- 19 లక్షల మందికి జీరో విద్యుత్ బిల్లు
ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కింద దేశవ్యాప్తంగా లబ్ధిదారుల సంఖ్య 50 లక్షలు దాటిందని కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సీఐఐ అంతర్జాతీయ ఇంధన సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం 19 లక్షల కుటుంబాలు జీరో విద్యుత్ బిల్లుతో ప్రయోజనం పొందుతున్నాయని వెల్లడించారు. అదనంగా ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను విక్రయించి 12 లక్షలకుపైగా కుటుంబాలు రూ.421 కోట్ల ఆదాయం సంపాదించాయని తెలిపారు. 2030 నాటికి 500 గిగావాట్ల నాన్-ఫాసిల్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని దేశం చేరుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత తొమ్మిది నెలల్లో రోజువారీ రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్లు 5 వేల నుంచి 16 వేలకుపైగా పెరిగినట్లు వెల్లడించారు.
No comments:
Post a Comment