- జంతువుల నుంచి సంక్రమించే వ్యాధులపై అవగాహనకు పిలుపు
న్యూఢిల్లీ / హైదరాబాద్: జంతువులు, పక్షుల నుండి మనుషులకు సంక్రమించే జూనోటిక్ (Zoonotic) వ్యాధుల పట్ల ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు సోమవారం ప్రపంచ జూనోసెస్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఫ్రెంచ్ ప్రసిద్ధ శాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్ 1885 జూలై 6న మానవునికి మొట్టమొదటి సారిగా రేబీస్ వ్యాక్సిన్‌ను విజయవంతంగా అందించిన చరిత్రాత్మక సంఘటనకు గుర్తుగా ఏటా ఈ రోజును ఎంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న అంటువ్యాధులలో సుమారు 60 శాతం, కొత్తగా పుట్టుకొస్తున్న వ్యాధులలో 75 శాతం జంతువుల ద్వారానే మనుషులకు వ్యాపిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరిస్తున్న తరుణంలో ఈ రోజు ప్రాధాన్యం సంతరించుకుంది.

No comments:
Post a Comment