ఆదివారంప్రచారానికి శ్రీకారం చుట్టనున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం 'నషా ముక్త యువ ఫర్ వికసిత్ భారత్' జాతీయ ప్రచార కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ బుధవారం వెల్లడించారు. ప్రారంభ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా యువత పాల్గొంటారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పాల్గొనే వారందరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని 'నషా ముక్త ప్రతిజ్ఞ' చేయనున్నట్లు చెప్పారు.
100 వారాల పాటు దేశవ్యాప్తంగా సాగే ఈ ప్రజా భాగస్వామ్య ఉద్యమం ద్వారా యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి ఆదివారం యువత ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, ప్రతిజ్ఞా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 'మై భారత్' వాలంటీర్లు, నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్‌ఎస్‌ఎస్), యువజన సంఘాలు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామిక సంఘాలు, ఆధ్యాత్మిక సంస్థలు ఈ ఉద్యమంలో భాగస్వాములు కానున్నాయి. ఆసక్తి ఉన్నవారు 'మై భారత్' వేదిక ద్వారా నమోదు చేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు.

No comments:
Post a Comment