Wednesday, 28 October 2026

నెతన్యాహు ప్రభుత్వాన్ని గద్దె దించుతాం



  • అరబ్-మెజారిటీ 'జాయింట్ లిస్ట్' కూటమి చైర్మన్ యూసఫ్ జబరీన్‌ 

జెరూసలేం, అక్టోబర్‌ 28: ఇజ్రాయెల్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తరుణంలో ఆ దేశ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అరబ్-మెజారిటీ 'జాయింట్ లిస్ట్' కూటమి చైర్మన్ యూసఫ్ జబరీన్‌  సంచలన ప్రకటన చేశారు. ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు తమ కూటమి పూర్తిగా సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. నెతన్యాహు పాలనలో రక్తపాతం, ఆధిపత్య రాజకీయాలు, జాతి వివక్ష, బహిష్కరణలు పెరిగిపోయాయని మండిపడ్డారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే యూదులు, అరబ్బుల మధ్య నిజమైన, సమానమైన భాగస్వామ్యం ఒక్కటే సరైన మార్గమని జబారిన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మరోవైపు, ఎన్నికల ఫలితాల సరళి వెలువడుతున్న సమయంలో లికుడ్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడిన ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఘన విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో తమ లికుడ్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించిందని, యూదు ప్రజల మద్దతుతో రైట్-వింగ్ (జాతీయవాద) బ్లొక్‌కు స్పష్టమైన మెజారిటీ లభించిందని తెలిపారు. అయితే, అరబ్-నేతృత్వంలోని పార్లమెంటరీ వర్గాలపై ఆధారపడే ప్రభుత్వ ఏర్పాటును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఇజ్రాయెల్ మనుగడను వ్యతిరేకించే, సైనికులను టార్గెట్ చేసే అరబ్ పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం దేశద్రోహంతో సమానమని, అది క్షమించరాని నేరమని నెతన్యాహు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాజా పోల్ సర్వేల ప్రకారం నెతన్యాహు బ్లొక్‌కు 55 స్థానాలు, ప్రతిపక్ష బ్లొక్‌కు 49 స్థానాలు, అరబ్ పార్టీలకు 16 స్థానాలు దక్కే అవకాశం ఉన్నట్లు అంచనా వేయడంతో ఇజ్రాయెల్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

No comments:

Post a Comment

Featured post

నెతన్యాహు ప్రభుత్వాన్ని గద్దె దించుతాం

అరబ్-మెజారిటీ 'జాయింట్ లిస్ట్' కూటమి చైర్మన్ యూసఫ్ జబరీన్‌  జెరూసలేం, అక్టోబర్‌ 28: ఇజ్రాయెల్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తరు...