Thursday, 10 April 2025
ప్రజలు మెచ్చేలా పాలన సాగించాలని పౌర సమాజం కోరిక
సీఎం రేవంత్ రెడ్డి వైఖరి నాకు దక్కనిది ఎవరికీ దక్కడానికి వీళ్లేదు అన్నట్టు ఉన్నది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం, పౌర సమాజం, తెలంగాణ ప్రజల హక్కులు, నిరసనలు అంటూ డైలాగులు కొట్టిన సీఎం పవర్‌లోకి వచ్చిన పదిహేను నెలల్లోనే ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారు. నెగ్గడమే కాదు, తగ్గడమూ విజయమే అన్నది కేసీఆర్ ఉద్యమకాలంలోనే కాదు, పదేళ్ల పాలనలో చూపెట్టారు. బీఆర్‌ఎస్ హయాంలో కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ల నిర్మించాలని ప్రతిపాదిస్తే టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ ప్రతిపాదనలకువ్యతిరేకంగా క్యాంపెన్ చేసింది. వాకర్లు, ప్రజలు కూడా నిరసనలను పరిగణనలోకి తీసుకున్నది. ఆ ప్రతిపాదనను విరమించుకున్నది. ఇది కదా ప్రజా ప్రభుత్వం అంటే!ప్రజల ఇండ్లపైకి బుల్డోజర్లు పంపిస్తూ.. మూగ జీవాలైన పక్షులు, జంతువులను వాటి నివాస ప్రాంతాల నుంచి తరిమికొడుతూ.. ఇదేమని ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతూ మాది ప్రజా ప్రభుత్వం అంటే హాస్యాస్పదంగా ఉన్నది. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచిగా, వారు మెచ్చేలా పాలన సాగించాలని పౌర సమాజం కోరుతున్నది
Thursday, 20 February 2025
కాంగ్రెస్ బీసీ సీఎం.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యల వెనుక?
బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలని రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారు. ఏదో ఒకరోజు తెలంగాణ రాష్ట్రానికి బీసీ సీఎం అవుతారు. అది కాంగ్రెస్ పార్టీలోనే అవుతారు. వచ్చే ఎన్నికలన్నీ బీసీల చుట్టే తిరుగుతాయి. ఈ ఐదేళ్లు రేవంత్ రెడ్డే సీఎంగా కొనసాగుతారు. రానున్న రోజుల్లో మాత్రం బీసీలకే ఈ అవకాశం ఉంటుంది.- గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు
ఆ మధ్య పదేళ్లు నేనే సీఎం అని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అదే మాటను ఆయన పదే పదే ఉటంకించారు. గతంలో ఒకే పార్టీకి రెండు సార్లు అవకాశం ఇచ్చారని 1994-2014 వరకు ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన పార్టీల గురించి 2014-2023 వరకు బీఆర్‌ఎస్ పాలనను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. అందుకే మాకు కూడా ప్రజలు మరోసారి అవకాశం ఇస్తారని, కాబట్టి వచ్చే ఐదేళ్లూ సీఎం సీటు నాదేనని స్పష్టంగానే చెప్పారు. కానీ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో జరిగిన పరిణామాలతో సీఎం స్వరం మారింది. మంత్రులు, అధికారులు తనకు సహకరించడం లేదని, కొంతమంది మంత్రులు తన సీటుపై కన్నేశారని వార్తలు వచ్చాయి. సీఎం పోస్టుపై పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు వచ్చే ఎన్నికల తర్వాత జరగబోయే పరిణామాలను అంచనా వేశారు. కానీ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వస్తామన్న విశ్వాసం ఆ పార్టీ నేతలు, కార్యకర్తల్లోనే లేదు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలువడం, సీఎం సీటు బీసీలు రాహుల్ గాంధీ ఇస్తారని మహేశ్‌కుమార్ చెప్పినట్లు జరిగే అవకాశాలు 10 శాతం కూడా లేవు.
