Showing posts with label Namasthe Telangnaa. Show all posts
Showing posts with label Namasthe Telangnaa. Show all posts

Friday, 20 June 2025

థాంక్స్‌ టు ఆల్‌ మై సబ్‌స్క్రైబర్స్‌




అనుకోకుండా వచ్చిన జర్నలిజం వృత్తిలో చాలా విషయాలు నేర్చుకున్నాను. రాయడంలో మెళకువలు చెప్పిన పెద్దలు చాలామంది ఉన్నారు. కొవిడ్‌ సమయంలో ఉద్యోగాన్ని వదిలి కొంతకాలం రెస్ట్‌ తీసుకున్నాను. ఆ సమయంలోనే  నా బ్లాగ్‌ లో నిత్యం నా అభిప్రాయాలు రాసేవాడిని. హుజురాబాద్‌ ఉప ఎన్నిక, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై అనేకం రాసిన. ఆ సమయంలో ఫీల్డ్‌లో ఉండి క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని పట్టుకున్న మా కామెర నవీన్‌, యాకయ్యలు ఇచ్చిన ఇన్ పుట్స్‌ చాలా ఉపయోగపడినాయి. 2018లో 88 సీట్లతో భారీ విజయాన్ని అందుకున్న కేసీఆర్‌కు ఆ ఉప ఎన్నిక ఫలితం కొంత చేదు అనుభవాన్ని మిగిల్చింది. అలా కొంతకాలం గడిచిన తర్వాత తిరిగి మళ్లీ నగరానికి చేరాను. ప్రారంభంలోనే కొన్నిరోజులు నవీన్‌ రూమ్‌ లోనే ఖాళీగా ఉన్న సమయంలోనే మా కట్టా శేఖర్‌ రెడ్డి సార్‌ 'విధాత'లో పనిచేయమని చెప్పాడు. అప్పటికి ఆ  వెబ్‌సైట్‌ రొద్దం శ్రీనివాస్‌ అన్న చూస్తున్నారు. అలాస మళ్లీ సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన. ఆ సమయంలో అనేక ఆర్టికల్స్‌ రాసే అవకాశం లభించింది. 


అలా సాగుతున్న ప్రయాణం సమయంలోనే ఒకరోజు ఎర్రోజు శ్రీనివాస్‌ అన్న తన యూట్యూబ్‌ ఛానల్‌ గురించి చెప్పారు. స్టార్ట్‌ చేసిన తర్వాత కంటెంట్‌ విషయం, వ్యూస్‌, సబ్‌స్క్రైబర్స్‌ వంటి సమాచారం చెప్పారు. నువ్వు కూడా మొదలుపెట్టు. వ్యూస్‌ గురించి పట్టించుకోవద్దు. రోజూ ఛానల్‌ను యాక్టివ్‌లో ఉంచాలి. వార్తలు, విశ్లేషణలు నిత్యం ఉండేలా చూసుకోవాలి. ఆటోమేటిక్‌గా ఛానల్‌ పుంజుకుంటుంది అని చెప్పారు. రాయడం అలవాటు ఉన్న నాకు యూట్యూబ్‌లో వీడియోలు చేయడం కంటే ఆ కంటెంట్‌నే ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా రీల్‌ చేసి అప్‌లోడ్‌ చేసిన. ప్రారంభంలో కొంత నెమ్మదించినా క్రమంగా వ్యూస్‌ పెరిగాయి. వ్యూస్‌ బాగా రావడంపై ఎర్రోజు శ్రీనివాస్‌ అన్న, డాక్టర్‌ పారిపెల్లి శంకర్‌ సార్‌ లతో ఉన్న చర్చకు వచ్చింది. యూట్యూబ్‌ కంటెంట్‌లో నీదో పద్ధతి. అది కూడా కొంతమందికి నచ్చుతున్నది. అందుకే ఛానల్‌కు కొత్త  సబ్‌స్క్రైబర్స్‌ తో పాటు వ్యూస్‌ వస్తున్నాయి. గో ఎహెడ్‌ అని ప్రోత్సహించారు. 


నా యూట్యూబ్‌ ఛానల్‌  గురించి ఎన్నడూ వ్యక్తిగతంగా ప్రచారం చేసుకోలేదు. ఇటీవల నా హితం కోరే కొంతమంది స్నేహితులకు లింక్‌ షేర్‌ చేసి  సబ్‌స్క్రైబ్‌ చేయడంతో పాటు అభిప్రాయం చెప్పమని కోరాను. వాళ్లంతా సానుకూలంగా స్పందించారు. కొన్ని సూచనలు చేశారు.  వెయ్యి మంది  సబ్‌స్క్రైబర్స్‌  అయ్యాక ఈ జర్నీ గురించి రాద్దామని అనిపించింది. 970కి పైగా  సబ్‌స్క్రైబర్స్‌  వచ్చాక ఛానల్‌ పై చిన్న వీడియో ఒకటి వాట్సప్‌ లో షేర్‌ చేసిన. అలాగే తెలంగాణలో నియోజకవర్గాల పెంపుపై వీడియో చేసిన ఒక లింక్‌ ఒకటి కూడా షేర్‌ చేసిన. చాలామంది మిత్రులు  సబ్‌స్క్రైబ్‌ చేసి మరింత ఉత్సాహాన్ని ఇచ్చారు. 


