మాస్కో, అక్టోబర్ 2: భారతదేశంతో కేవలం ఆర్థిక సహకారమే కాకుండా, లాజిస్టిక్స్ మరియు రవాణా రంగాల్లోనూ బలమైన భాగస్వామ్యం ఉంటుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ వాణిజ్య కారిడార్లను భారత్‌తో కలిసి సంయుక్తంగా వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే ఒక చైనీస్ కంటైనర్ షిప్, దక్షిణ కొరియా నౌకను విజయవంతంగా నడిపామని, ఇదే రీతిలో భారతీయ మిత్రులతోనూ చర్చిస్తున్నట్లు పుతిన్ వెల్లడించారు. ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ (INSTC) ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ.. ఇది కేవలం తమపై మాత్రమే ఆధారపడి లేదని పుతిన్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన ఆర్థిక వనరులను, రుణాలను సమకూర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే ఇరాన్ తన పరిధిలోని పనులను త్వరగా పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు. ఈ కారిడార్‌లో భాగమైన అజర్‌బైజాన్‌తో ఎలాంటి సమస్యలు లేవని, ఆ దేశ అధ్యక్షుడు ఇల్హామ్ అలీయవ్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని, వారు కూడా సానుకూలంగా ఉన్నారని పుతిన్ పేర్కొన్నారు. లాజిస్టిక్స్ రంగమే కాకుండా భారత్‌తో ఆర్థిక సహకారానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని ఆయన ఉద్ఘాటించారు.
No comments:
Post a Comment