Thursday, 2 July 2026

అవినీతిపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తాం

 

బీజేపీ నేత ఎన్. రామచందర్ రావు



హైదరాబాద్:తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల అవినీతి అక్రమాలను, పాలనా వైఫల్యాలను ప్రజల ముందు ఉంచేందుకు బీజేపీ ఒక బహిరంగ చర్చా వేదికను ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు, సీనియర్ నేత ఎన్. రామచందర్ రావు ప్రకటించారు. రాష్ట్రంలో జరిగిన వివిధ టెండర్ల కుంభకోణాలు, నిధుల దుర్వినియోగం , ఆయా పార్టీల విఫల విధానాలకు సంబంధించిన పక్కా వాస్తవాలు, అధికారిక గణాంకాలు, తిరుగులేని ఆధారాలతో ఇరు పార్టీల అసలు రంగును ప్రజల ముందు బట్టబయలు చేస్తామన్నారు. ఈ బహిరంగ వేదిక ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని, త్వరలోనే ఈ చర్చా కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు.

No comments:

Post a Comment

Featured post

మీ ధైర్యం ఎన్నో ప్రాణాలను కాపాడింది

ఫ్లై దుబాయ్‌ కెప్టెన్‌తో మోడీ వీడియో కాల్‌ న్యూఢిల్లీ: ఫ్లై దుబాయ్‌ విమాన కెప్టెన్‌ స్మిత్‌ మచ్ఛర్‌తో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాల్‌లో మా...