మనం ఏదీ ఆశించకుండా ఒక ప్రయత్నం మొదలుపెడితే దానికి మన వెల్‌ విషర్స్‌ సపోర్ట్‌ ఎప్పుడూ ఉంటుంది. యూట్యూబ్‌ అనగానే థంబ్‌ నెయిల్స్‌, కాంట్రవర్సీ కాలంలో ఛానల్‌ను మంచి కంటెంట్‌తో నడపడం కత్తి మీద సామే. కానీ వ్యక్తిగత భావ స్వేచ్ఛలో భాగమైన ఈ మాధ్యమానికి బారికేడ్లు మనమే పెట్టుకోవాలన్నది నా అభిప్రాయం. మనం రాసే రాతలు అయినా, వీడియోలు అయినా ఇతరులకు నష్టం చేయకుండా ఉంటే అదే చాలు. ప్రారంభంలో చెప్పినట్టు అనుకోకుండా వచ్చిన ఈ వృత్తి ప్రస్థానంలో ఇది మరో మైలురాయి. నవలోకాన్ని స్వప్నించిన నాకు కాలం నిర్మించిన రహదారి 2025. థాంక్స్‌ టు ఆల్‌ మై  సబ్‌స్క్రైబర్స్‌

Friday, 6 June 2025

ఉద్యమకాలంలో ఉద్వేగం నింపిన పత్రిక





నమస్తే తెలంగాణ ఆవిర్భావం రవీంద్రభారతిలో జరిగింది. 6-6-2011న ఆ పత్రిక ప్రారంభోత్సవానికి కేసీఆర్‌, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ సార్‌, అప్పటి ఎడిటర్‌ అల్లం నారాయణ, సీఈవో కట్టాశేఖర్‌ రెడ్డి, ఎండీ సీఎల్‌ రాజం తదితరుల చేతుల మీదుగా నమస్తే  తెలంగాణ పేపర్‌ ప్రతి విడుదలైంది. 2007లో ఆంధ్రజ్యోతిలో జర్నలిజం విద్యార్థిగా మొదలు పెట్టి ట్రైనింగ్‌ పూర్తికాగానే కొన్ని రోజులు (బహుశా 15 రోజులే అనుకుంటా) రంగారెడ్డి డెస్క్‌ లో సబ్‌ ఎడిటర్‌గా పనిచేసిన. ఆ తర్వాత మా జర్నలిజం ప్రిన్సిపల్‌ సూచన మేరకు ఆంధ్రజ్యోతి ఎడిట్‌ పేజీలో పనిచేయడానికి ఎడిట్‌పేజీ డెస్క్‌ కు మారాను. జర్నలిజంలో నేర్చుకున్న దానికంటే ఎడిట్‌ పేజీలో వచ్చే ఆర్టికల్స్‌ (మేమే ప్రథమ పాఠకులం మా జ్యోతింద్రనాథ్‌ అన్నట్లు) ద్వారా అనేక విషయాలపై అవగాహన పెరిగింది. మా సీనియర్లు, మా బ్యాచ్‌ వాళ్లు జిల్లాల్లో, సెంట్రల్‌ డెస్క్‌ లో పనిచేస్తుంటే నేను మాత్రం ఎడిట్‌ పేజీలో చేయడం ప్రారంభంలో కొంత అసంతృప్తి ఉండేది. కానీ అది తాత్కాలికమే అయ్యింది. 


