Thursday, 6 August 2026

జాతీయ చేనేత దినోత్సవానికి రాష్ట్రపతి


  • 22 మంది చేనేత కళాకారులకు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందించనున్న ముర్ము



భారత చేనేత వైభవాన్ని ఘనంగా చాటిచెప్పే 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని శుక్రవారం రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఘనంగా నిర్వహించనున్నది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకానుండగా, కేంద్ర జౌళి మంత్రి గిరిరాజ్ సింగ్, సహాయ మంత్రి పవిత్ర మార్గెరిటా పాల్గొననున్నారు. దేశ చేనేత సంపదను, చేనేత కార్మికుల సృజనాత్మకతను, భారత సాంస్కృతిక, ఆర్థికాభివృద్ధికి వారి సేవలను గుర్తించి సత్కరించడమే ఈ వేడుక ప్రధాన ఉద్దేశమని కేంద్ర జౌళి శాఖ తెలిపింది. ఈ సందర్భంగా 2025 సంవత్సరానికి గాను మూడు సంత్ కబీర్ చేనేత అవార్డులు, 19 జాతీయ చేనేత అవార్డులు కలిపి మొత్తం 22 మంది చేనేత కళాకారులకు ప్రదానం చేయనున్నారు. అలాగే భారత చేనేత సంప్రదాయాన్ని ప్రతిబింబించే నాలుగు ప్రత్యేక తపాలా బిళ్లలను విడుదల చేయడంతో పాటు ‘Earth. Root. Thread’, ‘Handloom Awards Book 2025’ పుస్తకాలను ఆవిష్కరించనున్నారు.

No comments:

Post a Comment

Featured post

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్

దానం నాగేందర్ సంచలన నిర్ణయం హైదరాబాద్:తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో తనపై అనర్హత వేటు వేస్...