కొన్నిరోజులుగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో సడలుతున్న నమ్మకం వంటివి బేరీజు వేసుకుని ఏదో జరుగుతున్నదన్న చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే పీసీసీ చీఫ్ బీసీలదే సీఎం సీటు అని వ్యాఖ్యానించడం కొంత ఆలోచనలో పడేసింది. ఎందుకంటే రాష్ట్రవ్యవహారాల ఇన్‌ఛార్జిగా దీపాదాస్ మున్షీ తప్పించి రాహుల్ గాంధీ విధేయురాలైన మీనాక్షి నటరాజన్ నియమించారు. అది కూడా రాహుల్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ తర్వాత జరిగిన పరిణామాం ఇది. మీనాక్షి నియామకం తర్వాతే రాష్ట్ర వ్యవహారాలన్నీ పార్టీ హైకమాండ్ తమ చేతుల్లోకి తీసుకున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా బీసీలకు రాహుల్ రాజ్యాధికారం ఇవ్వాలని నిర్ణయించారని పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు వీటికి కొనసాగింపుగానే భావించాలి.
Tuesday, 4 February 2025
రేవంత్ సర్కార్ ముందున్న సవాళ్లు
కాంగ్రెస్ పార్టీ మహా సముద్రం. ఆ పార్టీలోకి నాయకులు వస్తుంటారు. పోతుంటారు. అంతకంటే మఖ్యమైనది ఆపార్టీలో అంతర్గ ప్రజాస్వామ్యం పేరుతో ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు అనేది. అందుకే కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజలు, ప్రతిపక్షాల కంటే కొన్నిరోజులుగా అధికారపార్టీ ఎమ్మెల్యేలు, నేతలే బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. సొంతపార్టీ ఎమ్మెల్యేలు పది మంది ప్రత్యేక సమావేశం కావడం రాజకీయవర్గాల్లో కలకలకం సృష్టిస్తుండగా.. దేశానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసే కులగణన తెలంగాణ మోడల్ కాబోతున్నదని గప్పాలు కొట్టారు. దీనిపై బీసీ సంఘాలతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతల్లోనే అసంతృప్తి వ్యక్తమౌతున్నది. మొన్నటిదాకా కేసీఆర్ పాలన సరిగా లేదు, ఆయన పాలనా విధానాలు సరైనవి కావన్న వాళ్లే ఆయనే కరెక్టు. ఆయన చేసిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కలతోనే కాంగ్రెస్ చేసిన బోగస్ సర్వే తేటతెల్లమైందంటున్నారు. అసెంబ్లీలోనూ విపక్షాలు కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడిగిపారేశాయి. చివరికి ముఖ్యమంత్రి సర్వేలో పాల్గొనని వారికి మాట్లాడే అర్హత లేదని,వారికి మైక్ ఇవ్వొద్దని స్పీకర్‌ను కోరడం కొసమెరుపు.
Monday, 29 July 2024
సెల్ఫ్ గోల్ సీఎం!
https://www.teluguscribe.com/top-stories/whenever-cm-is-on-defense-he-raises-wrong-issues-602972
https://www.teluguscribe.com/top-stories/why-congress-govt-not-bult-thummidihetti-barrage-602944
https://www.teluguscribe.com/top-stories/self-goal-cm-revanth-reddy-602854
https://www.teluguscribe.com/latest/two-more-motors-are-on-in-the-kaleshwaram-lift-602833
మరిన్ని
వార్తలకు https://www.teluguscribe.com/
ను
subscribe చేయగలరు
Sunday, 12 May 2024
ఆందోళన వద్దు తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం: సీఎం రేవంత్
తెలంగాణలో రాగల ఐదు రోజులు వానలు పడే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోతే రైతులు ఆందోళన చెందవద్దని, ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించినట్టు సీఎం తెలిపారు.
Featured post
ఓట్ల తొలగింపుపై అఖిలేశ్ యాదవ్ తీవ్ర ఆగ్రహం.. ఈసీ తీరుపై ప్రశ్నల వర్షం!
లక్నో: ఓటర్ల జాబితా నుంచి ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారంటూ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ ఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయి...
-
దేశవ్యాప్త నిరసనలకు పిలుపు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోను అమెరికా దళాలు బంధించడాన్ని భారతదేశంలోని వామపక్ష పార్టీలు (CPI, CPI(M), ఫార...
-
అలీ ఖమేనీ మృతితో రగిలిపోతున్న ఇరాన్ ఇజ్రాయెల్‌కు లరిజానీ భయంకర హెచ్చరిక! టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ మరణంతో పశ్చిమ...
-
శ్రీవాణిని కేతన్ హైస్కూల్ లో పదవ తరగతి సమయంలో పొద్దున మాకు ట్యూషన్స్ ఉండేవి. ప్రభాకర్ రెడ్డి సార్ (మాథ్య్స్) , సీతారామరావు సార్ (సోష...




