Showing posts with label #HardeepPuri #EpsteinLinks #ParliamentProtest #OppositionDemand #IndianPolitics #UnionMinister #ResignationDemand #PoliticalControversy. Show all posts
Showing posts with label #HardeepPuri #EpsteinLinks #ParliamentProtest #OppositionDemand #IndianPolitics #UnionMinister #ResignationDemand #PoliticalControversy. Show all posts

Thursday, 12 February 2026

ఎప్‌స్టీన్‌ కేసులో కేంద్ర మంత్రి హర్దీప్ పూరీపై ఆరోపణలు

 


  • రాజీనామా కోసం విపక్షాల నిరసన

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన జెఫ్రీ ఎప్‌స్టీన్‌  కేసు ఫైళ్లలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ పేరు ఉండటంతో రాజకీయంగా పెద్ద దుమారం రేగింది. దీనిపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రశ్నలు లేవనెత్తడంతో, శుక్రవారం పార్లమెంటు సముదాయంలోని మకర్ ద్వార్ వద్ద ప్రతిపక్ష ఎంపీలు తీవ్ర నిరసన ప్రదర్శన నిర్వహించారు. మంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.  ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.  ఎప్‌స్టీన్‌ కేసు ఫైళ్లలో హర్దీప్ పూరీతో పాటు అనిల్ అంబానీ పేర్లు కూడా ఉన్నాయని, ఈ అంశంపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఈ ఆరోపణలను మంత్రి హర్దీప్ పూరీ తోసిపుచ్చారు. హర్దీప్ సింగ్తో తనకున్న పరిచయం ఎనిమిది సంవత్సరాల కిందట దౌత్యపరమైన అధికారిక సమావేశాలకు మాత్రమే పరిమితమని, లైంగిక ఆరోపణలకు తనకు ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను మంత్రి "మూర్ఖత్వం" గా అభివర్ణించారు. ఆయన ఆధారాలు లేని ఆరోపణలు చేయడం అలవాటుగా మార్చుకున్నారని మంత్రి విమర్శించారు.  ఈ వివాదం పార్లమెంటులో ఇరువర్గాల మధ్య వాడివేడి చర్చలకు, గందరగోళానికి దారితీసింది. మంత్రి హర్దీప్ పూరీ స్పష్టత ఇచ్చినప్పటికీ, విపక్షాలు ఈ అంశాన్ని వదిలిపెట్టబోమని సంకేతాలు ఇచ్చాయి.



Featured post

ఓట్ల తొలగింపుపై అఖిలేశ్ యాదవ్ తీవ్ర ఆగ్రహం.. ఈసీ తీరుపై ప్రశ్నల వర్షం!

  లక్నో: ఓటర్ల జాబితా నుంచి ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారంటూ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ ఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయి...