Wednesday, 29 July 2026

సంప్రదాయ కళాకారులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భేటీ

 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రాష్ట్రపతి భవన్‌లో భారతీయ సంప్రదాయ కళారూపాలను ప్రతినిధ్యం వహిస్తున్న కళాకారులను కలుసుకుని వారి కళాఖండాలను పరిశీలించారు. 'ఆర్టిస్ట్స్-ఇన్-రెసిడెన్స్' కార్యక్రమంలో భాగంగా బనారస్ మ్యూరల్, థాంకా, నాయక, కేరళ మ్యూరల్, బసోహ్లీ, సుర్‌పూర్, మైసూర్ వంటి 12 సంప్రదాయ కళారూపాలకు చెందిన కళాకారులు ప్రస్తుతం రాష్ట్రపతి భవన్‌లో నివసిస్తూ తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఈ కార్యక్రమం భారత కళా సంప్రదాయాల వైభవాన్ని చాటిచెప్పడమే కాకుండా, జీవంతంగా కొనసాగుతున్న సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షిస్తూ భావితరాలకు స్ఫూర్తినిచ్చే ప్రయత్నంగా రాష్ట్రపతి భవన్ పేర్కొంది.



No comments:

Post a Comment

Featured post

అసెంబ్లీని అపహాస్యం చేశారు

కాంగ్రెస్‌ సర్కారుపై కేటీఆర్‌ ఫైర్‌ హైదరాబాద్‌: తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం శాసనసభ నిర్వహణ తీరును పూర్తిగా అపహాస్యం చేసిందని బీఆర్‌ఎస్...