- మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై ఎంపీ రవికిషన్ తీవ్ర ఆగ్రహం
గోరఖ్‌పూర్ (ఉత్తర ప్రదేశ్): కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ, ప్రముఖ నటుడు రవికిషన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న ఘోర పరాజయాల కారణంగానే ఆ పార్టీ నాయకుల్లో తీవ్రమైన నిరాశ, అసహనం అలుముకున్నాయని ఎద్దేవా చేశారు. పట్నాలో జరిగిన సభలో కనీసం 500 మందిని కూడా పోగުచేయలేని ఖర్గే.. దేశం కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రధానమంత్రి మోడీపై వ్యక్తిగత విమర్శలు చేయడం అత్యంత సిగ్గుచేటని విమర్శించారు. ప్రధాని మోడీని చూసేందుకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తుంటారని, అదే ప్రజాదరణను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ నేతలు ఇటువంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని రవికిషన్ ఆరోపించారు. ఖర్గే వ్యాఖ్యలను దేశ ప్రజలందరూ తీవ్రంగా ఖండిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో ప్రజలే ఓట్ల రూపంలో కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రధాని మోడీపై ఎన్ని విమర్శలు చేసినా, ప్రజలు మాత్రం ఎప్పుడూ ఆయన వెంటే ఉంటారని స్పష్టం చేశారు.

No comments:
Post a Comment