారి భద్రత, ఇంధన సామర్థ్యం మెరుగుపడనున్నాయి.
No comments:
Post a Comment