Showing posts with label BJP MP Etela Rajender. Show all posts
Showing posts with label BJP MP Etela Rajender. Show all posts

Saturday, 19 July 2025

మొన్న రాజాసింగ్‌.. నేడు ఈటల రాజేందర్‌

 



2028లో అధికారంలోకి వస్తామని అంటున్న బీజేపీలో నేతల మధ్య అంతర్యుద్ధం తారాస్థాయికి చేరింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నామినేషన్‌ వేయడానికి అనుమతించలేదన్న కారణంతో పార్టీ అధిష్ఠానంపై ఘాటు వ్యాఖ్యలు చేసి రాజీనామా చేసిన రాజాసింగ్‌ ను బైటికి వెళ్లడానికి అనుమతించారు. పార్టీ హైకమాండ్‌ రాజాసింగ్‌ రాజీనామాను ఆమోదించి ఆయనకు షాక్‌ ఇచ్చింది. ఈ వివాదాం సమసిపోక ముందే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ల మధ్య విభేదాలు ఇవాళ బహిర్గతమయ్యాయి. 

హుజురాబాద్‌లో తనకు మెజారిటీ తక్కువ రావడానికి ఈటల వర్గమే కారణమని కేంద్ర మంత్రి ఆరోపించడం. అలాంటి వారికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా టికెట్లు ఇవ్వమంటారని బండి పెద్ద బాంబ్‌ పేల్చారు. నేడు హుజురాబాద్‌ కార్యకర్తలు శామీర్‌పేటలోని ఈటల రాజేందర్‌ ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌పై ఈటల ఫైర్‌ అయ్యారు. ఆయన పేరు ప్రస్తావించకుండానే తన స్థాయి ఏమిటో చెప్పారు. బీ కేర్‌ ఫుల్‌ నా కొడకా అని హెచ్చరించారు. వాడెవడో సైకోనా, శాడిస్టా అని ఆయన పేరు ప్రస్తావించకుండానే ఘాటుగా  వ్యాఖ్యానించారు. కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకోను అని విరుచుకుపడ్డారు. 

హుజురాబాద్ అంటే నా కుటుంబం. నాయకుడు ప్రజలు కుటుంబంలాగ కల్చర్ మనది. సోషల్ మీడియా నమ్ముకొని, అబద్దాల పునాదుల మీద బతికే కుట్రలు కుతంత్రాల మీద కొంతమంది బతుకుతున్నారు.నాది స్ట్రెయిట్ ఫైట్, స్ట్రీట్ ఫైట్ ఉండదు. ధీరుడుతో కోట్లాడతాం.. కుట్రదారులతో కాదు. ఈ కుట్రలు ఛేదించే సత్తా ప్రజలకే ఉంటుంది మనం చిన్నవాళ్ళం. నేను బేజాప్తా కాదు బాజప్తా యుద్ధం చేసేవాడిని.చరిత్ర లేకుండా వర్తమానం లేదు. వర్తమానం లేనిది భవిష్యత్తు లేదు.స్వేచ్ఛ కోసం బానిస సంకెళ్లు బద్దలు కొట్టడం కోసం ఉరికంబాలు ఎక్కారు, తూటాలకు బలయ్యారు. వారు అందించిన ఫలాలలోనే మనం జీవిస్తున్నాం.కొంతమంది వెకిలిగాళ్ళు ఇంకెక్కడ తెలంగాణ ఉద్యమం అంటున్నారు. కానీ హుజురాబాద్ నియోజకవర్గంలో మేము చేసిన ఉద్యమం ఇంకా మా గుండెల్లో ఉంది అన్నారు. 

రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశించిన ఈటలకు నిరాశే ఎదురైంది. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్తు ఏమిటి అనే చర్చ జరిగింది. అయితే ప్రస్తుతానికి ఆయన తన అసంతృప్తిని బాహాటంగా వ్యక్తపరచకపోయినా బండి సంజయ్‌ వ్యాఖ్యల తర్వాత ఈటల ఫైర్‌ అయ్యారు.అయితే అధికారంలోకి వస్తామన్న బీజేపీ సొంత పార్టీలో నేతల మధ్య విభేదాలు ఆపార్టీని కొంపముంచేలా ఉన్నాయని ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు.  ప్రస్తుతం తెలంగాణ బీజేపీ లో జరుగుతున్న పరిణామాలపై పార్టీ అధిష్ఠానం ఎలా స్పందిస్తుంది. నేతల మధ్య సమన్వయం ఎలా సాధిస్తుంది అన్నది చూడాలి. 


Featured post

ఓట్ల తొలగింపుపై అఖిలేశ్ యాదవ్ తీవ్ర ఆగ్రహం.. ఈసీ తీరుపై ప్రశ్నల వర్షం!

  లక్నో: ఓటర్ల జాబితా నుంచి ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారంటూ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ ఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయి...