Tuesday, 18 August 2026

ఇమ్రాన్‌ ఖాన్‌కు భారీ ఊరట.. ఆస్పత్రికి తరలించాలని పాక్‌ సుప్రీంకోర్టు ఆదేశం




ఇస్లామాబాద్‌: జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోగ్యం క్షీణిస్తుండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించాలని పాకిస్థాన్‌ సుప్రీంకోర్టు ప్రభుత్వ అధికారులను ఆదేశించింది. ఇమ్రాన్‌ వైద్య నివేదికలు, కుటుంబ సభ్యులు, పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ నేతల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆయన పూర్తిగా కోలుకునే వరకు ప్రైవేట్‌ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించాలని పీటీఐ ప్రతినిధి జుల్ఫికర్‌ బుఖారీ కోరారు.


ఇమ్రాన్‌ ఆరోగ్యంపై మాజీ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. మూడేళ్ల జైలు జీవితం, ఒంటరితనం కారణంగా ఆయన తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొన్నారు. మరోవైపు ఇమ్రాన్‌ ఖాన్‌ను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ పీటీఐ కార్యకర్తలు, మద్దతుదారులు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. తోషాఖానా, అల్‌-ఖాదిర్‌ ట్రస్ట్‌ తదితర కేసుల్లో శిక్ష పడటంతో ఇమ్రాన్‌ ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్నారు.

No comments:

Post a Comment

Featured post

మీ ధైర్యం ఎన్నో ప్రాణాలను కాపాడింది

ఫ్లై దుబాయ్‌ కెప్టెన్‌తో మోడీ వీడియో కాల్‌ న్యూఢిల్లీ: ఫ్లై దుబాయ్‌ విమాన కెప్టెన్‌ స్మిత్‌ మచ్ఛర్‌తో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాల్‌లో మా...