Thursday, 2 July 2026

ఆమె నా అందమైన సోదరి

జపాన్ ప్రధాని సనాయె తకాయిచికి ప్రధాని మోదీ ఘన స్వాగతం



న్యూఢిల్లీ:భారత పర్యటనకు విచ్చేసిన జపాన్ నూతన ప్రధానమంత్రి సనాయె తకాయిచికి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. గురువారం ఇరు దేశాల అధినేతలు ఢిల్లీలో ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ జపాన్ ప్రధానిని "నా అందమైన సోదరి" (Beautiful Sister) అని ఆత్మీయంగా సంబోధిస్తూ భారత దేశ అపారమైన వృద్ధి ప్రయాణంలో జపాన్ పోషిస్తున్న పాత్ర అత్యంత కీలకమైనదని కొనియాడారు. ప్రధాని మోదీ చూపిన ఈ ఆత్మీయత, ప్రత్యేక గౌరవంపై జపాన్ ప్రధాని తకాయిచి తీవ్ర సంతోషాన్ని వ్యక్తం చేశారు. రెండు దేశాలు అభివృద్ధి, ప్రగతి పథంలో జరుపుతున్న ప్రయాణంలో భారత్-జపాన్ ఒకే మార్గంలో పయనిస్తున్నాయని, తమ మధ్య జరిగిన ద్వైపాక్షిక సంభాషణలలో ఈ విషయం స్పష్టమైందని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Featured post

పీయూష్‌ గోయల్‌కు బీజేపీలో కీలక బాధ్యత

  మోడీ కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణకు సంకేతమా?  న్యూఢిల్లీ: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను బీజేపీ జాతీయ కోశాధికారిగా నియ...