Wednesday, 16 July 2025

అసంతృప్తుల అడ్డదిడ్డమైన వాదనలు




మనం నచ్చకపోతే మనం ఏం చేసినా నచ్చదు. అట్లనే కొంతమందికి కేసీఆర్‌ అంటే గిట్టదు. అందుకే అలాంటి వారికి రేవంత్‌ రెడ్డి పాలనా వైఫల్యాలను ఎత్తిచూపిస్తుంటే కడుపు మండుతున్నది. పైకి కేసీఆర్‌ బాటలోనే రేవంత్‌ సాగుతున్నారంటూనే ఆయన పాలనలో అరాచకాలపై  మాట్లాడుతున్న వారిపై, రాస్తున్న వారిపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో తెలంగాణ అస్తిత్వం-సవాళ్లు, కర్తవ్యాలు అనే అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. అందులో ఆయా రంగాల నిపుణులు రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తెలంగాణలో వచ్చిన మార్పులు. సాగు, తాగు నీటి రంగాల్లో సాధించిన పురోగతి, తెలంగాణ ఉద్యమ ట్యాగ్‌ లైన్‌ అయిన నీళ్లు, నిధులు, నియామకాల పై కూలకషంగా చర్చించారు. అట్లనే తెలంగాణ భాష, చిహ్నాలు, తెలంగాణ అస్విత్వం వంటి అంశాలపై చర్చించారు. కానీ మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ చరిత్రను మార్చే ప్రయత్నం చేయడం, ఉమ్మడి పాలనా అనుభవాలను తిరిగి ప్రజలకు గుర్తుచేస్తుండాన్ని తప్పుపట్టారు. ప్రభుత్వ పాలన అంటే గత ప్రభుత్వానికి కొనసాగింపు. ఆ పాలనలో లోపాలు ఉంటే సరిచేయవచ్చు. మంచి పథకాలు ఉంటే కొనసాగించవచ్చు. కానీ రేవంత్‌ రెడ్డి సర్కార్‌ టార్గెట్‌ ఆయనే చెప్పినట్లు కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా చేసే బాధ్యత నాది అని వాగ్దానం చేసినట్టే ఆచరణలో తెలంగాణ అస్విత్వ ఆనవాళ్లను చెరిపేస్తున్నారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పలేక ప్రశ్నిస్తున్న వారిని కేసులు పెట్టి వేధిస్తున్నది. మాట్లాడకుండా, రాయకుండే చేసే ప్రయత్నం చేస్తున్నది. తెలంగాణ రౌండ్‌ టేబుల్‌ సమావేశంపై అక్కసు వెళ్లగక్కే వారికి ఇవేవీ పట్టవు. కేసీఆర్‌, కేటీఆర్‌లను టార్గెట్‌ చేస్తూ జుగుప్సాకరమైన థంబ్‌ నెయిల్స్‌ పెట్టినా వీళ్ల దృష్టిలో తప్పు కాదు. వాళ్లు ఏం చేసినా మౌనంగా ఉండాలి. మాట్లాడవద్దు. భరించాలి. అది పత్రికా స్వేచ్ఛలో భాగమని సర్దుకుపోవాలి అన్నట్టు వీళ్లు నీతులు చెబుతున్నారు. కానీ రేవంత్‌ సర్కార్‌ అవగాహన రాహిత్యంతో గోదావరి, కృష్ణా జలాలను ఏపీ అక్రమంగా తరలించుకుపోతున్నాదీనిపై మాట్లాడవద్దు. తెలంగాణ అస్తిత్వాన్ని ప్రమాదంలో నెట్టే పరిణామాలపై చర్చించవద్దు. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి కారణమైన ఆరు గ్యారెంటీల గురించి అడగవద్దు. 19 నెలల తర్వాత కూడా కేసీఆర్‌ పదేళ్ల పాలనపైనే చర్చ పెట్టాలి. అవి మాత్రమే ప్రస్తావించాలి. అంతేగానీ రేవంత్‌ను పల్లెత్తు మాట అనవద్దు. చంద్రబాబు జల దోపిడిని అడ్డుకోవద్దు. రాధాకృష్ణ అడ్డదిడ్డ రాతలపై స్పందించవద్దు. ఇదే అజెండాతో కొంతమంది కేసీఆర్‌ వ్యతిరేకులు పనిచేస్తున్నారు. వాళ్లకు వాళ్ల వ్యక్తిగత ప్రయోజాలు తప్ప తెలంగాణ ఏమై పోయినా ఫరవాలేదు అన్నట్టు రాస్తున్నారు. 

No comments:

Post a Comment

Featured post

అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...