Thursday, 13 August 2026

భూ కేటాయింపులపై బీఆర్‌ఎస్‌ రాజకీయం చేస్తోంది

 


  • ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి

టెస్సరాక్ట్‌ సంస్థకు భూముల కేటాయింపుపై బీఆర్‌ఎస్‌ రాజకీయ ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. దిల్లీలో కాంగ్రెస్‌ ఎంపీలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌లో 54 కంపెనీలకు ఎకరాకు రూ.30 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు భూములు కేటాయించారని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 8 కంపెనీలకు ఎకరాకు రూ.1.50 కోట్ల చొప్పున భూములు కేటాయించినట్లు చెప్పారు. టెస్సరాక్ట్‌ సంస్థ 2024లో ఐదు ఎకరాల కోసం దరఖాస్తు చేసుకోగా, ఏడాది పాటు పరిశీలించిన అనంతరం 2025లో భూమి కేటాయించామని చామల వివరించారు. ఇతర కంపెనీలకు వర్తించిన విధంగానే టెస్సరాక్ట్‌కు కూడా ఎకరాకు రూ.1.50 కోట్ల ధర నిర్ణయించినట్లు తెలిపారు.


No comments:

Post a Comment

Featured post

మోడీ, అమిత్ షా రాజీనామా చేసేవరకు నిద్రపోనివ్వం

బీజేపీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలు రాజీనామా చేసేవరకు వారిని నిద్రపోనివ్వమని, దేశ ప్రజ...