Tuesday, 25 August 2026

సీఎం అమెరికా పర్యటనకు అనుమతి ఎందుకు నిరాకరించారు?: శ్రీధర్‌బాబు





హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడంపై రాష్ట్ర మంత్రి డి. శ్రీధర్‌బాబు ప్రశ్నలు సంధించారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వివిధ కార్యక్రమాల కోసం అమెరికా వెళ్లేందుకు అనుమతులు ఇస్తున్నప్పుడు.. తెలంగాణ ముఖ్యమంత్రికి మాత్రమే ఎందుకు అనుమతి నిరాకరించారని ప్రశ్నించారు. ‘‘మనం భారతదేశంలోనే నివసిస్తున్నాం కదా? భారత సమాఖ్యలో తెలంగాణ భాగం కాదా? ఈ వివక్ష ఎందుకు?’’ అని శ్రీధర్‌బాబు నిలదీశారు. ఇతర ముఖ్యమంత్రుల అమెరికా పర్యటనలకు విదేశాంగ శాఖ అనుమతులు ఇస్తున్నప్పుడు.. తెలంగాణ సీఎంకు మాత్రం ఎందుకు నిరాకరించిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు.ఇది కేవలం తాము అడుగుతున్న ప్రశ్న మాత్రమేనని, భారత్‌ సమాఖ్య వ్యవస్థ కలిగిన దేశమని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Featured post

దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది

 ఢిల్లీలో నిరసనకారులపై భారీగా పోలీసు బలగాలను మోహరించడమే దీనికి నిదర్శనం మండిపడిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  బెంగళూరు: ప్...