అప్పటి నుంచి నమస్తే తెలంగాణలో 2011 ఏప్రిల్‌ చేరే వరకు చాలా విషయాలు నేర్చుకునే అవకాశం దొరికింది. ఎడిట్‌ పేజీలో పనిచేస్తున్న కాలంలోనే వేణుగోపాల స్వామి తో పరిచయం. వర్తమాన, సామాజిక అంశాలపై సార్‌ నిత్యం చెప్పేవారు. తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వం ఉండాలని సొంత పార్టీ, సొంత పత్రిక ఉండాలని జయశంకర్‌ సార్‌ నొక్కి చెప్పేవారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో సీమాంధ్ర యాజమాన్యంలో నడుస్తున్న పత్రికలు  అసత్యాలు ప్రచారం చేసేవి. వాటికి కౌంటర్‌ ఇచ్చే తెలంగాణ పత్రికలు అంతగా లేవు. అల్లం నారాయణ ఎడిటర్‌గా, కట్టా శేఖర్‌ రెడ్డి సీఈవోగా నమస్తే తెలంగాణ పత్రిక రానున్నదని తెలిసింది. అయితే అప్పటికి తెలంగాణ రాలేదు. ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ సమయంలో నమస్తేలో పనిచేయడానికి చాలామంది సీనియర్లు సాహసం చేయలేదు. తెలంగాణను బలంగా కోరుకునే కొంతమంది నమస్తేలో జాయిన్‌ అయ్యారు. ఆ సమయంలోనే వేణుగోపాల స్వామి సార్‌ జ్యోతికి రిజైన్‌ చేసి అక్కడికి వెళ్లిపోయారు. అక్కడికి వెళ్లిన కొన్నిరోజులకు నన్ను రమ్మని అడిగారు.  ఎడిట్‌పేజీలో పనిచేయడం వల్ల అల్లం నారాయణ, కట్టాశేఖర్‌ రెడ్డి సార్లతో పాటు కృష్ణమూర్తి (అప్పటి సెంట్రల్‌ డెస్క్‌ ఇన్‌ ఛార్జి, ప్రస్తుత విజయక్రాంతి ఎడిటర్‌), మార్కండయ (నెట్‌వర్క్‌  ఇన్ ఛార్జి, ప్రస్తుత దిశ పేపర్ ఎడిటర్) కి నేను కొత్తగా పరిచయం చేసుకునే అవకాశం రాలేదు. వేణుగోపాల స్వామి గారు నా కోసం గట్టిగా ప్రయత్నించడం వల్ల అక్కడికి వెళ్లాను. అదే సమయంలో ఆంధ్రజ్యోతి ఎడిటర్‌గా ఉన్న కె. శ్రీనివాస్‌ సార్‌కు వెళ్తాను అనగానే ఆలోచించు అన్నారు కానీ వద్దని అనలేదు.


అలా నమస్తే అడుగుపెట్టిన నాకు అనతికాలంలోనే చాలామందితో సన్నిహితం పెరిగింది. ఆ పత్రికలో పనిచేయడం ఆ సమయంలో ఒక ఉద్వేగం. ఎందుకంటే తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నప్పుడు, లోక్‌సభలో, రాజ్యసభలో బిల్లు పాసైనప్పుడు ఆఫీసు ముందు సంబరాలు చేసుకున్నాం. ఎడిట్‌ పేజీ, న్యూస్‌ ద్వారా అనేక వాస్తవ అంశాలను నమస్తే తెలంగాణ  పాఠకుల దృష్టికి తీసుకెళ్లింది. అందుకే అనతి కాలంలో ఆ పత్రికకు మంచి ఆదరణ దక్కింది. ఎడిట్‌ పేజీలో పనిచేస్తూనే 'రైతుబడి' ద్వారా రైతులకు వ్యవసాయంలో  ఆధునిక పద్ధతులు, సక్సెస్‌ స్టోరీలు అందించాం. నమస్తే లో పనిచేస్తున్న సమయంలోనే దీక్షాదివస్‌, రాష్ట్ర ఆవిర్భావం మొదలు తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక ఘట్టాలపై ఆర్టికల్‌ రాసే అవకాశం నాకు దక్కింది. ఆ పత్రికతో నాది  దాదాపు తొమ్మిదేళ్ల (2011-2020) ప్రయాణం. ఆ తర్వాత డిజిటల్‌ మీడియాలోకి మారాను.  కెరీర్‌లో అక్కడ పనిచేసిన కాలంలో ముఖ్యంగా 2011-2016 వరకు చాలా సంతృప్తి కలిగింది. ఎందుకంటే కొన్ని నమస్తే తెలంగాణ మాత్రమే రాయగలదు అన్నది అప్పుడు రుజువువైంది. ఆ పత్రిక పురుడు పోసుకుని 14 ఏండ్లు అవుతున్న సందర్భంగా అనేక జ్ఞాపకాలు కళ్ల ముందు కదలాడాయి. అందుకే కొన్ని అంశాలను రాసే ప్రయత్నం చేసిన. నమస్తే తెలంగాణ మిత్రులకు పత్రిక ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు


-ఆసరి రాజు, ఇండిపెండెంట్‌ జర్నలిస్ట్‌

Featured post

ఓట్ల తొలగింపుపై అఖిలేశ్ యాదవ్ తీవ్ర ఆగ్రహం.. ఈసీ తీరుపై ప్రశ్నల వర్షం!

  లక్నో: ఓటర్ల జాబితా నుంచి ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారంటూ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ ఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయి...