కేంద్ర క్యాబినెట్ పునర్‌వ్యవస్థీకరణతో కాంగ్రెస్ కొత్త సంకేతం పంపింది.
ముంచుకొస్తున్న ముప్పును తట్టుకునేందుకు ముందస్తు ఎన్నికల ప్రణాళికలను
రూపొందించుకున్నది. అందుకే ఇప్పుడు కేంద్ర క్యాబినేట్ 79 మంది ఉంటే అరవై
పైచిలుకు మంత్రివర్గ స్థానాలు అధికార పార్టీ అభ్యర్థులే. అలాగే పది మంది
మహిళా మంత్రులు. యువతకు పెద్దపీట వేస్తామన్న హామీని కూడా ఆచరణలో
పెట్టినట్టు కనిపిస్తున్నది. ఇలా యువరాజు పట్టాభిషేకానికి రాజమార్గాన్ని
సిద్ధం చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. అయితే మంత్రి వర్గంలో చోటు దక్కని
అసంతృప్తులు, వాళ్లను బుజ్జగించేందుకు కాంగ్రెస్‌లో పార్టీలో ఉండే సోనియా
ఆంతరంగికులు ఉండనే ఉన్నారు. కానీ పెట్రోలియం శాఖ నుంచి జైపాల్‌రెడ్డిని
తప్పించి వీరప్పమొయిలీ అప్పగించడం పట్ల అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలో
భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. రిలయన్స్ అధినేత ముఖేశ్ ఒత్తిడితోనే జైపాల్
శాఖ మారింది అనుకున్నా దీనికి గల కారణాలను కూడా కాంగ్రెస్ చెబుతున్నది.
దీన్ని సామాజిక ఉద్యమకారుడు కేజ్రీవాల్ బహిరంగంగానే ప్రభుత్వ తీరును
విమర్శస్తున్నారు. అంతేకాదు యూపీఏకు బయటి నుంచి మద్దతు ఇస్తున్న ఎస్పీ
కూడా మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణపై విమర్శలు చేస్తున్నది. అవినీతి
ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఉన్నత పదవులు కట్టబెట్టడాన్ని
నిరసిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్నదనే
వారి ఆరోపణలు. అలాగే కేంద్ర మానవ వనరుల శాఖ విషయంలో ఇదే రగడ
కొనసాగుతున్నది. ఎందుకంటే గతంలో ఆ పదవిని నిర్వహించిన వారు చాలా
అనుభవజ్ఞులనేది విశ్లేషకుల భావన. అలాంటిది ఇప్పుడు ఆ పదవిని పల్లంరాజుకు
కేటాయించడంపై అధికార పార్టీలో కొందరు అసంతృప్తితో ఉన్నారనే వాదనలు
వినిపిస్తున్నాయి. అయితే మంత్రివర్గ కూర్పుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్లు
స్వచ్ఛందంగానే వైదొలిగి యువత అవకాశాలు కల్పించడానికి పార్టీ కోసం
పనిచేస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేస్తున్నది. అయితే దీనిపై
కేంద్రంలో ఒక వాదన, రాష్ట్రంలో ఒక వాదన వినిపిస్తుండడం గమనార్హం. రాష్ట్ర
రాజకీయాల్లో జైపాల్ తలదూర్చినందుకే ఆయన హోదాకు తగిన శాఖ దక్కలేదు అనేది
వాస్తవం కాదు. ఎందుకంటే మన్మోహన్ తాజా క్యాబినేట్ కూర్పు అంతా సంస్కరణలు
వేగవంతం చేసేందుకే అన్నది జగమెరిగిన సత్యమే. అందుకే ఆయన శాఖ మార్పు జరిగి
ఉండవచ్చు. కార్పొరేట్ స్వామ్యానికి జై కొడుతూ కామన్‌మ్యాన్‌ను
పట్టించుకోని మన్మోహన్ ఇంత కాలం మిత్రపక్షాల ఒత్తిడి పక్కకుపెట్టిన
అంశాలన్నీ వచ్చే ఏడాదిన్నర కాలంలో ఆచరణలో పెట్టబోతున్నారు.
