Thursday, 2 July 2026

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు లోపాయకారీగా కుమ్మక్కయ్యాయి

 


కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు

హైదరాబాద్:రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల నాయకులు పైకి కొట్లాడుకుంటున్నట్లు నాటకాలు ఆడుతున్నా, లోపల మాత్రం పూర్తిగా కుమ్మక్కయ్యారని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇరు పార్టీల నేతలు విసురుకుంటున్న సవాళ్లపై మంత్రి ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో జరిగిన గురుకుల టెండర్ల అక్రమాలు, అడ్డగోలుగా పెరిగిపోయిన రాష్ట్ర అప్పులు,  ప్రధాని మోదీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి కేటాయించిన లక్షల కోట్ల కేంద్ర నిధులపై బహిరంగంగా చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఈ అంశాలపై చర్చకు తేదీ, సమయం ,వేదికను నిర్ణయించడానికి భారతీయ జనతా పార్టీ సర్వసన్నద్ధంగా ఉందన్న బండి సంజయ్, దమ్ముంటే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు ఈ చర్చకు రావాలని బహిరంగ సవాలు విసిరారు.

No comments:

Post a Comment

Featured post

పీయూష్‌ గోయల్‌కు బీజేపీలో కీలక బాధ్యత

  మోడీ కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణకు సంకేతమా?  న్యూఢిల్లీ: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను బీజేపీ జాతీయ కోశాధికారిగా నియ...