- ‘మెకానికల్ పాస్’ లేదన్న కేంద్రం
జాతీయ రహదారుల టోల్ ప్లాజాల్లో వినియోగదారుల రుసుములు పూర్తిగా నిబంధనల ప్రకారమే వసూలు చేస్తున్నామని కేంద్ర రహదారుల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఆయన మాట్లాడుతూ వాణిజ్య వాహనాలకు ‘మెకానికల్ పాస్’ పేరుతో ఎలాంటి పాస్ జారీ చేయడం లేదని, అలాంటి అక్రమ వసూళ్లు జరుగుతున్న జాతీయ రహదారి భాగం ఏదీ గుర్తించలేదని తెలిపారు. టోల్ వసూళ్లలో పారదర్శకత కోసం ఎన్‌హెచ్‌ఏఐ ప్రత్యేక ప్రామాణిక విధానాలు అమలు చేస్తోందని, నగదు, ఫాస్‌ట్యాగ్ లావాదేవీలన్నీ టోల్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్ ద్వారానే జరుగుతున్నాయని వెల్లడించారు.
No comments:
Post a Comment