అలాగే రాష్ట్రాల వారీగా పార్టీని పటిష్టం చేసే వ్యూహం కూడా ఈ తాజా కూర్పులో కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికలను ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండాలసి సోనియాగాంధీ తన పార్టీ ఎంపీల సమావేశంలో చెప్పినట్టు వార్తలు కూడా వచ్చాయి. అందులోవాస్తవ అవాస్తవాలను పక్కన పెడితే కచ్చితంగా ఇది ఎన్నికల క్యాబినేటే అని స్పష్టమవుతుంది. ఇక విధేయత గురించి కూడా చర్చ జరుగుతున్నది. కానీ ఇదేం కాంగ్రెస్ పార్టీలో కొత్త అంశం కాదు. ఇందిరాగాంధీ హయాం నుంచి కొనసాగుతున్నదే. అది ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే కాదు అన్ని పార్టీల్లోనూ ఎంతోకొంత విధేయతకు పట్టం కట్టడం మనం చూస్తూనే ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీలో అది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎలాగంటే వాళ్ల పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కదా! పార్టీని, ప్రభుతాన్ని ఇబ్బందిపెట్టకుండా అంటే కర్ర విరగకుండా పాము చావకుండా వ్యవహరించేవారిని అందలం ఎక్కించడంలో కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీల కంటే ముందుంటుంది. అలాగే వచ్చే ఏడాది నవంబర్, డిసెంబర్‌లోనే లోక్‌సభ ఎన్నికలు జరగవచ్చునని యువనేత రాహుల్‌గాంధీ తనను కలిసిన ఎంపీలకు చెబుతున్నారనే వార్తలు వస్తున్నాయి. అంతేకాదు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టికెట్లు కేటాయించే బాధ్యతను కూడా ఆయనకే కట్టబెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. అందుకే ఆయన రాష్ట్రాల వారీగా కొంతమంది ఆయన టీమ్‌లో చేర్చుకుంటున్నారు కూడా. వీరికి వారి వారి సొంత రాష్ట్రాలు కాకుండా ఇతర రాష్ట్రాల బాధ్యతలు అప్పగిస్తున్నారట. ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ పనితీరు, ప్రజాప్రతినిధుల పనితీరుపై తనకు నివేదికలు ఇవ్వాలని వారికి ఆదేశిస్తున్నారట. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల తర్వాత ముందస్తు ఎన్నికలపై మరింత సమాచారం రావచ్చు. సార్వత్రిక ఎన్నికల కోసం ఒక్క కాంగ్రెస్ పార్టీయే కాదు బీజేపీ కూడా సన్నద్ధం అవుతున్నది. అందుకే పార్టీని విభేదించి బయట ఉన్న అసంతృప్తులను బుజ్జగించే పనిలో ఆ పార్టీ ఉన్నది.
ముఖ్యంగా కర్ణాటక నుంచి యడ్యూరప్ప, రాజస్థాన్ నుంచి వసుంధరాజే, ఉత్తరప్రదేశ్ నుంచి మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్‌సింగ్‌లను సంప్రదించి కలుపుకుపోవాలనుకుంటోంది. లేదు లేదు అంటూనే అధికార, ప్రతిపక్ష పార్టీలు ముందస్తు ఎన్నికల సందడి చేస్తున్నాయి. అయితే బీజేపీ సంగతి ఏమో కానీ కాంగ్రెస్ పార్టీ నవంబర్‌లో ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ చేపట్టబోతున్నట్టు సమాచారం. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఆ పార్టీకి పట్టున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మూడేళ్లుగా రాజకీయ సంక్షోభం నెలకొన్నది. ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్‌రెడ్డి రెండేళ్ల పాలనలో ఆ పార్టీ పరిస్థితి దిగజారిందనేది విశ్లేషకుల వాదన. పార్టీలో ప్రక్షాళన జరగకపోతే గతంతో సాధించిన 33 పార్లమెంటు స్థానాల సంగతి ఏమో కానీ 13 స్థానాలు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆ పార్టీకే చెందినవారు విమర్శిస్తున్నారు. అందుకే ముఖ్యమంత్రిని, పీసీసీ అధ్యక్షుడిని సంప్రదించకుండానే మంత్రివర్గ విస్తరణలో రాష్ట్రానికి పెద్దపీట వేశారు అన్నది స్పష్టమే. అట్లాగే చంద్రబాబు జపిస్తున్న బీసీ మంత్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఆచరణలో చూపెట్టినట్టుంది. సీమాంధ్రలో ఒక సామాజిక వర్గం జగన్ వెంట వెళతారు అన్న ప్రచారం నేపథ్యంలో కాపులను ప్రసన్నం చేసుకోవడానికే పల్లంరాజు, చిరంజీవి లాంటి వారికి పెద్దపీట వేశారు అన్న చర్చ సాగుతున్నది. ఇందులో కొంత వాస్తవం కూడా ఉండవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో మొన్న జరిగిన 1 అసెంబ్లీ స్థానాల్లో రెండు స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. ఆ అభ్యర్థులు కూడా కాపు సామాజిక వర్గం నేతలే కావడం గమనార్హం. అందుకే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు చంద్రబాబు బీసీ మంత్రాన్ని, వైఎస్‌ఆర్‌సీపీ ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ ఈ వ్యూహాన్ని అనుసరించింది. అంతేకాదు రాష్ట్రానికి గతంలో ఎన్నడూ లేనివిధంగా పది మంత్రిపదవులు కట్టబెట్టింది. వీరి ద్వారా వలసలకు చెక్ పెట్టాలని భావించింది. కానీ మంత్రివర్గ విస్తరణ తర్వాతే అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. ఇంకొంత మంది అదే బాటలో ఉన్నట్టు సమాచారం. అయితే రాజకీయ పార్టీలో వలసలు అనేవి సహజమే. కానీ రాష్ట్రంలో అతిపెద్ద సమస్య అయిన తెలంగాణ అంశాన్ని పరిష్కరించకుండా ఇంకా నాన్చివేత ధోరణిని అవలంబిస్తే ఈ ప్రాంతంలోనూ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవడం ఖాయం. కాంగ్రెస్ పార్టీ రోగమొకటి అయితే చికిత్స మరొకటి చేస్తున్నది. ఇలా ఎంత కాలం నెట్టుకొస్తుందో హస్తిన పెద్దలకే అర్థం కావాలి.
-రాజు

No comments:
Post a Comment